Jump to content

అల్లా రఖా

వికీపీడియా నుండి
అల్లా రఖా ఖురేషీ
1988 లో అల్లా రఖా
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఅల్లా రఖా ఖురేషి
జననం(1919-04-29)1919 ఏప్రిల్ 29
పాగ్వాల్, జమ్మూ కాశ్మీరు, బ్రిటిష్ ఇండియా.
మూలందోగ్రా ఇండియా
మరణం2000 ఫిబ్రవరి 3(2000-02-03) (వయసు 80)
ముంబయి, మహారాష్ట్ర, ఇండియా.
సంగీత శైలిహిందూస్థానీ సాంప్రదాయ సంగీతం
వాయిద్యాలుతబలా
సంబంధిత చర్యలుపండిట్ రవిశంకర్, జాకిర్ హుసేన్, ఆదిత్య కళ్యాణపుర్

ఖురేషి అల్లా రఖా ఖాన్ (Dogri: क़ुरैशी अल्ला रखा ख़ान) (ఏప్రిల్ 29 1919 - ఫిబ్రవరి 3 2000) అల్లా రఖా గా ప్రసిద్ధుడు.ఈయన భారతీయ తబలా కళాకారుడు. ఈయన రవిశంకర్కు ఎక్కువసార్లు వాద్య సహకారం అందించారు. ఈయన కొడుకు జాకిర్ హుసేన్ కూడా ప్రముఖ తబలా విద్వాంసుడే.

వ్యక్తిగత జీవితం , విద్య

[మార్చు]

అల్లారఖా 1919, ఏప్రిల్ 29 న జమ్ము, కాశ్మీర్ లోని ఫగ్వాల్‌లో జన్మించారు. ఆయన పూర్తి పేరు అల్లారఖా ఖురేషీ ఖాన్ సాహెబ్. ఆయన సితార్ విద్వాంసుడు రవిశంకర్‌కి ఎక్కువసార్లు వాద్యసహకారం అందించారు. ఈయన మాతృభాష డోగ్రీ. తన మామయ్య గుర్‌దాస్‌పూర్‌తో ఉంటున్నప్పుడు అల్లారఖాకి 12 వ ఏట నుంచే తబలా నుంచి వచ్చే రిథమ్, శబ్దం అంటే ఆసక్తి కలిగిందట. తబలా మీద ఉండే ఆసక్తితో అల్లారఖా ఇంటి నుంచి పారిపోయి, పంజాబీ ఘరానాకి చెందిన మియాన్ ఖాదర్ భక్ష్ దగ్గర తబలా సాధన ప్రారంభించారు.

ఆయన స్వరాన్ని, "రాగ విద్య"ను పాటియాలా ఘరానా ప్రసిద్ధుడైన "ఆశిక్ అలీ ఖాన్" వద్ద అభ్యసించారు. ఆయన అంకితభావంతొ రాగ నియమాలను ఆచరించడం అపూర్వం. అనేక గంటలపాటు క్రమశిక్షణతో సాధన చేసేవారు.

ఆయన "బావి బేగం"ను వివాహమాడారు. ఆయనకు ముగ్గురుకుమారులు ఇద్దరు కుమార్తెలు. వారిలో కుమారులు జాకిర్ హుసేన్, ఫజల్ ఖురేషి, టాఫిక్ ఖురేషి లు.కుమార్తె ఖుర్షిద్ ఆలియా నీ ఖురేషి. ఆయనకు తొమ్మిది మంది మనుమలున్నారు. ఆయన మరొక కూమర్తే "రజియా" ఆయన మరణించుటకు ముందురోజునే మరణించింది. ఆయన పాకిస్థాన్ కు చెందిన ఫైసలాబాద్ లో ఒక స్త్రీని వివాహమాడారు. 1980లలో రోహీ బానో, ప్రసిద్ధ టెలివిజన్ నటి కూడా ఈయన కుమార్తె.ఈమె ప్రస్తుతం జీవించి యున్నది. ఈయనకు సాబిర్ అనే మరొక సోదరుడున్నాడు. ఆయన కూడా లాహోర్లో తబలా విద్వాంసుడు.

కెరీర్

[మార్చు]

అల్లారఖా తన కెరీర్‌ను లాహోర్‌లో పక్కవాద్య కళాకారుడిగా ప్రారంభించారు. ఆ తరువాత 1940లో ముంబైలో ఆలిండియా రేడియోలో స్టాఫర్ అయ్యారు. ఉద్యోగంలో చేరిన మొదటి ఐదు సంవత్సరాలు తబలా సోలోగా వాయిస్తూ, దానిని ఎంతగానో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. 1943 - 48 మధ్య ప్రాంతంలో రెండు మూడు హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చారు.

