ఆపరేషన్ కుకూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Operation Cocoon
నీలగిరి జీవావరణం రిజర్వ్ మ్యాప్, సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం చూపిస్తుంది.
నీలగిరి జీవావరణం రిజర్వ్ మ్యాప్, సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం చూపిస్తుంది.

ఆపరేషన్ కుకూన్ తమిళనాడు, కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో విస్తరించిన సత్యమంగళం అడవుల్లో ప్రఖ్యాతుడైన చందనం దొంగ వీరప్పన్, అతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆరంభించిన ఆపరేషన్. ఆపరేషన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ నాయకత్వంలో సాగింది. అక్టోబర్ 182004న వీరప్పన్, అతని అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చిచంపారు.  ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు.

వీరప్పన్ ప్రైవేటు సైన్యం (ఒక సమయంలో వందల సంఖ్యకు విస్తరించింది) నడుపుతూ కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు, భారత సరిహద్దు భద్రతా దళం లోని పారామిలటరీ ఫోర్సులను ముప్పుతిప్పలు పెట్టారు. 184మంది, అందులో దాదాపు సగం మంది పోలీస్ అధికారులు (ఫారెస్ట్ అధికారులు, ఉన్నతాధికారులు కలిపి) చంపిన కేసుల్లో వీరప్పన్ వాంటెడ్ గా ఉండేవారు. 200 ఏనుగులను అక్రమంగా చంపి, యుఎస్ డాలర్లు 2.6 మిలియన్ల రూపాయల విలువైన ఏనుగు దంతాలు, దాదాపు యూఎస్ డాలర్లు 22మిలియన్ల విలువైన 10వేల టన్నుల చందనం చెక్కను అక్రమ రవాణా చేసినందుకూ అతను మోస్ట్ వాంటెడ్ గా నిలిచారు.

1991లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నెలకొల్పి వీరప్పన్ ను పట్టుకునేందుకు చేపట్టిన ప్రయత్నం సంవత్సరాలు గడిచేకొద్దీ దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా నిలిచింది.

నేపథ్యం[మార్చు]

వీరప్పన్ (కూసె మునిస్వామి వీరప్పన్, [1] 1952 జనవరి 18 – 2004 అక్టోబర్ 18), "గంధపుచెక్కల వీరప్పన్"గానూ సుప్రసిద్ధుడైన, భారతీయ బందిపోటు. ఆయన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 6వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో సంవత్సరాల పాటు తన కార్యకలాపాలు నిర్వహించారు. దశాబ్దం పాటు పెద్ద ప్రైవేటు సైన్యాన్ని నిర్వహిస్తూ తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలను, భారత సరిహద్దు భద్రతా దళాల్లోని పారామిలటరీ దళాన్నీ ముప్పుతిప్పలు పెట్టారు. సీనియర్ పోలీస్ అధికారులు, అటవీ అధికారులతో సహా దాదాపు 184మందిని చంపారు, వారిలో సగం మంది పోలీసులే.  నక్కీరన్ పత్రిక సంపాదకుడు ఆర్. గోపాల్ ఇంటర్వ్యూలో దాదాపు 120 హత్యలను తానే చేసినట్టు అంగీకరించారు. ప్రారంభ దశలో ఆర్థికంగా తనకు కలసివచ్చే దోపిడీలకే పరిమితమైన వీరప్పన్ క్రమంగా తన కార్యకలాపాలను కిడ్నాప్ చేసి జైల్లోని తీవ్రవాదులను విడిచిపెట్టేందుకు డిమాండ్ చేయడం వంటివీ ప్రారంభించారు.

