Jump to content

ఎ శివతాను పిళ్ళై

వికీపీడియా నుండి
ఎ శివతాను పిళ్ళై
జననం (1947-07-15) 1947 జూలై 15 (వయసు 77)
Nagercoil, తమిళనాడు
పౌరసత్వంభారతీయుడు
జాతీయతభారతీయుడు
రంగములుకేంద్రక భౌతికశాస్త్రం
Aerospace Engineering
Electrical Engineering
చదువుకున్న సంస్థలుThiagarajar College of Engineering (B.E.)
University of Pune (PhD)
Harvard University
ప్రసిద్ధిKnown as Father of Brahmos Aerospace[1]
ముఖ్యమైన పురస్కారాలుప్ద్మశ్రీ
2002
పద్మభూషణ్
2013
ఆర్డర్ అఫ్ ఫ్రెండ్‌షిప్
2014
గమనికలు
పిళ్ళై, పూర్వ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం కు సన్నిహితుడు

ఎ శివతాను పిళ్ళై భారతీయ శాస్త్రవేత్త. ఆయన ఇస్రోలో గౌరవ ఆచార్యుడుగా పనిచేస్తున్నాడు.[2][3] ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగు విభాగంలో గౌరవ ఆచార్యుడుగా పనిచేస్తున్నాడు.[4] భారతీయ శాస్త్ర విజ్ఞాన సంస్థలో విజిటింగ్ ప్రొఫెసరు.

13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎ శివతాను పిళ్ళై

ఆయన ప్రాజెక్ట్ మేనేజిమెంటు ఎసోసియేట్స్ కు అధ్యక్షుడు,[5] కురుక్షేత్ర నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గవర్నర్ల బోర్డు ఛైర్మన్.[6]

1996 నుండి 2014 వరకు DRDO లో పరిశోధన, అభివృద్ధి ఛీఫ్ కంట్రోలరుగా పనిచేసాడు. 1999 నుండి 2014 వరకు విశిష్ట శాస్త్రవేత్త (డిస్టింగ్విష్‌డ్ సైంటిస్ట్) స్థాయిని నిర్వహించారు.[7] బ్రహ్మోస్ ఏరోస్పేస్‌కు వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టరుగా పదవులు నిర్వహించారు.[8]

గతంలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజిమెంట్ ఎసోసియేషనుకు ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేసాడు.[9] భారత రష్యా ప్రభుత్వాల సైనిక-సాంకేతిక సహకార కమిషనుకు స్పెషల్ సెక్రెటరీగా కూడా పనిచేసాడు.

తొలి జీవితం, చదువు

[మార్చు]

అపతుకథ శివతాను పిళ్ళై అప్పటి ట్రావన్కూరు సంస్థానంలోని నాగర్‌కోయిల్‌లో 1947 జూలై 15 న జన్మించాడు. పాఠశాల విద్య డి.వి.డి హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదివి, 1969 లో యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో డిగ్రీ పొందాడు. 1991 లో హార్వర్డ్ బిజినెస్ స్కూలు నుండి అడ్వాన్స్‌డ్ మేనేజిమెంట్ ప్రోగ్రామ్ చేసాడు. 1996 లో యూనివర్సిటీ ఆఫ్ పూణె నుండి టెక్నాలజీ మేనేజిమెంట్‌లో ప్.హెచ్.డి, తుముకూరు యూనివర్సిటీ నుండి డి.ఎస్.సి పొందాడు.[10]

ఉద్యోగ జీవితం

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

ఇస్రో, DRDO

[మార్చు]

ఇస్రో, DRDO ల్లో పిళ్ళై నాలుగు దశాబ్దాలు పనిచేసాడు. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ లతో కలిసి పనిచేసాడు.[11]

1986 లో DRDO లో చేరాడు. అబ్దుల్ కలామ్ కింద సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో ప్రోగ్రామ్ డైరెక్టరుగా చేసాడు. ఎస్సెల్వి 3 అభివృద్ధి లోను, పి.ఎస్.ఎల్.వి రూపొందడంలోనూ పాత్ర పోషించాడు. 

