దంతేశ్వరి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Danteshwari Temple
పేరు
స్థానిక పేరు:Danteshwari Temple
దేవనాగరి:दंतेश्वरी
స్థానము
దేశము:భారత దేశము
రాష్ట్రము:ఛత్తీస్ గఢ్
జిల్లా:బస్తర్ జిల్లా
ప్రదేశము:Dantewada
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం:దంతేశ్వరి (Danteshwari (Shakti)
నిర్మాణ శైలి:హిందూ దేవాలయాల నిర్ణాణ శైలి
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణము)
14వ శతాబ్దం
నిర్మాత:చాళుక్య రాజులు

దంతేశ్వరి దేవాలయం దంతేశ్వరి దేవత కొలువున్న దేవాలయం. ఇది భారతదేశంలోని 52 శక్తి పీఠాలలో ఒకతిగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చాళుక్య రాజులచే నిర్మించబడింది. ఇది చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ తెహసీల్ నుండి 80 కి.మీ దూరంలో గల దంతెవాడ వద్ద ఉంది. కాకతీయుల కాలంలో దంతేశ్వరి దేవి నెలకొని యున్న ఈ ప్రాంతం కనుక ఈ గ్రామానికి దంతెవాడ అని పేరు వచ్చింది. సాంప్రదాయకంగా ఈ దేవత బస్తర్ జిల్లా వాసులకు కులదైవం.[1][2][3]

చారిత్రక ఇతిహాసాల ప్రకారం సత్య యుగంలో దక్షుని యజ్ఞం వద్ద సతీదేవి తన భర్తకు అవమానం జరిగినదని యజ్ఞ గుండం లోనికి ప్రవేశిస్తుంది. దానికి శివుడు సతీదేవి దేహంతో శివతాండవం చేస్తున్నప్పుడు సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక అచట శక్తి పీఠఖ్ కొలువైనట్లు కథనం.

ప్రతీ సంవత్సరం దసరా సందర్భంగా వేలాది గిరిజనులు వివిధ గ్రామాలు మరియు అడవుల నుండి ఇచ్చటికి చేరి ఈ దేవతా విగ్రహాన్ని బయటకు తీసి పట్టణం చుట్టూ ఊరేగిస్తారు. ప్రస్తుతం "బస్తర్ దసరా" పండగ అనేది ప్రాముఖ్యత గల పర్యాటకుల ఆకర్షణగా నిలిచింది.[4][5] నవరాత్రి సందర్భంగా జ్యోతికలశాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం.

విశేషాలు[మార్చు]

దంతెవాడ గ్రామం జగదల్‌పూర్ కు నైఋతి భాగంలో ఉంది. ఈ ప్రాంతంలో శంకిని మరియు ఢాకిని అనే పుణ్య నదులు ఉన్నాయి. ఈ రెండు నదులు వివిధ రంగులతో ఉంటాయి. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం భారత దేశంలో ప్రాచీన చారిత్రిక స్థలాలలో ఒకటి. బస్తర్ ప్రాంతంలో మత, సామాజిక, సాంస్కృతిక చరిత్రలో ఒకటిగా ఈ ప్రాంతం నిలుస్తుంది. భారత సాంస్కృతిక చరిత్రలో అనేక శాతాబ్దాల పాటు ఈ దేవాలయ సముదాయం ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో నిర్మాణ పరంగానూ మరియు శిల్పాల పరంగానూ మరియు పండగల సాంప్రదాయంలోనూ ఈ దేవాలయం ప్రముఖ స్థానం పొందింది.

బస్తర్‌ దసరా వేడుకలకు 500 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మహారాజ పురుషోత్తం దేవ్‌ పరిపాలన కాలంలో ఈ వేడుకలు ప్రారంభమైనట్లు చెబుతారు.కాకతీయులే ఇక్కడ దంతేశ్వరీ దేవి విగ్ర హాన్ని ప్రతిష్ఠించినట్లు కూడా కథనాలు వాడుకలో ఉన్నాయి. ఇక్కడ జరిగే 90 రోజుల వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది చివరి పదిరోజుల గురించి. ఆ పది రోజుల కాలంలో రాజు అధికా రికంగా ప్రధానపూజారిగా మారుతాడు. రాజరికాన్ని వదిలి పూర్తిగా దంతేశ్వరీ పూజలోనే గడు పుతాడు. అయితే తాత్కలికంగా రాజరికాన్ని వదిలి పెట్టినప్పటికీ వేగుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటాడు. పూజల సమయంలో రాజు ఉపవాస దీక్షను పాటిస్తాడు.[6]

ఇతిహాస గాథ[మార్చు]

Shiva carrying the corpse of Dakshayani

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక ఈ పీఠంలో దేవతను దంతేశ్వరి అని పిలుస్తారు.

నిర్మాణ శైలి[మార్చు]

దంతేశ్వరి మా యొక్క విగ్రహం నల్లని రాయితో చెక్కారు. ఈ ఆలయం గర్భాలయం, మహా మండపం, ముఖ్య మండపం మరియు సభ మండపం అనే నాలుగు భాగాలుగా విభజించబడింది. గర్భాలయం మరియు మహా మండపం లను రాతి ముక్కలతో నిర్మించారు. దేవాలయ ప్రవేశం ముందు ఒక గరుడ్ పిల్లర్ ఉంది. ఆలయం విశాలమైన ప్రాంగణం చుట్టూ అతిపెద్ద గోడలు ఉన్నాయి. శిఖరం విగ్రహాలు సొగసుతో అలంకరించబడి ఉంటుంది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]