కాడ్మియం బ్రోమైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాడ్మియం బ్రోమైడ్
Cadmium bromide
పేర్లు
IUPAC నామము
Cadmium(II) bromide
ఇతర పేర్లు
Cadmium dibromide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7789-42-6]
పబ్ కెమ్ 24609
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య EU9935000
SMILES Br[Cd]Br
ధర్మములు
CdBr2
మోలార్ ద్రవ్యరాశి 272.22 g/mol
స్వరూపం white to pale yellow crystalline solid
సాంద్రత 5.192 g/cm3, solid
ద్రవీభవన స్థానం 568 °C (1,054 °F; 841 K)
బాష్పీభవన స్థానం 844 °C (1,551 °F; 1,117 K)
56.3 g/100 mL (0 °C)
98.8 g/100 mL (20 °C)
160 g/100 mL (100 °C)
ద్రావణీయత soluble in alcohol, ether, acetone and liquid ammonia.
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Rhombohedral, hr9, SpaceGroup = R-3m, No. 166
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R20/21/22, R50/53
S-పదబంధాలు (S2), S60, S61
Lethal dose or concentration (LD, LC):
225 mg/kg, oral (rat)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd)
REL (Recommended)
Ca[1]
IDLH (Immediate danger)
Ca [9 mg/m3 (as Cd)]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Zinc bromide,
Calcium bromide,
Magnesium bromide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాడ్మియం బ్రోమైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన రసాయనసమ్మెలన పదార్థం. కాడ్మియం, బ్రోమిన్ మూలక పరమాణువు ల సంయోగం వలన ఏర్పడిన రసాయన సంయోగ పదార్థం. కాడ్మియం బ్రోమైడ్ యొక్క రసాయన సంకేత పదంCdBr2. మిగతా కాడ్మియం సమ్మేళన రసాయన పదార్థాలవలె కాడ్మియం బ్రోమైడ్ కూడా విషపూరితమైన రసాయనం. కాడ్మియం బ్రోమైడ్ ను హైడ్రో బ్రోమిక్ ఆమ్లం యొక్క అయానిక్ కాడ్మియం లవణం అనికూడా అంటారు.

భౌతిక లక్షణాలు[మార్చు]

భౌతిక స్థితి[మార్చు]

కాడ్మియం బ్రోమైడ్ ఒక ఘన రసాయన పదార్థం.[2] ఇది తెల్లగా లేదా లేత పసుపు రంగు స్పటిక రూపం లో ఉండును.[3] కాడ్మియం బ్రోమైడ్ అణుభారం 272.22 గ్రాములు/మోల్.[4]

సాంద్రత[మార్చు]

25 °C ఉష్ణోగ్రత వద్ద కాడ్మియం బ్రోమైడ్ సాంద్రత 5.192గ్రాములు/సెం.మీ3[2]

ద్రవీభవన ఉష్ణోగ్రత[మార్చు]

కాడ్మియం బ్రోమైడ్ ద్రవీభవన స్థానం 568 °C (1,054 °F;841 K) [2]

బాష్పీభవన ఉష్ణోగ్రత[మార్చు]

కాడ్మియం బ్రోమైడ్ యొక్క బాష్పీభవన స్థానం 844 °C (1,551 °F;1,117K) [2]

ద్రావణీయత[మార్చు]

కాడ్మియం బ్రోమైడ్ నీటిలో కరుగును.[3] 0 °C దగ్గర, 100 మి.లీ నీటిలో 56.3 గ్రాములు,20 °C దగ్గర 98.8గ్రాములు, 100 °C వద్ద 160 గ్రాములు నీటిలో కరుగును.ఆల్కహాల్, ఇథర్,, ద్రవ అమ్మోనియాలో కరుగును.[5]

ఉత్పత్తి[మార్చు]

కాడ్మియం బ్రోమైడ్ ను కాడ్మియాన్ని బ్రోమిన్ ఆవిరులతో వేడి చేయుటద్వారా ఉత్పత్తి చేయుదురు.మరొక విధానంలో పొడి కాడ్మియం అసిటేట్ ను గ్లాసియాల్అసిటిక్ ఆమ్లం, అసేటైల్ బ్రోమైడ్ తో ప్రతి చర్యకు లోను గావించడం ద్వారా ఉత్పత్తి చేయుదురు. మరొక ప్రత్నామ్యాయ పద్ధతిలో కాడ్మియం లేదా కాడ్మియం ఆక్సైడ్ ను హైడ్రో బ్రోమిక్ ఆమ్లంలో కరిగించి, పొడిగా ఏర్పడు వరకు ద్రావణాన్ని హీలియం వాయు వాతావరణంలో బాష్పీకరించి/ఇగిర్చి కాడ్మియం బ్రోమైడ్‌ను ఉత్పత్తి చేయుదురు.

రసాయన చర్యలు[మార్చు]

విద్యుద్విశ్లేషణ[మార్చు]

కాడ్మియం బ్రోమైడ్‌ను విద్యుద్విశ్లేషణ కావించిన రాగి కాథోడ్ ధ్రువం వద్ద వెండిరంగు కాడ్మియం పూత/పొర, ప్లాటినం ఆనోడ్ వద్ద పసుపు-ఎరుపురంగు బ్రోమిన్ పూత/పొర ఏర్పడును[6]

ఆరోగ్యపరమైన ఇబ్బందులు[మార్చు]

కాడ్మియం బ్రోమైడ్ ను పీల్చడం వలన దగ్గు, తుమ్ములువచ్చును.ఊపిరి తిత్తులు/శ్వాసకోశాలు పాడై అవకాశం ఉంది.జీర్ణవ్యవస్థలో చేరిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడును.మూత్రపిండాలు, కాలేయంపాడై అవకాశంఉన్నది.కళ్ళలోపడిన ఇరిటెసన్ వచ్చును.[3][7]

ఉపయోగాలు[మార్చు]

కాడ్మియం బ్రోమైడ్ ను పోటోగ్రాఫిక్ ఫిల్ముల తయారిలోను, లిథోగ్రపిలోని, బొమ్మలు/ చిత్తరువు చెక్కుట, అక్షరాలు చెక్కుటకు (engraving) ఉపయోగిస్తారు.[7]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. NIOSH Pocket Guide to Chemical Hazards. "#0087". National Institute for Occupational Safety and Health (NIOSH).
  2. 2.0 2.1 2.2 2.3 "Cadmium Bromide". americanelements.com. Retrieved 2016-03-29.
  3. 3.0 3.1 3.2 "CADMIUM BROMIDE". chemicalbook.com. Retrieved 2016-03-29.
  4. "Cadmium Dibromide". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2016-03-29.
  5. "Cadmium Bromide". solubilityofthings.com. Retrieved 2016-03-29.
  6. "Electrolysis of Cadmium Bromide". chem.wisc.edu. Retrieved 2016-03-29.
  7. 7.0 7.1 "CADMIUM BROMIDE" (PDF). nj.gov. Retrieved 2016-04-04.