Jump to content

చింతలపురి రాంరెడ్డి

వికీపీడియా నుండి

చింతలపురి రాంరెడ్డి తెలంగాణ పోరాట యోధుదు. తెలంగాణా ప్రజల విముక్తి కోసం ఉద్యమించి రజాకార్ల చేతిలో హతులైన వారిలో కొలనపాకకు చెందిన ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చింతలపురి రాంరెడ్డిలను ముఖ్యులుగా చెప్పొచ్చు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1903లో న‌ల్లగొండ జిల్లా రాజ‌పేట మండ‌లం రేణికుంటలో జన్మించారు. ఆయన చిన్నతనం నుంచే పోరాటంవైపు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. తన చిన్న వయస్సులోనే రజాకార్లు, ప్రజల్ని పెడుతున్న చిత్రహింసలు, బాధలు రాంరెడ్డి హృదయాన్ని ఎంతగానో చలించివేశాయి. స్త్రీల పట్ల రజాకార్లు వ్యవహరిస్తున్న తీరు ఆయనను మరింతగా బాధపెట్టాయి. ఏవిధంగానైనా రజాకార్ల పెత్తనం, అరాచాకాలను ఆపి, ఇక్కడి నుంచి తరిమివేయాలని దీని కోసం తన ప్రాణాలు సైతం పోయినా ఫర్వాలేదనీ భావించి చింతలపురి పోరు బాటను ఎంచుకున్నారు. రజాకార్ల హయాంలో కొలనుపాక కేంద్రంగా ఉండేది. ఈ తహశీల్దారు కింద రాజాపేట, ఆలేరు మండలాలతో పాటు మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం కూడా ఉండేది. ఈప్రాంతంలో రోజురోజుకు రజాకార్ల అరాచకాలు హద్దు అదుపులేకుండా పోవడంతో రాంరెడ్డి 22మందితో కూడిన ఒక దళాన్ని ఏర్పాటు చేశారు. వారందరికీ అన్ని విద్యల్లో శిక్షణ ఇప్పించారు. అసమయంలో రజాకార్ల దగ్గర పనిచేస్తున్న జగదేవ్పూర్ కు చెందిన చోడేమియా అనే వ్యక్తి ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే వర్తమానం రాంరెడ్డికి అందింది. వర్తమానాన్ని అందుకున్న రాంరెడ్డి తన దళంతో చోడేమియా ఆశ్రమంపై దాడి చేసి హతమార్చారు. అలాగే మూటకొండూర్ పోలీస్ స్టేషనుపై కూడా రాంరెడ్డి దళం దాడిచేసింది. ఎస్ఐని హతం చేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిన చింతలపురి రాంరెడ్డికి ప్రజాదారణ రోజురోజుకు పెరుగుతుంది. తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. దీంతో రజాకార్లలో అలజడి ప్రారంభమైంది.

యువకులతో నిర్మించుకున్న ఆ గెరిల్లా దళం ప్రజల పక్షాన నిలిచి ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయారు. అనేక మంది రజాకార్లను చింతలపురి దళం హతం చేయడంతో రజాకార్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఎలాగైనా రాంరెడ్డిని హతమార్చాలని కొలనుపాలక తహశీల్దారు కుట్రపన్నారు. ఎన్నోమార్లు పకడ్బందీ వ్యూహాలు వేశాడు. కాని ఏనాడు రాంరెడ్డి రజాకార్ల చేతికి చిక్కలేదు. అయితే 1948 ఫిబ్రవరి 10న రాంరెడ్డి తన గెరిల్లా దళంతో రేణికుంట లోని తన నివాసంలో ఉండగా సుమారు 300 మంది పోలీసు బలగాలు రాంరెడ్డిని ఇంటిని చుట్టిముట్టాయి. వేలాది మంది గ్రామం చుట్టూ పహారా కాశారు. తన ఇంటిని చుట్టుముట్టారని గ్రహించిన రాంరెడ్డి ఇంటిపైకి ఎక్కి కాల్పులు చేయడం ప్రారంభించారు. ఆయన చేసిన కాల్పుల్లో సుమారు వంద మంది పోలీసులు చనిపోయారు. అయితే రాంరెడ్డిని పట్టుకోవడం కుదరదని భావించి పోలీసులు వెనుదిరిగిపోదామని అనుకున్నాయి. రాంరెడ్డి ఉన్న ఇంటిపైకి ఎక్కడానికి మెట్లులేవు. దానికి ఆనుకోని ఒక వేప చెట్టు ఉంది. ఆ చెట్టు మీదికి ఎక్కితే రాంరెడ్డిని సులువుగా హతమార్చవచ్చని కొలనుపాక తహశీల్దారు వ్యూహాన్ని వేసి, ఆ చెట్టు ఎక్కి దొంగచాటుగా రాంరెడ్డిని కాల్చిచంపారు. అంతేకాకుండా లొంగిపోతున్నట్లు ప్రకటించిన గెరిల్లా దళ సభ్యులను పోలీసులు అతి దారుణంగా నిజాం సైన్యం కాల్చిచంపి వారి నైజాన్ని చాటుకున్నారు. జాగీర్దారుకు వ్యతిరేకంగా చింతలపురి రాంరెడ్డి సాగించిన ఈ ఉద్యమం అవిశ్రాంత పోరాటం ఎంతో చారిత్రాత్మకమైందిగా చెప్పవచ్చు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]