Jump to content

ఖలేదా జియా

వికీపీడియా నుండి
బేగం
ఖలీదా జియా
খালেদা জিয়া
2010లో జియా
9వ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి
In office
10 అక్టోబర్ 2001 – 29 అక్టోబర్ 2006
అంతకు ముందు వారు
  • లతీఫుర్ రెహమాన్
  • (ముఖ్య సలహాదారుగా)
తరువాత వారు
  • ఇయాజుద్దీన్ అహ్మద్
  • (ముఖ్య సలహాదారుగా)
In office
20 మార్చి 1991 – 30 మార్చి 1996
అధ్యక్షుడు
అంతకు ముందు వారుకాజీ జాఫర్ అహ్మద్
తరువాత వారు
  • ముహమ్మద్ హబీబుర్ రెహమాన్
  • (ముఖ్య సలహాదారుగా)
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ
In office
10 మే 1984 – 30 డిసెంబర్ 2025
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్
  • ముస్తాఫిజుర్ రెహమాన్
  • కె.ఎమ్. ఒబైదుర్ రెహమాన్
  • అబ్దుస్ సలామ్ తాలూక్దార్
  • అబ్దుల్ మన్నన్ భుయాన్
  • ఖందకర్ డెల్వర్ హుస్సేన్
  • మీర్జా ఫకృల్ ఇస్లాం ఆలంగీర్
అంతకు ముందు వారుఅబ్దుస్ సత్తార్ (అధ్యక్షుడు)
తరువాత వారుతారిఖ్ రెహమాన్ (తాత్కాలిక)
4వ ప్రతిపక్ష నాయకురాలు (బంగ్లాదేశ్)
In office
29 డిసెంబర్ 2008 – 9 జనవరి 2014
ప్రధాన మంత్రిషేక్ హసీనా
అంతకు ముందు వారుషేక్ హసీనా
తరువాత వారురౌషన్ ఎర్షాద్
In office
23 జూన్ 1996 – 15 జూలై 2001
ప్రధాన మంత్రిషేక్ హసీనా
అంతకు ముందు వారుషేక్ హసీనా
తరువాత వారుషేక్ హసీనా
6వ బంగ్లాదేశ్ ప్రథమ మహిళ
హోదాలో
21 ఏప్రిల్ 1977 – 30 మే 1981
అధ్యక్షుడుజియార్ రెహమాన్
అంతకు ముందు వారుషేక్ ఫజిలాతున్నెస్సా ముజీబ్
తరువాత వారురౌషన్ ఎర్షాద్
7వ సభానాయకురాలు (బంగ్లాదేశ్)
In office
10 అక్టోబర్ 2001 – 29 అక్టోబర్ 2006
అంతకు ముందు వారుషేక్ హసీనా
తరువాత వారుషేక్ హసీనా
In office
20 మార్చి 1991 – 30 మార్చి 1996
అంతకు ముందు వారుకాజీ జాఫర్ అహ్మద్
తరువాత వారుషేక్ హసీనా
పార్లమెంటు సభ్యురాలు (బంగ్లాదేశ్)
In office
29 డిసెంబర్ 2008 – 9 జనవరి 2014
అంతకు ముందు వారుసయీద్ ఇస్కందర్
తరువాత వారుషిరిన్ అక్తర్
నియోజకవర్గంఫెనీ-1
In office
1 అక్టోబర్ 2001 – 29 అక్టోబర్ 2006
అంతకు ముందు వారుజాఫర్ ఇమామ్
తరువాత వారుముహమ్మద్ జమీరుద్దీన్ సర్కార్
నియోజకవర్గంబోగ్రా-6
In office
20 మార్చి 1991 – 15 జూలై 2001
అంతకు ముందు వారుజాఫర్ ఇమామ్
తరువాత వారుసయీద్ ఇస్కందర్
నియోజకవర్గంఫెనీ-1
వ్యక్తిగత వివరాలు
జననం
ఖలీదా ఖానమ్