బ్రహ్మోస్ ఏరోస్పేస్

[మార్చు]

కేంద్ర ప్రభుత్వ కేబినెట్ యొక్క అపాయింట్‌మెంట్స్ కమిటీ 2007 ఆగస్టులో అతని రిటైర్‌మెంటును మూడోసారి పొడిగించింది.[12][13][14] భారత రష్యాల సంయుక్త ప్రాజెక్టైన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి పిళ్ళైను పితగా భావిస్తారు[15] 2007 లో పిళ్ళై ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ఉండగా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ కంపెనీ కేరళ హైటెక్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసింది. దాన్ని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ట్రివేండ్రమ్ లిమిటెడ్‌గా మార్చి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క రెండవ క్షిపణి తయారీ కేంద్రంగా మార్చారు.[16][17]

పురస్కారాలు గౌరవాలూ

[మార్చు]
సంవత్సరం పురస్కారం పేరు![18] [19] పురస్కారం ఇచ్చిన సంస్థ
2014 జీవిత సాఫల్య పురస్కారం[20] రోటరీ ఇంటర్నేషనల్.
2014 లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం[21][22] లాల్ బహదూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెనెజిమెంట్
2014 ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్[23] రష్యా అధ్యక్షుడు
2013 పద్మభూషణ్[24] రాష్ట్రపతి
2009 DRDO Technology Leadership పురస్కారం ప్రధాన మంత్రి.
2009 Level A certification of Project Directorship The International Project Management Association (IPMA), Switzerland.
2008 గౌరవ డాక్టరేటు థాపర్ యూనివర్సిటీ, India.
2007 గౌరవ డాక్టరేటు అవినాశలింగం యూనివర్సిటీ, India.
2006 గౌరవ డాక్టరేటు భారతియార్ యూనివర్సిటీ, India.
2006 గౌరవ డాక్టరేటు State Marine Technical యూనివర్సిటీ of St. Petersburg, Russia.
2006 గౌరవ డాక్టరేటు ఆంధ్రా యూనివర్సిటీ, India.
2006 Raja Rammohan Puraskar పురస్కారం రక్షణ మంత్రిత్వ శాఖ.
2005 DRDO Performance Excellence పురస్కారం రక్షణ మంత్రిత్వ శాఖ.
2005 గౌరవ డాక్టరేటు Sathyabama యూనివర్సిటీ, India.
2005 గౌరవ డాక్టరేటు Tamil Nadu Dr. MGR Medical యూనివర్సిటీ, India.
2003 The Order of the Peter the Great and the Academician of the యూనివర్సిటీ The Moscow యూనివర్సిటీ of Security, Defence and Law Enforcement, Russia.
2003 పురస్కారం for dedicated service, co-operation, development and peace OISCA International, Japan.
2002 Padma Shri[25] రాష్ట్రపతి
2001 డా. డేవిడ్‌సన్ ఫ్రేమ్ పురస్కారం యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంట్, అమెరికా.
1988 DRDO సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ రక్షణ మంత్రిత్వ శాఖ.

పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, జర్నళ్ళు

[మార్చు]

శివతాను పిళ్ళై అనేక పుస్తకాలు రాసాడు, అనేక పరిశోధనా పత్రాలు, జర్నళ్ళలో కూడా రాసాడు.

  • The Path Unexplored (Publisher: Pentagon Press, Publication Year: 2014; ISBN 9788182747906).
  • Thoughts For Change — We Can Do It (Publisher: Pentagon Press, Publication Year: 2012; EAN: 9788182747074).
  • Envisioning an empowered nation: technology for societal transformation (Publisher: Tata McGraw-Hill Pub. Co., 2004; ISBN 978-0-07-053154-3).
  • Technology Leadership – A Revolution in the Making: defining the future visionary leaders (ISBN 9780070583283).
  • Nanoscience and Nanotechnology in Engineering: (Publisher: World Scientific, 2010; ISBN 978-981-4277-92-1).
  • Ocean Warfare: The Technology Waves (Publisher: Manas Publications, 2006; ISBN 978-81-7049-239-9).
  • Revolution In Leadership – Building Technology Competence (ISBN 9788182745520).
  • Nanotechnology Engineering in Nano- and Bio-Medicine: Devices and Applications (ISBN 9780470758632)

