అబ్రహాం లింకన్ హత్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్రహాం లింకన్ హత్య
Part of అమెరికా అంతర్యుద్ధం
ది అసాసినేషన్ ఆఫ్ అబ్రహాం లింకన్ (అబ్రహాం లింకన్ హత్య) (కరీర్ & ఈవ్స్, 1865), ఎడమ నుంచి కుడికి: మేజర్ హెన్రీ రాత్ బోన్, క్లారా హ్యారీస్, మేరీ టాడ్ లింకన్, అబ్రహాం లింకన్, హంతకుడు జాన్ విల్కీస్ బూత్
ఈ బొమ్మ బూత్ ప్రవేశం రాత్ బోన్ చూసి, బూత్ కాల్చడం ప్రారంభించడంతో లేచి ప్రతిస్పందించాడన్న అభిప్రాయం కల్పిస్తోంది. కానీ నిజానికి బూత్ హత్యకు ప్రయత్నించడం రాత్ బోన్ కు తెలియలేదు, కాల్పులు ప్రారంభించాకే ప్రతిస్పందించారు.
ప్రదేశంఫోర్డ్స్ థియేటర్, వాషింగ్టన్ డి.సి.
తేదీ1865 ఏప్రిల్ 14 (1865-04-14)
10:15 p.m. (ఈస్టర్న్ స్టాండర్డ్ టైం)
లక్ష్యం
దాడి రకం
 • రాజకీయ హత్య
 • కాల్పులు
 • కత్తి పోట్లు
ఆయుధాలు
 • ఫిలడెల్ఫియా డెరింగర్ పిస్టల్
 • పిడిబాకు
మరణాలు1 (అబ్రహాం లింకన్)
ప్రాణాపాయ గాయాలు
4
నేరస్తులుజాన్ విల్కీస్ బూత్, సహ కుట్రదారులు
దాడికి కారకులుయునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాలకవర్గంలోని ముఖ్యులను హత్యచేసి ప్రభుత్వం అస్థిరపరచడం
కాన్ఫెడరసీ స్థాపించడం

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ American 16th p resident అబ్రహాం లింకన్ ఏప్రిల్ 14, 1865 నాడు ఫోర్డ్స్ థియేటర్ లో అవర్ అమెరికన్ కజిన్ అన్న నాటకానికి హాజరవుతున్నప్పుడు గుడ్ ఫ్రైడే నాడు జాన్ విల్కీస్ బూత్ చేత హత్యకు గురయ్యారు. అమెరికా అంతర్యుద్ధం ముగిసిపోతూన్న సమయంలో ఈ హత్య జరిగింది.[1] నార్త్ వర్జీనియాకు చెందిన కాన్ఫిడరేట్ సైన్య జనరల్ రాబర్ట్ ఇ. లీ లెఫ్టినెంట్ జెనరల్ యులిసెస్ ఎస్. గ్రాంట్, యూనియన్ ఆర్మీ ఆఫ్ పోటోమాక్ కు లొంగిపోయిన అయిదు రోజులకు ఈ హత్య జరిగింది.

హత్యకు గురయిన తొలి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్.[2] అంతకు 30 సంవత్సరాల ముందు 1835లో మరో ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ పై విఫలమైన హత్యాయత్నం జరిగింది, ఆపైన 1864 ఆగస్టులో గుర్తుతెలియని హంతకుడు లింకన్ పైనే ఒక హత్యాయత్నం చేశారు. అంతర్యుద్ధంలో ఓటమి పాలైన కాన్ఫిడరేట్ ను పున:స్థాపించే పెద్ద కుట్రలో భాగంగా ప్రఖ్యాత రంగస్థల నటుడు జాన్ విల్కీస్ బూత్ లింకన్ హత్యకు కుట్ర, అమలు స్వయంగా చేపట్టారు.

బూత్ తో పాటుగా ఈ కుట్రలో భాగస్తులు లూయీస్ పావెల్, డేవిడ్ హెరాల్డ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ విలియం హెచ్. సీవార్డ్ ను చంపేందుకు, జార్జ్ అట్జెరోట్ ఉపాధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ ను హత్యచేసేందుకు నియుక్తులైనారు. వెనువెంటనే పరిపాలనలోని ముగ్గురు ముఖ్యులను చంపడం ద్వారా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం కొనసాగింపును దెబ్బతీసేందుకు కుట్రజరిగింది.

అవర్ అమెరికన్ కజిన్ అన్న నాటకాన్ని చూస్తున్నప్పుడు వాషింగ్టన్ డి.సి.లోని ఫోర్డ్స్ థియేటర్లో లింకన్ ను తుపాకీతో కాల్చారు. తర్వాతి రోజు ఉదయం 7.22 నిమిషాలకు లింకన్ మరణించారు.[3] కుట్రదారుల మిగతా కుట్ర అంతా దెబ్బతింది. కుట్రదారుల్లో పావెల్ మాత్రమే సీవార్డును గాయపరచగలిగాడు. జాన్సన్ ను చంపేందుకు నియుక్తమైన అట్జెరోట్ మానసిక స్థైర్యాన్ని కోల్పోయి పారిపోయాడు. అబ్రహాం లింకన్ అంత్యక్రియలు, ఖననం జాతీయ సంతాపదినాలుగా ప్రకటించారు.

