దాక్షాయణి
దాక్షాయణి అంటే దక్ష ప్రజాపతి కూతురు అని అర్ధం. ఈమెకే సతీదేవి అని కూడా అంటారు. దక్షుడు స్వాయంభువ మన్వంతరంలో బ్రహ్మ కుడి బొటనవేలు నుంచి పుట్టాడు. ఇతని భార్య స్వాయంభువ మనువు కూతురైన ప్రసూతి. ఈమె కూతురే సతీదేవి. శివపురాణంలో సతీదేవి గురించి చక్కగా వర్ణించబడింది.
బ్రహ్మ తన కూతురైన సంధ్యాదేవిపైన మరులు గొనడాన్ని శివుడు అసహ్యించుకున్నాడు. బ్రహ్మ ఎలాగైనా పరమేశ్వరుడు కూడా ప్రేమ సముద్రంలో మునిగేట్లు చేయాలని పట్టుదల పూనాడు. విష్ణువు ఉపదేశించినట్లుగా బ్రహ్మ శక్తిని ప్రసన్నం చేసుకున్నాడు. శక్తి ప్రత్యక్షమై తాను దక్షపుత్రికగా జన్మించి శివుణ్ణి పరిణయమాడుతానని పలికింది.
దక్షయజ్ఞం
[మార్చు]అహంకారంతో విర్రవీగిన దక్షుడు తను జరుపుతున్న యాగానికి అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించలేదు. అయినా ఈశ్వరుడి సతీమణి, దక్షుడి కుమార్తె దాక్షాయణి తండ్రి చేసిన తప్పును తెలిపి ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించింది. శక్తి స్వరూపిణి దాక్షాయణి చేసిన నీతిబోధలు దక్షుడికి రుచించలేదు. దాంతో దక్షాయణి విరక్తి చెందింది. దక్షుడి అహంకారాన్ని అణచడానికి యాగం జరగకూడదని హోమాగ్నిలో దూకింది దాక్షాయణి అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. దక్షుడు చేయబూనిన యాగాన్ని నాశనం చేశాడు. దాక్షాయణి కళేబరాన్ని భుజంపై వేసుకుని రుద్రతాండవం ఆడాడు. అఖిలాండం దద్దరిల్లింది. భీతి చెందిన దేవతలు పరంధామున్ని సహాయం కొరకు ఆశ్రయించారు. ఈశ్వరుని క్రోధాన్ని తగ్గించి మామూలు స్ధితికి తీసుకురమ్మని వేడుకొన్నారు. పరంధాముడు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధం ఈశ్వరుని భుజంపై నిర్జీవంగా వున్న దాక్షాయణి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. దాంతో ఈశ్వరుడు తిరిగి మామూలు స్ధితికి చేరుకుని తప్పిదాన్ని తెలుసుకున్నాడు. "ఉమామహేశ్వరి శరీరన్లోని అవయవాలు ఎక్కడేక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలలో శక్తిపీఠాలు విలసిల్లాయి.
ద్రాక్షారామం
[మార్చు]దక్షప్రజాపతి యజ్ఞం చేసిన దక్షవాటికే కాలక్రమేణా ద్రాక్షారామం అయింది. ఈ యజ్ఞానికి పిలవకపోయినా మహాశివుని సతీమణి దాక్షాయణి వెళ్లడం అక్కడ ఆమెకు పరాభవం ఎదురైంది. ఆమె అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలిసిన పరమశివుడు రుద్రుడయ్యాడు. శివజఠాఝునుంచి ఆవిర్భవించిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసంచేస్తాడు. సతీవియోగాన్ని భరించలేని శివుడు దాక్షాయణి సూక్ష్మశరీరాన్ని సుదర్శనచక్రంలో 18 ఖండాలుగా చేస్తాడు. అవి పడినచోట అష్టశక్తులు ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. వాటిని శ్రీశంకరాచార్యులు అష్టయోగపీఠాలుగా రూపుదిద్దారు.
దాక్షాయణి ఆహుతి
[మార్చు]దాక్షాయణి ఆహుతి చేసుకున్న స్థలంలో భీమరూపంలో స్వయంభూవుడయ్యాడు. శివుడిని శాంతింపజేసేందుకు వీలుగా చంద్రుడు భీమేశ్వరుని చుట్టూ అష్టదిక్కులుగా శివలింగాలను ప్రతిష్టించాడు. అష్టసోమేశ్వరాలయాల నడుమ ద్రాక్షారామ భీమేశ్వరస్వామి భక్తులకు అభీష్టపరుడై బాసిల్లుతున్నాడు.
మూలాలు
[మార్చు]- ఆర్.వి.ఎస్.సుందరం: దాక్షాయణి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1997.