తన అక్రమ వ్యాపారాలను వ్యతిరేకించిన చిదంబరం అనే అటవీ అధికారిని హత్య చేయడంతో వీరప్పన్ మొదట వార్తల్లోకి ఎక్కారు. 1991లోకర్ణాటక రాష్ట్రానికి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా పనిచేసిన పి.శ్రీనివాస్ ను చంపి, తలను కాళీ ఆలయం వద్ద వేరుచేశారు. తర్వాతి సంవత్సరాల్లో తన అక్రమ వ్యాపారానికి అడ్డువస్తారని భావించిన పోలీసు అధికారులు, గిరిజనులను పదుల సంఖ్యలో చంపారు. 1997లో కర్ణాటక అటవీ అధికారులను అపహరించి, నక్కీరన్ సంపాదకుడు మధ్యవర్తిగా అనేక దఫాల సంప్రదింపులు జరిగాకా చివరకు విడుదల చేశారు. అదే సంవత్సరం 21మంది పర్యాటకుల్ని అపహరించి వారికి ఏ హానీ చేయకుండా విడిచిపెట్టారు. [2] 2000లో కన్నడ నటుడు, కన్నడ కంఠీరవుడిగా ప్రఖ్యాతి చెందిన రాజ్ కుమార్  ను అపహరించినప్పుడు వీరప్పన్ జాతీయవ్యాప్తంగా వెలుగులోకి వచ్చారు.[3][4] వీరప్పన్ చేసిన ఆఖరి పెద్ద నేరం కర్ణాటక మాజీ మంత్రి నాగప్ప అపహరణ. తదనంతరం నాగప్ప మృతదేహం అడవిలో దొరికింది, ఐతే తాను హత్యచేయలేదంటూ వీరప్పన్ వివరణ ఇచ్చారు.[2] 200 ఏనుగులను అక్రమంగా చంపి, యుఎస్ డాలర్లు 2.6 మిలియన్ల రూపాయల విలువైన ఏనుగు దంతాలు, దాదాపు యూఎస్ డాలర్లు 22మిలియన్ల విలువైన 10వేల టన్నుల చందనం చెక్కను అక్రమ రవాణా చేసినందుకూ అతను మోస్ట్ వాంటెడ్ గా నిలిచారు. అతన్ని పట్టుకున్నవారికి రు.5కోట్లు ఇస్తామని నజరానా ప్రకటించారు, ఐనా వీరప్పన్ 2004లో పోలీసుల కాల్పుల్లో మరణించేవరకు 20 సంవత్సరాల పాటు తప్పించుకు తిరిగారు. [5]

ఆపరేషన్[మార్చు]

వీరప్పన్ ని పట్టుకునేందుకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన జాయింట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) కార్యకలాపాలు 1991లో ప్రారంభమయ్యాయి, ఈ ఆపరేషన్ సంవత్సరాలు గడిచేకొద్దీ మొత్తానికి రూ.100కోట్ల ఖర్చు అవ్వడంతో భారతదేశ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆపరేషన్లలో ఒకటిగా పేరొందింది.[2] గిరిజనుల సహకారంతో పోలీసులు శత్రు శిబిరంలో చొరబడి, రహస్యాలు సేకరించడం వంటి  వ్యూహాలు దీన్లో ఇమిడివున్నాయి. అటవీ ప్రాంతం అడుగడుగూ వీరప్పన్ కు తెలిసివుండడంతో, అతనిని అడవి బయటకు రప్పించేందుకు ప్రణాళిక వేశారు.[6] వీరప్పన్ ను చంపే తుది ప్రయత్నం పోలీసుల కథనం ప్రకారం, పది నెలల పాటు ప్రణాళిక, 3 వారాల అమలు, తుది ఆపరేషన్ కేవల 45 నిమిషాల పాటు సాగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ మనుషులు వీరప్పన్ సంచరిస్తారని అంచనా వేసుకున్న గ్రామాల్లో అమ్మకందార్లుగా, కూలీలుగా, స్థానిక చిరుద్యోగులుగా వేషాలు వేసుకుని చొరబడ్డారు. సంవత్సరాలుగా వయసు మీదపడుతూ ఉండడం, అతని దళ సభ్యుల్ని పోలీసులు చంపడం వంటి కారణాలతో చివరకు వీరప్పన్ దళం నలుగురికి కుంచించుకుపోయింది. అడవి బయటకు తప్పించుకుని దక్షిణ ఆర్కాట్ లో కంటికి వైద్య చికిత్స చేయించుకుందామని వీరప్పన్ ప్రణాళిక వేసుకున్నారు.[2] పోలీస్ ఆపరేషన్ జరిగిన రోజు ధర్మపురి జిల్లాలోని పపిరప్పటి గ్రామం వద్ద ఉన్న అంబులెన్స్ వద్దకు వీరప్పన్ సంరక్షకులతో వెళ్తున్నారు. ఐతే నిజానికి ఆ అంబులెన్స్ గ్యాంగులో రహస్యంగా  చొరబడ్డ పోలీస్ చేర్చిన పోలీస్ వాహనం. 35 మంది పోలీస్ ట్రూప్  గ్రామంలో వేచి ఉన్నారు. వారిలో కొందరు రక్షక దళాలు సెక్యూరిటీ టాంకర్లతో రోడ్లపైనా, ఇతరులు రహస్యంగా పొదలచాటున నక్కారు. పోలీసు మనిషి అయిన అంబులెన్స్ డ్రైవర్ వీరప్పన్ దళం నుంచి సమయానికి తప్పించుకున్నారు. పోలీస్ కథనం ప్రకారం, వీరప్పన్, అతని గ్యాంగ్ సభ్యులను లొంగిపొమ్మని పోలీసులు హెచ్చరించారు, వారు దానికి అంగీకరించక స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యులపై కాల్పులు ప్రారంభించారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వారు ప్రతిఘటిస్తూ గ్రెనేడ్లు, తుపాకులతో కాల్పులు చేశారు. వీరప్పన్ అక్కడికక్కడే మరణించగా, అతని దళ సభ్యుడు అంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్తున్న మార్గంలో మరణించారు. ఆపరేషన్ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ 12 బోర్ రెమింగ్టన్ పంప్ యాక్షన్ తుపాకీలు, యాక్షన్ గన్, రెండు ఎకె-47లు, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, రెండు హ్యాండ్ గ్రనేడ్లు, రూ.3.5 లక్షల క్యాష్  దొరికాయి.[7]