హత్య[మార్చు]

అసలు ప్రణాళిక: అధ్యక్షుని అపహరణ[మార్చు]

జాన్ విల్కీస్ బూత్

1860 సంవత్సరాంతంలో బూత్ బాల్టిమూర్ లో కాన్ఫిడరేట్ కు అనుకూలమైన రహస్య సంస్థ నైట్స్ ఆఫ్ గోల్డెన్ సర్కిల్ ను ప్రారంభించారు.[4]

మార్చి 1864లో, యూనియన్ కు చెందిన సర్వ సైన్యానికి కమాండింగ్ జనరల్ యుద్ధ ఖైదీల మార్పిడిని నిలుపేయాలని నిశ్చయించుకున్నారు.[5] ఇది రెండు వైపుల యుద్ధఖైదీలకు అశనిపాతంగానే పరిణమించిది, ఐతే మానవ వనరులు తక్కువగా ఉన్న కాన్ఫిడరేట్ సైన్యంలోకి పట్టుబడ్డ యుద్ధఖైదీలే తిరిగి తిరిగి చేరి పనిచేస్తూండడంతో యుద్ధఖైదీల మార్పిడి వల్లే యుద్ధం ముగింపుకు రావట్లేదని గ్రాంట్ గుర్తించారు. దక్షిణాది వాడు, కాన్ఫిడరేట్ కు బహిరంగ సమర్థకుడు అయిన జాన్ విల్కీస్ బూత్ అధ్యక్షుడు లింకన్ ను అపహరించి, కాన్ఫెడరేట్ సైన్యానికి అప్పగించాలని, అతన్ని తిరిగి ఇవ్వాలంటే ఉత్తరాది పక్షం యుద్ధఖైదీల మార్పిడికి అంగీకరించాలన్న నియమం పెట్టాలని ప్రణాళిక వేసుకున్నారు.[6]: 130–134  శామ్యూల్ ఆర్నాల్డ్, జార్జ్ అట్జెరోట్, డేవిడ్ హెరాల్డ్, మైకేల్ ఓ'లాఫ్లెన్, లూయీస్ పావెల్, జాన్ సరట్ లను సహాయకులుగా నియమించుకున్నారు. సర్రట్ తల్లి మేరీ సర్రట్ మేరీ లాండ్ కు చెందిన సర్రెట్స్ విల్లేలో తమ లోగిలి వదిలేసి వాషింగ్టన్ డి.సి.లో చిన్న ఇంటికి మారారు. అక్కడికి తరచు బూత్ వచ్చి వెళ్ళేవారు. బూత్ కీ, లింకన్ కీ వ్యక్తిగత పరిచయాలు లేనప్పుడే, లింకన్ బూత్ నటనను ఫోర్డ్స్ థియేటర్లో చూసి ఆస్వాదించేవారు.

బూత్ ప్రదర్శించే అనేక నాటకాలను లింకన్ సందర్శించారు, వాటిలో నవంబర్ 9, 1863న ఫోర్డ్స్ థియేటర్లో మార్బుల్ హార్ట్ అనే ప్రదర్శనం కూడా ఉంది. వాషింగ్టన్ క్రానికల్ దాన్ని అందమైన భావోద్వేగపూర్ణమైన నాటకంగా అభివర్ణించింది. నాటకం నిర్మాణంలో, నటనలో ఆయన పాత్రకు గాను బూత్ ప్రముఖంగా ప్రశంసలు పొందారు. లింకన్స్ సాంక్చురీ: అబ్రహాం లింకన్ అండ్ ది సోల్జర్స్ హోం పుస్తకం ప్రకారం బూత్ పెర్ఫార్మెన్స్ ను లింకన్ చాలా ఇష్టపడి వైట్ హౌస్ కి ఆహ్వానించారు. కాన్ఫెడరేట్ సానుభూతిపరుడు, గూఢచారి కావడంత బూత్ ఆ ఆహ్వానం మన్నించి వెళ్ళలేదు. లింకన్ కు బూత్ తాను సందర్శించకపోవడానికి ఏ కారణాన్నీ చెప్పలేదు, ఇన్సైడ్ లింకన్స్ వైట్ హౌస్ అన్న పుస్తకం ప్రకారం తర్వాత తన స్నేహితులతో "ఒక నీగ్రో అభినందనలైనా స్వీకరిస్తాను కానీ అధ్యక్షుడి నుంచి మాత్రం స్వీకరించను" అన్నారు. నటుడు ఫ్రాంక్ మార్డాంట్ తర్వాత్తర్వాత ఈ విధంగా కథనాన్ని రూఢి చేశారు:

"తనను హత్యచేసిన మనిషికి లింకన్ అభిమాని. నాకు తెలుసు, ఒకరోజు ఆయన నాతో ఫోర్డ్స్ థియేటర్లోని ఓ యువ నటుడిని ఒకరోజు తాను కలవాలని కోరుకున్నానని, కానీ ఏదో కారణంతో అతను వైట్ హౌస్ ను సందర్శించే ఆహ్వానాన్ని తప్పించుకున్నాడని చెప్పారు. ఆ నటుడు జాన్ విల్కీస్ బూత్."

