పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
కృతికర్త: త్రిపురనేని గోపీచంద్
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నవల
ప్రచురణ:
విడుదల: 1963

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు నవల. దీని రచయిత త్రిపురనేని గోపీచంద్.[1]

కథ[మార్చు]

కథానాయకుడు కేశవ మూర్తి అభ్యుదయ భావాలు గల రచయిత. ఆయన భార్య సుజాత. వారిది అన్యోన్య దాంపత్యం. విలువలు కలిగిన జీవితం గడుపుతూ ఉంటారు. సుజాత పసిపిల్లగా ఉన్నప్పుడు ఎవరో ఆమెను ఒక పాఠశాలలో వదిలేసి వెళతారు. ఆ బడిలో పనిచేసే నరసయ్య తీసుకుని వెళ్ళి కొద్ది రోజులు పెంచుతాడు. ఆ తరువాత పండిత పరమేశ్వర శాస్త్రి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమెను చూసి పెంచుకుంటానంటాడు. అప్పటి నుంచీ ఆమె పరమేశ్వర శాస్త్రి దగ్గరే పెరుగుతుంది. ఆయన పెంపకంలో రకరకాల సాహిత్యం అభ్యసిస్తుంది. ఆమె కోరిక మేరకు పాఠశాలకు పంపించి ఆంగ్ల విద్య కూడా నేర్పిస్తాడు. ఒకానొక సందర్భంలో కేశవమూర్తి ఆమెను చూసి ప్రేమిస్తాడు. అది పరమేశ్వర శాస్త్రికి నచ్చదు. ఆమె ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి కేశవ మూర్తిని పెళ్ళి చేసుకుంటుంది. కేశవ మూర్తి ఒక పాఠశాలలో పనిచేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తుంటాడు.

కేశవమూర్తికి ఉన్న మంచితనం వల్ల అతనికి పేరు ప్రఖ్యాతులు కలగడంతో అతనిమీద ద్వేషంతో పరమేశ్వరశాస్త్రి ఆస్తిని అతనికి దక్కకుండా చేయాలని కొంతమంది మిత్రులు ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి సీమంతం అనే వ్యక్తి నాయకత్వం వహిస్తూ ఉంటాడు. పరమేశ్వరశాస్త్రి కోరిక మేరకు ఆయన ఆస్తితో ఒక సంస్కృత కళాశాల స్థాపించబోతున్నామని, దానికి తాము నిర్వాహకులుగా ఉండి భాషా సంప్రదాయాలకు సేవ చేస్తామని కనపడిన వారందరితో చెబుతుంటారు. ఈ విషయంలో శాస్త్రి గారు కూడా అంగీకారం తెలిపారనే వారు భావిస్తుంటారు. పైకి పవిత్రమైన ఆలోచనలా కనిపించినా ఆస్తి మొత్తం వారి క్రిందకు రావాలన్నదే వారి లక్ష్యం.

వీరందరూ కలిసి కేశవమూర్తి కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందుల పాల్జేశారు?, వాటినుండి కేశవమూర్తి, సుజాత ఎలా బయటపడ్డారు?, చివరికి పండిత పరమేశ్వరశాస్త్రి గారు తన వీలునామాలో ఏం వ్రాశారు అన్నదే మిగిలిన కథ.

రచయిత అభిప్రాయం[మార్చు]

పుస్తకం వెనుక భాగంలో రచయిత తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేసారు.[2]

ఆవి కమ్యూనిస్టు పార్టీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్న రోజులు. ఎక్కడ, ఏ సమయంలో పికిటింగు పెళ్లినా వదివేలమందికి తక్కువ హాజరయ్యేవారు కారు. ఆనాటి సభ్యుల ఆవేశం. ఆ పార్టీ ఆంటే ఇష్టంలేని వారిని కూడా కదిపిందని చెప్పడం ఏమాత్రం ఆతిశయోక్తి కాదు. తివ్రంగా విమర్శించే వ్యక్తులు కూడా. వారి పట్టుదలకూ, సంఘటనా శక్తికి, కార్యదక్షతకు, త్యాగనిరతికి లోలోపల జోహార్లు ఆర్పిస్తూ వుండేవారు. ఆనాడు ఆపార్టీ సభ్యులు రేపు ఏమవుతుందనే ఆలోచన లేకుండా ఆస్తులను తెగనమ్మి పార్టీకి ఇచ్చివేశారు. ఆ పార్టీ కంకరరాళ్ళల్లో ఆగ్నిజ్వాలలను రేపిన రోజులవి. ఆయితే కమ్యూనిసులు తప్పటడుగులు వెయ్యిటం వల్ల మార్క్సిజానికి వాచ్చిన ప్రమాదం వున్నట్లేమీ లేదు. వాక భావంలో బలం వున్నప్పుడు దాని పని అది చేసుకోక ఊరు కోదు. కాంగ్రెస్సే జమీందారీ విధానాన్ని రద్దు చేసింది. కాంగ్రెస్సే సాంప్రదాయక వ్యవసాయాన్ని ఆచరణలోకి తేవటానికి ప్రయత్నిస్తూవుంది. ఇదివోరకంగా కమ్యూనిస్టు పార్టీకి విజయం కాదా? విజయమే! తన పారపాటు వల్ల మార్క్సిజాన్ని తానుగా ఆచరణలోకి తేలేక పోయినా ఇతరులు తేవటానికి సహాయపడింది. ఆ పార్టీ వల్లనే మార్క్సిజం తప్పనిసరి అయింది.

—గోపీచంద్

పాత్రలు[మార్చు]

  • పరమేశ్వర శాస్త్రి
  • కేశవ మూర్తి
  • సుజాత
  • సీమంతం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]