డిజేంద్ర కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డిజేంద్ర కుమార్

డిజేంద్ర కుమార్ (జననం 3 జూలై 1969) భారత సైనికదళంలో రాజపుతన రైఫిల్స్ రెజిమెంటు యొక్క రెండవ బెటాలియన్ లో మాజీ సభ్యులు. ఆయనకు 1999 ఆగష్టు 15మహావీర చక్ర పురస్కారం భారతదేశ ప్రభుత్వం నుండి లభించింది. ఆయన కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఆయన 2005 జూలై 31 న పదవీవిరమణ చేసారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన రాజస్థాన్ రాష్ట్రంలోని లికర్ జిల్లాకు చెందిన నీమ్-క-తానా తహసీల్ నందలి జలారా గ్రామ నివాసి. ఆయన జాట్ కుటుంబంలో 3 జూలై 1969 న జన్మించారు. ఆయన తల్లిపేరు రాజ్‌కౌర్. ఆమె తండ్రి బుజన్ శరావత్ సాతంత్ర్య సమరయోధుడు. వారు హర్యానా రాష్ట్రంనందలి మహేంద్రగడ్ జిల్లాలోని లారనౌల్ తహసీల్ లో సిరోహీ భాలీ గ్రామంలో నివసించేవారు. బుజన్ శరావత్ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ లో సైనికునిగా పనిచేసి రెండవ ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందారు. డిజేంద్ర కుమార్ యొక్క తండ్రి శివదాన్ సింగ్ ఆర్య సమాజం యొక్క సభ్యుడు. ఆయన దేశ స్వాతంత్ర్యోద్యమ సమయంలొ ప్రజలను చైతన్యపరచుటకు గ్రామగ్రామాలు పర్యటించారు. ఆయన భారత సైన్యంలో పనిచేసారు. ఆయన 1948 లో ఇండో పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డారు.[1] డిజేంద్ర కూమర్ కు ఒక కుమార్తె (సమిత), ఇద్దరు కుమారులు (జపెందెర్, మహావీర్). మహావీర్ జైపూర్ లోని శంకర్ పాఠశాల విద్యార్థి, జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు. జపేందర్ ధిల్లీ టెక్నలాజిల్ విస్వవిద్యాలయ విద్యార్థి. సమిత జాతీయ కబాడ్డీ క్రీడాకారిణి.

సైనిక జీవితం

[మార్చు]

ఆయన సెప్టెంబర్ 3, 1985 న రాజపుతన రైపిల్స్ యొక్క రెండవ బెటాలియన్ లో వృత్తి జీవితం ప్రారంభించారు. శిక్షణ పూర్తయిన తదుపరి ఆయన బెటాలియన్ సైనికులను కాశ్మీరు లో నియమించారు. [2] 1987లో ఆయన "ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్" కు ఎంపికయ్యారు. ఆయన శ్రీలంక లోని ఆపరేషన్ పవన్ లో పాల్గొన్నారు.

ఆపరేషన్ పవన్

[మార్చు]

