Jump to content

ఖలేదా జియా

వికీపీడియా నుండి
(ఖలేడా జియా నుండి దారిమార్పు చెందింది)
బేగం ఖలేదా జియా

బేగం ఖలేదా జియా (జననం 15 ఆగస్టు 1945[1]), బంగ్లాదేశ్ రాజకీయ నాయకురాలు. ఆమె రెండు సార్లు బంగ్లాదేశ్  ప్రధాన మంత్రిగా చేశారు. 1991 నుంచి 1996 వరకు, తిరిగి 2001 నుంచి 2006 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు ఖలేదా. 1991లో ఆమె ప్రధాని అయ్యే నాటికి బంగ్లాదేశ్ దేశ చరిత్రలో ఖలేదానే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ముస్లిం చరిత్రలో పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజిర్ భుట్టో తరువాత రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు ఖలేదా. ఆమె భర్త జియావుర్ రెహమాన్ రాష్ట్రపతిగా ఉండగా, బంగ్లాదేశ్ దేశ తొలి పౌరురాలిగా ఉన్నారు. 70లలో ఖలేదా భర్త రహమాన్ స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఆమే చైర్ పర్సన్ గా వ్యవహరించారు.[2]

1982లో ఆర్మీ చీఫ్ జనరల్ హుస్సేన్ మహమ్మద్ ఇర్షాద్ ఆధ్వర్యంలో జరిగిన మిలట్రీ తిరుగుబాటును అణిచి, తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలిపేందుకు ఆమె ఎంతగానో కృషి చేశారు. దాని ఫలితంగా 1991లో బి.ఎన్.పి గెలుపుతో ఖలేదా ప్రధన మంత్రిగా ఎన్నికయ్యారు. 1996లో కొన్నాళ్ళు కూడా ప్రధానిగా చేశారు. అయితే ఆమె ప్రభుత్వం నిలవలేదు. మళ్ళీ జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ గెలిచింది. 2001లో మళ్ళీ జరిగిన ఎన్నికల్లో జియా పార్టీనే గెలిచింది. 1991,1996,2001లలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె 5 వేర్వేరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచీ గెలిచారు.

ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన స్త్రీల జాబితాలో 2004లో 14వ స్థానంలో, 2005లో 29వ స్థానంలో, 2006లో 33వ స్థానంలో నిలిచారు జియా[3][4][5]

2006లో ఖలేదా ప్రభుత్వ టర్మ్ పూర్తయ్యాకా, 2007 ఎన్నికలు ఆలస్యమయ్యాయి. జియా, ఆమె కుమారులు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో మిలటరీ, ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకుంది. 

రెండు దశాబ్దాలుగా ఖలేదాకు ప్రత్యర్ధిగా అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు స్త్రీలు 1991 నుంచీ ఒకరి తరువాత ఒకరు ప్రధానమంత్రులుగా అధికారంలోకి వస్తున్నారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Zia, Begum Khaleda". Banglapedia. 2012. Retrieved 9 July 2015.
  2. V6 Velugu (6 August 2024). "ఆ రోజు షేక్ హసీనా జస్ట్ మిస్.. వామ్మో.. ఖలీదా జియా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే." Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "#14: Begum Khaleda Zia, Prime Minister of Bangladesh". Forbes 100 Most Powerful Women in the World. 2004. Archived from the original on 14 June 2012. Retrieved 4 February 2014.
  4. "#29 Khaleda Zia, Prime minister, Bangladesh". The 100 Most Powerful Women. Forbes.com. 2005. Retrieved 4 February 2014.
  5. "#33 Khaleda Zia, Prime Minister, Bangladesh". The 100 Most Powerful Women. 31 August 2006. Retrieved 4 February 2014.
  6. Skard, Torild (2014) "Khaleda Zia" in Women of Power - Half a century of female presidents and prime ministers worldwide, Bristol: Policy Press, ISBN 978-1-44731-578-0