లక్ష్మీపేట ఘటన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో దళితులపై అగ్రవర్ణాల నరమేథం జరిగింది. ఈ ఊచకోత రాష్ట్ర, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వివరాలు[మార్చు]

వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో బీసీలు, దళితుల మధ్య నెలకొన్న కక్షల నేపథ్యంలో 2012 జూన్ 12న జరిగిన దాడుల్లో ఐదుగురు దళితులు మృతి చెందగా, మరో 19 మంది క్షతగాత్రులయ్యారు. ఊచకోత ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపడం, దళిత, ఇతర ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి, సంఘటన జరిగిన లక్ష్మీపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని పట్టుబట్టాయి. దీనికి ప్రభుత్వం అంగీకరించి, అదనపు జిల్లా సెషన్స్, ప్రత్యేక న్యాయస్థానాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు భవన నిర్మాణాలు చేపట్టిన అనంతరం వాటిని 2014లో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి ప్రారంభించారు. మరోవైపు కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన సీఐడీ విభాగం చురుగ్గా దర్యాప్తు పూర్తి చేసింది.[1]

మడ్డువలస జలాశయంలో 220 ఎకరాల కోసం లక్ష్మీపేటలో రెండు వర్గాల మధ్య వివాదం గత రెండేళ్లుగా రాజుకుంటునే ఉంది. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసుల పికెట్ ఏర్పాటు చేసినా జరగరాని ఘోరం జరిగిపోయింది.[2]

గ్రామీణాభివృద్ధిశాఖ నివేదిక[మార్చు]

ప్రభుత్వ అసమగ్ర విధానాలకు సామాజిక అంతరాలు తోడు కావడంవల్లే శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితుల ఊచకోత సంఘటన చోటుచేసుకుందని గ్రామీణాభివృద్ధిశాఖ పేర్కొంది. గ్రామంలో కుల వివక్ష, అంటరానితనం తీవ్రస్థాయిలో కొనసాగుతోందని, ఈ విషయాలన్నీ జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసినా నిర్లక్ష్యం చేయడంతో ఊచకోతకు అవకాశం కల్పించినట్త్లెందని అభిప్రాయపడింది. మద్దువలస నీటి పారుదల ప్రాజెక్టు కోసం భూమి తీసుకున్న ప్రభుత్వం.. నిర్వాసితులకు అతి తక్కువ పరిహారం ఇవ్వడంతోపాటు పునరావాసం సరిగ్గా అమలు చేయకపోవడమూ ఒక కారణమని తెలిపింది. అంతేకాదు.. గ్రామంలో భూమిపై ఆధిపత్యం చెలాయించే పేరుతో దళితులకు గత ఏడాదిన్నర కాలంగా ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించకపోవడంతోపాటు వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు ఇవ్వలేదని నిర్థారించింది.[3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]