ఆపరేషన్ పవన్ అనేది 1987 లో శ్రీలంక లోని ఎల్.టి.టి.ఇ నుండి జాఫ్నాను అధీనంలోనికి తెచ్చుటకు నియమించిన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ యొక్క సంకేత నామం. ఈ ఆపరేషన్ లో ఈ దళం సుమారు మూడు వారాలు పోరాడి జాఫ్నాను అధీనంలోనికి తెచ్చుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని శ్రీలంక సైనిక దళం అనేక సంవత్సరాల నుండి సాధించలేకపోయింది. భారతదేశ సైనిక దళానికి చెందిన ఆర్మీ ట్యాంకులు, హెలీకాప్టర్ గన్ షిప్స్, యితర సామాగ్రితో ఈ బృందం ఎల్.టి.టి.ఇ పై పోరాటం చేసింది. దీని ఫలితంగా 214 మంది సైనికులు మరణించారు.[3] కుమార్, వారి బృందం తమిళుల ప్రాబల్యం ఎక్కువగా గల ప్రాంతాలలో గస్తీ నిర్వహించారు. ఐదుగురు తమిల మిలిటెంట్లు కుమార్ దళంలోని ఐదుగురు సైనికులను కాల్చి చంపాయి. తరువాత కుమార్, మిగిలిన సైనుకులు మిలిటెంట్లను ఒక ఎమ్మెల్యే ఇంటి వరకు అనుసరించారు. కానీ ఆ ఎమ్మెల్యే సైనిక చర్యను వ్యతిరేకించాడు. కానీ జరిగిన యుద్ధంలో ఎమ్మెల్యే తో సహా ఐదుగురు తమిళ మిలిటెంట్లు మరణించారు. ఈ సంఘటన వివాదమై ఆయనకు జరీమానా విధించారు, రిమాడుకు పంపించారు.[1] కానీ ఎల్.టి.టి.ఇ భారత సైనిక దళంలోని 10వ పారాచూట్ రెజిమెంటు కు చెందిన 36 మంది సైనికులను బంధించింది. వారిని విడుదల చేసే చర్యల బాద్యతను కుమార్ కు అప్పగించారు. కుమార్ తనతో 50 కె.జీ ల ప్రేలుడు పదార్థంతో పాటు కొన్ని బిస్కట్లను పట్టుకొని నది ప్రయాణించాడు. కుమార్ భారత సైనికులను రక్షించాడు( ఈ సంఘటన జరిగిన 72 గంటలలో). ఆయన శత్రువుల ముఖ్యమైన ప్రేలుడుపదార్థాల డిపోను నాశనం చేసాడు, 39 మంది మిలిటెంట్లను హతమార్చాడు.[1]

కార్గిల్ యుద్ధంలో

[మార్చు]

1999 మే 5న అయిదుగురు భారత సైనికులను బంధించి, వారిని చిత్ర హింసలు పెట్టి చంపారు పాక్ సైనికులు. అక్కడి నుంచి మొదలైన పోరాటం చివరకు కార్గిల్ వార్ తో ముగిసింది. ఈ వార్ లో ఇండియా విజయం సాధించింది. అందులో డిజేంద్ర చూపిన తెగువ అంతా ఇంతా కాదు. పాకిస్థాన్ ఆక్రమించిన 15000 అడుగుల ఎత్తులో ఉన్న ద్రాస్ సెక్టారులోని 4590 పాయింటును తిరిగి స్వాధీనం చేసుకునే భాద్యతను డిజేంద్ర పనిచేస్తున్న రాజపుటాన రైఫిల్సుకు అప్పగించారు. ఇక్కడ మొదట పాకిస్థాన్ దే పైచెయ్యి అయ్యింది. ఈలోపు శ్రీనగర్ లోని మరొక ఆపరేషన్ ముగించుకుని వచ్చిన డిజేంద్ర ఆ బెటాలియన్ కు నాయకత్వం వహించారు. తను ఒక్కడే Light Machine Gunతో పాకిస్థాన్ సైనికులను అడ్డుకుని, మరొక దారిలో మన సైనికులను ఆ ప్రాంతానికి చేరేల చేసి, కేవలం రెండు రోజులలో 4590 పాయింటును ఆక్రమించాడు. తన ఒళ్ళంతా బుల్లెట్ గాయాలతో రక్తస్రావమవుతున్నప్పటికీ ఒంటి చేత్తో 48 మంది పాకిస్థాన్ సైనికులను చంపి జూన్ 13, 1999 రోజున 4590 పాయింటులో మన మువ్వన్నెల జెండా ఎగుర వేసి జాతి గౌరవాన్ని నిలబెట్టాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Ranwa, Mansukh (2008). Mahvir Chakradhari Digendra Kumar. Jaipur: Kalpana Publication, Nahargarh Road. p. 21. ISBN 81-89681-09-5.
  2. Mansukh Ranwa:Mahavir Chakradhari Digendra Kumar, Jaipur, 2008, p. 31
  3. "Operation Pawan. The Battle for Jaffna". Archived from the original on 2009-03-30. Retrieved 2016-06-18.

ఇతర లింకులు

[మార్చు]