(1946-08-15)1946 ఆగస్టు 15
జల్పాయిగురి, బెంగాల్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత పశ్చిమ బెంగాల్, భారత్)
మరణం2025 డిసెంబరు 30(2025-12-30) (వయసు: 79)
ఢాకా, బంగ్లాదేశ్
సమాధి స్థలంజియార్ రెహమాన్ సమాధి
జాతీయత
  • బ్రిటిష్ ఇండియా (1946–1947)
  • భారత్ (1947–1950)
  • పాకిస్థాన్ (1950–1971)
  • బంగ్లాదేశ్ (1971–2025)
రాజకీయ పార్టీబంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (1982–2025)
ఇతర రాజకీయ
పదవులు
  • 7 పార్టీల కూటమి (1983–1999)
  • నాలుగు పార్టీల కూటమి (1999–2012)
  • 18 పార్టీల కూటమి (2012–2022)
  • జాతీయ ఓక్య ఫ్రంట్ (2018–2022)
జీవిత భాగస్వామిజియార్ రెహమాన్
సంతానంతారిఖ్ రెహమాన్, అరాఫత్ రెహమాన్
బంధువులుమజుందార్-జియా కుటుంబం
సంతకం
మారుపేరుపుతుల్

బేగం ఖలేదా జియా (జననం 1945 ఆగస్టు 15 - మరణం 2025 డిసెంబర్ 30)[1], బంగ్లాదేశ్ రాజకీయ నాయకురాలు. ఆమె బంగ్లాదేశ్  ప్రధాన మంత్రిగా రెండు సార్లు - 1991 నుంచి 1996 వరకు, తిరిగి 2001 నుంచి 2006 వరకు పనిచేసారు. 1991లో ఆమె ప్రధాని అయ్యే నాటికి బంగ్లాదేశ్ దేశ చరిత్రలో ఖలేదానే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ముస్లింలలో ఆమె పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజిర్ భుట్టో తరువాత రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించింది. ఆమె భర్త జియావుర్ రెహమాన్ రాష్ట్రపతిగా ఉండగా, బంగ్లాదేశ్ దేశ తొలి పౌరురాలిగా ఉన్నది. 70లలో ఖలేదా భర్త రహమాన్ స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఆమే చైర్ పర్సన్ గా వ్యవహరించింది.[2]

1982లో ఆర్మీ చీఫ్ జనరల్ హుస్సేన్ మహమ్మద్ ఇర్షాద్ ఆధ్వర్యంలో జరిగిన మిలట్రీ తిరుగుబాటును అణిచి, తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలిపేందుకు ఆమె ఎంతగానో కృషి చేసింది.[3] దాని ఫలితంగా 1991లో బి.ఎన్.పి గెలుపుతో ఖలేదా ప్రధన మంత్రిగా ఎన్నికయింది. 1996లో కొన్నాళ్ళు ప్రధానిగా చేసింది. అయితే ఆమె ప్రభుత్వం ఎంతో కాలం నిలవలేదు. మళ్ళీ జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ గెలిచింది. 2001లో మళ్ళీ జరిగిన ఎన్నికల్లో ఖలేదా జియా పార్టీనే గెలిచింది. 1991, 1996, 2001లలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె 5 వేర్వేరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచీ గెలిచింది.

ఖలేదా జియా దేశంలో కేర్ టేకర్(Care Taker) ప్రభుత్వ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారామె. ఖలీదా ప్రధానిగా ఉన్న కాలంలో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో బీఎన్పీని భారత్ వ్యతిరేక పార్టీగా కొందరు పరిగణించారు. ఓ అవినీతి కేసులో 2018 నుంచి 2020 మధ్య జైలు జీవితం అనుభవించారు జియా.

ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన స్త్రీల జాబితాలో 2004లో 14వ స్థానంలో, 2005లో 29వ స్థానంలో, 2006లో 33వ స్థానంలో ఆమె నిలిచింది.[4][5][6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఖలీదా ఖానం పుతుల్ గా పిలవబడే ఆమె 1946 ఆగస్టు 15న అవిభాజ్య భారత్‌లోని దినాజ్‌పుర్‌ జిల్లాలో తయ్యబా, ఇస్కందర్‌ మజుందార్‌ దంపతులకు జన్మించారు. 1960లో ఖాలిదా పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్న జియావుర్‌ రహ్మాన్‌ను వివాహం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌కు జియావుర్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 మే 30న సైనిక తిరుగుబాటు సందర్భంగా హత్యకు గురయ్యారు. అప్పటికి ఖాలిదా వయసు 35 ఏళ్లు. భర్త హత్యతో ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1978లో తన భర్త స్థాపించిన బీఎన్‌పీకి 1984లో ఛైర్‌పర్సన్‌ అయ్యారు. అప్పటి నుంచి చనిపోయే వరకూ ఆ పదవిలో కొనసాగారు.

జియా మొదటి కుమారుడు, తారిఖ్ "పిను" రెహమాన్ (జననం 1965), రాజకీయాల్లోకి ప్రవేశించి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి తాత్కాలిక ఛైర్మన్ అయ్యాడు. ఆమె రెండవ కుమారుడు, అరాఫత్ "కోకో" రెహమాన్ (1969–2015) దేశంలో ప్రముఖ క్రీడా నిర్వాహకుడు.

రాజకీయ జీవితం

[మార్చు]
  • 1990లో సైనిక నియంత ఎర్షాద్‌ పాలన ముగిసింది. 1991 ఎన్నికల్లో బీఎన్‌పీ ఘనవిజయం సాధించింది. ఖాలిదా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ముస్లిం ప్రపంచంలో బేనజీర్‌ భుట్టో తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు.
  • 1996లో రెండోసారి బీఎన్‌పీ విజయం సాధించింది. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ ఆందోళనల కారణంగా 12రోజులకే జియా రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్‌ విజయం సాధించింది. హసీనా ప్రధాని అయ్యారు.
  • 2001 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఖాలిదా జియా నేతృత్వంలోని బీఎన్‌పీ ఘన విజయం సాధించింది. 2006 వరకూ ఆమె ప్రధాని పదవిలో కొనసాగారు.
  • 2018లో ఖాలిదాకు జియా అనాథల ట్రస్టు కేసులో ఐదేళ్లు, జియా ఛారిటబుల్‌ ట్రస్టు కేసులో ఏడేళ్ల శిక్షలు పడ్డాయి. 2024లో హసీనా పదవి నుంచి వైదొలగిన ఒక రోజు తర్వాత ఖాలిదాకు అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. [7]

మూలాలు

[మార్చు]
  1. "Zia, Begum Khaleda". Banglapedia. 2012. Retrieved 9 July 2015.
  2. V6 Velugu (6 August 2024). "ఆ రోజు షేక్ హసీనా జస్ట్ మిస్.. వామ్మో.. ఖలీదా జియా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే." Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి... అనారోగ్యంలో పోరాడుతూ" (in అమెరికన్ ఇంగ్లీష్). 2025-12-30. Retrieved 2026-01-03.
  4. "#14: Begum Khaleda Zia, Prime Minister of Bangladesh". Forbes 100 Most Powerful Women in the World. 2004. Archived from the original on 14 June 2012. Retrieved 4 February 2014.
  5. "#29 Khaleda Zia, Prime minister, Bangladesh". The 100 Most Powerful Women. Forbes.com. 2005. Retrieved 4 February 2014.
  6. "#33 Khaleda Zia, Prime Minister, Bangladesh". The 100 Most Powerful Women. 31 August 2006. Retrieved 4 February 2014.
  7. "Khaleda Zia: ఖాలిదా జియా కన్నుమూత". EENADU. Retrieved 2026-01-03.