జాకిర్ హుసేన్ (సంగీత విద్వాంసుడు)
జాకిర్ హుసేన్ కురేషీ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | జాకిర్ హుసేన్ కురేషీ |
జననం | 1951 మార్చి 9 |
మూలం | ముంబై, మహారాష్ట్ర |
సంగీత శైలి | హిందుస్తానీ, జాజ్ ఫ్యూజన్, ప్రపంచ సంగీతం |
వృత్తి | తబలా విద్వాంసుడు |
వాయిద్యాలు | తబలా |
క్రియాశీల కాలం | 1963–ప్రస్తుతం |
లేబుళ్ళు | HMV |
సంబంధిత చర్యలు | రిమెంబర్ శక్తి |
జాకిర్ హుసేన్ (జననం: మార్చి 9, 1951) ఒక ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు. ఆయనకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్నీ, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ అందజేసింది.[1] 1990 లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడెమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. 1999 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆయనకు ఆ దేశంలో సాంప్రదాయ కళాకారులకు, సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది.
Biography in Telugu
[మార్చు]హుసేన్ తండ్రి అల్లా రఖా కూడా ప్రఖ్యాత తబలా విద్వాంసుడే.[2] జాకిర్ ముంబై లోని మాహి అనే ప్రాంతంలో ఉన్న సెయింట్ మైకేల్ హైస్కూల్లో చదివాడు. తరువాత సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు.[3]
హుసేన్ ఒక బాల మేధావి. అతని తండ్రి అతనికి 3 సంవత్సరాల చిన్నవయసు నుండే పక్వాజ్ అనే సంగీత వాయిద్యాన్ని నేర్పడం ప్రారంభించాడు.[4] 11 సంవత్సరాలకే పర్యటించడం మొదలుపెట్టాడు. 1969 లో అమెరికా లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో సంగీతంలో డాక్టరేట్ సాధించడానికి వెళ్ళాడు. తరువాత అతను అంతర్జాతీయంగా సంవత్సరానికి సుమారు 150 దాకా ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాడు. [3][5]
కెరీర్
[మార్చు]అతని మొదటి ఆల్బం 1991 లో విడుదలైంది. 1992 లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బం గా గ్రామీ అవార్డు అందుకుంది. వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఈ అవార్డును ఆ ఏడాదే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేశారు.[2][3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]జాకీర్ హుసేన్ కథక్ నర్తకి, గురువైన ఆంటోనియా మిన్నెకోలా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె అతని మేనేజరు కూడా.[4] వారికి ఇద్దరు అమ్మాయిలు. అనిసా కురేషీ, ఇసబెల్లా కురేషీ. అనిసా లాస్ ఏంజిలెస్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి గ్రాడ్యుయేట్సినీ నిర్మాణ రంగంలో పనిచేస్తుంది. ఇసబెల్లా మన్ హట్టన్లో నృత్యం మీద అధ్యయనం చేస్తున్నది.[5]
జాకీర్ ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగంలో 2005 నుంచి 2006 మధ్యలో పూర్తి స్థాయి ఆచార్యుడిగా ఉన్నాడు.[6] స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుడు కూడా.[7] ఆయన ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో లో నివాసం ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.
- ↑ "The Global Drum Project". Planet Drum. Archived from the original on 25 February 2010.
- ↑ "Deconstructing 'world music' at the Grammys". Afrobeat Radio. 15 February 2010. Archived from the original on 28 జూన్ 2010. Retrieved 15 నవంబరు 2016.
- ↑ "Bharatnatyam in Jeans". Little India. Archived from the original on 2016-03-04. Retrieved 2016-11-28.
- ↑ "Ustad Zakir Hussain". Cultural India. Retrieved 31 December 2012.
- ↑ "Best Of Zakir Hussain – Tabla Samrat". Calcutta Music Blog. Archived from the original on 9 ఆగస్టు 2011. Retrieved 28 నవంబరు 2016.
- ↑ "Zakir Hussain Shivkumar Sharma". Carnegie Hall. Archived from the original on 15 మే 2008. Retrieved 28 నవంబరు 2016.