ఆయన ప్రముఖ సంగీత విద్వాంసులైన "బడే గులాం ఆలీఖాన్", "అల్లాద్దీన్ ఖాన్", "విలాయన్ ఖాన్", "వసంత్ రాయ్", "ఆలీ అక్బర్ ఖాన్", "రవిశంకర్" లకు వాద్య సహకారాన్నందించారు. 1960 లలో ఆయనకు ప్రపంచ ఖ్యాతిని పొందిన రవిశంకర్ ఆయనకు ప్రముఖ గురువుగా నిలివారు. ఆయనకు ఎంతో కాలం వాద్య సహకారాన్నందించారు. ఆయన వాద్యం అనేక మందిని ఆకర్షించేది. వాద్యసహకారాన్నందిచడమే కాకుండా ఒక సోలోగాయకునిగా, ప్రసిద్ధమైన కంపోజర్గా కూడా గుర్తింపు పొందారు. వీరి భాగస్వామ్యం 1967 లో మోన్టేరీ పాప్ ఫెస్టివల్ వద్ద శంకర్ ప్రదర్శనలతోనూ, 1969 లో "వుడ్ స్టాక్ ఫెస్టివల్" తోనూ విజయవంతమైంది.

ఆయన శంకర ఛట్ర్జీ కి (1962 లో),ప్రఫుల్ల ఆతల్యే Archived 2014-01-07 at the Wayback Machine, ఆదిత్య కల్యాంపుర, అనురాధా పాల్, నిషికాంత్ బరోడెకర్, ఉదయ్ రామదాస్, శ్యాం కానే, ఆయన కుమారులైన టాఫిక్ ఖురేషి, ఫజల్ ఖురేషి లకు గురువుగా విద్యనందించారు. ఆయన పెద్ద కుమారుడు జాకీర్ హుసేన్ (సంగీతకారుడు) కూడా నిష్ణాత తబలా ఘనాపాటీ.

ప్రపంచ ప్రభావం

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

అల్లా రఖా ఖాన్ తబలా విద్వాంసునిగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతినార్జించాడు. "అబ్బాజీ" (ఆయన ఆరాధకుడు) కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతానికి మద్య గల అంతరాన్ని పూరించారు. ఈయన కర్ణాటక సంగీతకారులు, ఇతర హిందూస్థానీ సంగీతకారులకు వాద్యసహకారాన్నందిస్తూ ఈ పనిని సాధించగలిగారు. ప్రఖ్యాత అమెరికన్ పెర్క్యూసిన్ వాద్యకారులు అయిన "రాక్ ఎన్ ' రోల్ ", "మీకీ హార్ట్" వంటివారు అల్లా రఖా వాద్యంలోని మెళుకువలను, పద్ధతులను అధ్యయనం చేశరు. "మికీ హార్ట్" ప్రపంచ సంగీతంలో పెర్కుసన్ వాద్యం పై అధికార ప్రచురణ చేస్తూ ఇలా అన్నాడు "అల్లారఖా ఒక ఐన్‌స్టిన్, ఒక పికాసో; ఆయన ఈ గ్రహంలో లయబద్ధమైన అభివృద్ధి సాధించిన సరోన్నత వ్యక్తి". అల్లా రఖా 1968 లో "రిచ్ ఎ లా రఖా" అనే ఆల్బం నిర్మిచ్మిన జజ్ డ్రమ్మర్ తో కూడా పనిచేశాడు.[1] 1977లో పద్మశ్రీ అవార్డు,[2] 1982లో సంగీత నాటక అకాడెమీ అవార్డు,[3] 1995లో కాళిదాస్ సమ్మాన్ ఆయనను వరించాయి. 1985లో ముంబైలో ‘అల్లారఖా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్’ అనే సంస్థను ప్రారంభించారు. ఏప్రిల్ 29 2014 న గూగుల్ తన 95 వ జన్మదినం సందర్భంగా డూగుల్ లో ఆయనను ప్రస్తుతించి గౌరవించింది.

మరణం

[మార్చు]

అల్లా రఖా తన నివాసమైన "సిమ్లా హౌస్"లో ఫిబ్రవరి 3 2000లో గుండెపోటుతో మరణించారు. అంతకు ముందురోజే ఆయన కుమార్తె రజియా కూడా మరణించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. BBC Music Review of Rich a la Rakha
  2. "Padma Awards". Ministry of Communications and Information Technology (India). Archived from the original on 21 మే 2009. Retrieved 16 May 2009.
  3. "Sangeet Natak Akademi Awards – Hindustani Music – Instrumental". Sangeet Natak Academy. Archived from the original on 19 మే 2009. Retrieved 7 జనవరి 2020.

వనరులు

[మార్చు]
  1. Inlay notes to A Life Story of a Genius compilation CD set (Saregama India Ltd, 2006)

బయటి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=అల్లా_రఖా&oldid=4372753" నుండి వెలికితీశారు