మూలాలు

[మార్చు]
  1. "NITT's four-day fest gets underway". 24 February 2012. Retrieved 24 February 2012.
  2. "For Trip To Mars, NASA Wants To Ride With ISRO". 28 February 2015. Retrieved 30 April 2016.
  3. "Time for India to join global space rule framing to avoid NPT like mistake, say experts". 28 February 2015. Retrieved 30 April 2016.
  4. "Dr. A. Sivathanu Pillai, IIT Delhi". Indian Institute of Technology Delhi. 21 April 2015. Retrieved 21 April 2015.
  5. "National Managing Committee (2015-2018) of the PMA India". Project Management Associates. 21 April 2015. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2015.
  6. "Dr. A. Sivathanu Pillai, Chairperson Board of Governors". National Institute of Technology, Kurukshetra. 17 September 2013. Archived from the original on 21 మే 2014. Retrieved 17 September 2013.
  7. "Profile, DRDO India: Sivathanu Pillai". DRDO, Ministry of Defence of Government of India. 4 June 2011. Archived from the original on 21 జూలై 2011. Retrieved 4 June 2011.
  8. "Profile, Brahmos India: Sivathanu Pillai". BrahMos Aerospace Private Limited. 4 June 2011. Archived from the original on 8 జూలై 2011. Retrieved 4 June 2011.
  9. "The Executive Board members of the International Project Management Association — Remits for year 2011 and 2012" (PDF). International Project Management Association. 31 July 2011. Archived from the original (PDF) on 2013-05-23. Retrieved 4 June 2011.
  10. "Sivathanu Pillai conferred Padma Shri". DRDO, Ministry of Defence of Government of India. May 2002. Archived from the original on 14 జనవరి 2012. Retrieved 30 June 2011.
  11. "India's space programme needs a visionary: Sivathanu Pillai". Malayala Manorama. India. 31 January 2016. Archived from the original on 2 ఫిబ్రవరి 2016. Retrieved 3 February 2016.
  12. "DRDO disowns chief controller, says he is retired". The Sunday Guardian. 17 November 2012. Archived from the original on 10 డిసెంబరు 2014. Retrieved 17 September 2013.
  13. "A Sivathanu Pillai: Extension as DRDO chief tenure extended". The Indian Express. 31 July 2007. Retrieved 4 June 2011.
  14. "Fight to retain India's leading missile scientist". Daily News and Analysis. India. 31 July 2007. Retrieved 4 June 2011.
  15. "PROFILE — BrahMos aerospace his baby". The Tribune. 5 December 2013. Retrieved 17 July 2014.
  16. "Missile man of India Sivathanu Pillai describes BrahMos plans". The Hindu. 31 December 2007. Retrieved 28 February 2012.
  17. "BrahMos takes over KELTEC". The Hindu. 6 December 2007. Retrieved 28 February 2012.
  18. "Official CV and full Profile: Sivathanu Pillai" (PDF). Brahmos Aerospace, India. 4 June 2011. Archived from the original (PDF) on 23 జూలై 2011. Retrieved 4 June 2011.
  19. "Sivathanu Pillai receives the Technology Leadership Award for year 2009 on May 26, 2010 from Prime Minister Dr. Manmohan Singh for his outstanding leadership in design, development, production and marketing of the BrahMos missile" (PDF). DRDO, Ministry of Defence of Government of India. 26 May 2010. Archived from the original (PDF) on 14 మార్చి 2012. Retrieved 25 June 2011.
  20. "After Missions to Moon and Mars, World Vies to Mine Heavenly Bodies". The New Indian Express. 15 October 2014. Archived from the original on 19 అక్టోబరు 2014. Retrieved 15 October 2014.
  21. "AS Pillai, father of BrahMos, gets Lal Bahadur Shastri Award". Business Line. 8 October 2014. Retrieved 15 October 2014.
  22. "President of India presented the Lal Bahadur Shastri National Award 2014". 7 October 2014. Retrieved 7 October 2014.
  23. "Russia honours BrahMos chief with 'Order of Friendship' award". Business Standard. 26 February 2014. Retrieved 3 March 2014.
  24. "BrahMos chief A Sivathanu Pillai to be conferred Padma Bhushan". The Economic Times. 19 April 2013. Archived from the original on 12 ఆగస్టు 2014. Retrieved 17 July 2014.
  25. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.

మరింత సమాచారం కోసం

[మార్చు]
  • Sieff, Martin (2009). Shifting superpowers: the new and emerging relationship between the United States, China, and India. Cato Institute. ISBN 978-1-935308-21-8.
  • Frankel, Francine R. (1995). Bridging the nonproliferation divide: the United States and India. University Press of America. ISBN 978-0-8191-9943-0.
  • Kalam, A P J Abdul (2010). Ignited Minds : Unleashing the Power within India. Pearson Education India. ISBN 978-81-317-2960-1.

బయటి లింకులు

[మార్చు]

ఇతరత్రా

[మార్చు]