పోలీసులు విడుదల చేసిన ఫైల్ ఫోటోను ప్రకారం వీరప్పన్ మృతదేహంపై నుదుటి మీద ఒకటి, పక్కటెముకలు, తొడల్లో చెరొకటి మొత్తం మూడు బుల్లెట్ దెబ్బలు తగిలాయి. అతన్ని ధర్మవరం హాస్పిటల్లో ఉండగా అనేకమంది ప్రజలు అతని మృత శరీరాన్ని అనుమతి లేకున్నా సందర్శించేందుకు వచ్చారు. పోలీసులకు ఆసుపత్రి బయటి గుంపును నియంత్రించడమే కష్టమైంది.[8] వీరప్పన్ శరీరానికి అంత్యక్రియలు చేయడం కూడా చిన్నపాటి వివాదానికి కారణమైంది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వీరప్పన్ మృతదేహాన్ని దహనం చేయడాన్ని వ్యతిరేకించారు, అతని సోదరుడి గృహంలో ఉంచాలని పట్టుబట్టారు. అంత్యక్రియలు చేసే హక్కు కుటుంబసభ్యులకే ఉంటుందనివారు వాదించారు.[9]

వివాదాలు[మార్చు]

వీరప్పన్ ని చంపిన ఆపరేషన్ పలు వివాదాలు రేకెత్తించింది. వీరప్పన్ సాధారణంగా పెద్ద మీసంతో ప్రాచుర్యం పొందారు, మృతదేహానికి మీసాలు లేవు. దాంతో పలువురు ఈ మృతదేహం వీరప్పన్ ది కాదని సందేహించారు. పోలీసులు వేలిముద్రల ద్వారా గుర్తింపు నిర్ధారించారు. వీరప్పన్ బంధువులతో కూడా నిర్ధారించుకున్నారు. బుల్లెట్ దెబ్బలు తగిలిన విధానం పోలీసులు ఎన్ కౌంటర్ గురించి చెప్తున్న కథనానికి సరిపోలలేదని కొందరు వాదించారు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులు, బాలిస్టిక్ నిపుణుల పరిశీలనలు పోలీసుల కథనాన్ని ఆమోదించాయి. వీరప్పన్ ని బ్రతికివుండగానే పట్టుకుని రాజకీయ కారణాలతోనే హత్యచేశారని మీడియాలోని కొన్ని వర్గాలు ఆరోపించాయి. అతన్ని సజీవంగానే పట్టుకుని, విచారించి ఉంటే ఎన్నో బయటకు తెలియని వాస్తవాలు వెలుగుచూసేవని అభిప్రాయపడ్డారు. కాల్పులు ప్రారంభమయ్యాకా ఎదురుదాడి, ఆత్మరక్షణల కోసమే తాము కాల్పులు ప్రారంభించామని పోలీసులు వివరణనిచ్చారు. వీరప్పన్ తనను సమర్థించుకునే ప్రయత్నాలు చేసేందుకు న్యాయబద్ధమైన అవకాశాన్ని ఇవ్వలేదని మానవ హక్కుల కార్యకర్తలు ధ్వజమెత్తారు.[6]

తర్వాతి పరిణామాలు[మార్చు]

ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసు అధికారులందరికీ తమిళనాడు ప్రభుత్వం రివార్డులిచ్చింది. ప్రత్యక్షంగా ఆపరేషన్లో పాల్గొన్న కొందరు అధికారులకు డబుల్ ప్రమోషన్ లభించింది. వీరప్పన్ జీవితం, ఆపరేషన్ కుకూన్ రెండు సినిమాలకు ప్రేరణగా నిలచింది. వీరప్పన్ జీవితగాథను ఇతివృత్తంగా సంతానకుడు అన్న 125 ఎపిసోడ్ల టెలీ సీరియల్ 2007లో మక్కల్ టీవీలో ప్రసారమై వివాదాస్పదమైంది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఈ సీరియల్ ప్రసారం తమ కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందంటూ ప్రసారాలకు వ్యతిరేకంగా సెషన్స్ కోర్టులో  కేసు వేసి, కేసును ఓడిపోయారు.[10] కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ జంగల్ లాడ్జస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ 2010 కొత్త అటవీ శిబిరాలు నిర్వహించింది. వాటిలో ఒకటి వీరప్పన్ జీవించిన గోపీనాథమ్ ప్రాంతాన్ని కవర్ చేసింది. పర్యటనలో బిఆర్ ,  ఎంఎం కొండలపైకి ట్రెక్కింగ్, వీరప్పన్ జీవించిన ప్రాంతాల గురించి, అతను అపహరించిన వ్యక్తులను ఉంచిన ప్రాంతాల గురించి శిక్షణ పొందిన స్థానిక గైడ్  తో వివరణ వంటివి ఉన్నాయి.[11] ఈ ఆపరేషన్ కి గాను కె. విజయ కుమార్ రాష్ట్రపతి శౌర్య పతకాన్ని పొందారు.[12] 2016లో ఆపరేషన్లో కె. విజయ కుమార్, ఎన్. కె. సెంతమరై కణ్ణన్ ల పాత్ర హైలైట్ చేస్తూ రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో కిల్లింగ్ వీరప్పన్ చలన చిత్రాన్ని తెరకెక్కించారు.[13][14]

నోట్స్, మూలాలు[మార్చు]

  1. "Bandit's footprints". The Economic Times. TNN. 19 October 2004. Retrieved 11 December 2012.
  2. 2.0 2.1 2.2 2.3 "India's most wanted, Veerappan shot dead". India Abroad. 20 October 2004. Archived from the original on 11 జూన్ 2014. Retrieved 1 January 2014.
  3. Krupakar 2011, p. 7
  4. K.G. 2004, p. 322
  5. "Police kill India's 'Robin Hood' - Oct 18, 2004". CNN.com. 19 October 2004. Retrieved 19 September 2010.
  6. 6.0 6.1 V., Vaikunth (26 October 2004). "Operation Cocoon". The Hindu. Archived from the original on 4 నవంబరు 2008. Retrieved 1 January 2014.
  7. V.S., Palaniappan; S., Prasad (20 October 2004). "Veerappan walked into a well-laid trap". The Hindu. Dharmapuri. Archived from the original on 27 డిసెంబరు 2013. Retrieved 1 January 2014.
  8. "Koose Muniswamy Veerappan: The Bandit King He has been described as India's answer to Robin Hood. But Koose Muniswamy Veerappan was a ruthless killer who admitted to 120 murders before he died in a hail of police bullets on Monday. Justin Huggler tries to sort the facts from the fiction in a life that has already become legend". Belfast Telegraph. 20 October 2004. Archived from the original on 11 జూన్ 2014. Retrieved 1 January 2014.
  9. R., Ilangovan (19 October 2004). "Row over cremation". The Hindu. Mettur. Archived from the original on 27 జూలై 2013. Retrieved 1 January 2014.
  10. "Sandalwood smuggler Veerappan's widow to stall telecast of TV series on his life". Archived from the original on 2014-06-11. Retrieved 2016-04-24.
  11. "The ballad of Veerappan will now be available for a mere song". Mail Today. 5 September 2010. Archived from the original on 11 జూన్ 2014. Retrieved 1 January 2014.
  12. "Veerappan hunter takes over as CRPF boss". Mail Today. 7 October 2010. Archived from the original on 11 జూన్ 2014. Retrieved 1 January 2014.
  13. "Meet Senthamaraikannan, the supercop Shivarajkumar plays in Killing Veerappan". The News Minute.
  14. "The end of Veerappan".

సంబంధిత పేజీలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]