ఈ ఫోటోగ్రాఫ్ (పైది) లింకన్ రెండవ ఇనాగరల్ అడ్రస్ చేస్తున్నప్పటిది, ఆ ఈవెంట్ కు చెందిన ఏకైక ఫోటో. లింకన్ మధ్యలో చేతిలో పేపర్లతో నిలిచారు. జాన్ విల్కీస్ బూత్ ను పై వరుసలో సరిగా మధ్యలో చూడవచ్చు. రెండవ ఫోటో పై ఫోటోలోని లింకన్, బూత్ లను ప్రత్యేకించి చూపుతున్నది.

మార్చి 4, 1865న లింకన్ రెండవ ప్రమాణస్వీకారానికి బూంత్ హాజరయ్యారు. అప్పటికి త్వరలో స్పెయిన్లో యునైటెడ్ స్టేట్స్ రాయబారి కాబోయే జాన్ పి.హాల్ కుమార్తె, బూత్ కాబోయే భార్య (ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు) లూసీ హాల్ అతన్ని ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. తర్వాత బూత్ డైరీలో, "ఎంత అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది, నేను కావాలనుకుంటే అధ్యక్షుణ్ణి పదవీ స్వీకారం చేసిన రోజునే చంపగలిగేవాణ్ణి!" అని రాసుకున్నారు.[6]: 174, 437 n. 41 

మార్చి 17, 1865న, కేంప్ బెల్ సైనిక ఆసుపత్రి వద్ద స్టిల్ వాటర్స్ రన్ డీప్ అన్న నాటకం ప్రదర్శనకు లింకన్ హాజరవుతారని తన తోటి కుట్రదారులకు సమాచారం ఇచ్చారు. తన మనుషులను అతను పట్టణం చివర్లోని రెస్టారెంట్లో సమావేశపరిచారు, దగ్గరలోని రహదారిపై అతన్ని కలుసుకునేట్టు, చివరకు ఆసుపత్రి నుంచి వెనుదిరిగి వస్తున్న అధ్యక్షుణ్ణి బంధించేట్టు పథకం వేసుకున్నారు. ఐతే లింకన్ నాటక ప్రదర్శనకే రాలేదని బూత్ తెలుసుకున్నారు. ఆ సమయానికి లింకన్ నేషనల్ హోటల్ లో గవర్నర్ ఆలివర్ మార్టన్ 142వ ఇండియానా ఇన్ఫాంట్రీ అధికారులకు పట్టుబడ్డ కాన్ఫెడరేట్ యుద్ధ పతాకాన్ని బహూకరించే కార్యక్రమానికి హాజరయ్యారు.[6]: 185  బూత్ నిజానికి అప్పట్లో నేషనల్ హోటల్లోనే నివసించేవారు, ఒకవేళ ఆయన ఆసుపత్రికి వెళ్ళకపోయివుంటే లింకన్ ను చంపే అవకాశం హోటల్లోనే లభించివుండేది.[6]: 185–6, 439 n. 17 [7]: 25 

మరోపక్క యుద్ధంలో కాన్ఫెడరసీ పతనం జరుగుతోంది. ఏప్రిల్ 3న కాన్ఫెడరసీ రాజధాని రిచ్మండ్, వర్జీనియాని యూనియన్ ఆర్మీ పట్టుకోగలిగింది. ఏప్రిల్ 9, 1865న కాన్ఫెడరసీ ప్రధాన సైన్యం అయిన నార్తర్న్ వర్జీనియా సైన్యం ఆర్మీ ఆఫ్ పోటోమాక్ కు అపోమాటోక్స్ కోర్ట్ హౌస్ వద్ద లొంగిపోయింది. కాన్ఫెడరేట్ అధ్యక్షుడు జెఫర్సన్ డేవిస్, ఇతర ప్రభుత్వ నేతలు శరవేగంగా తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకవైపు మిగతా దక్షిణాది ప్రజలు ఆశలు వదులుకుంటూండగా, బూత్ కాన్ఫెడరసీ స్వప్నంపై ఆశలుపెట్టుకునే ఉన్నారు.[8]: 728 

ప్రేరణ[మార్చు]

ఏప్రిల్ 11, 1865న, లీ సైన్యం యులిసెస్ ఎస్.గ్రాంట్ నాయకత్వంలోని యునైటెడ్ స్టేట్స్ సైన్యానికి లొంగిపోయాకా, వైట్ హౌస్ లో ప్రసంగానికి బూత్ హాజరయ్యారు. విముక్త బానిసలకు ఓటుహక్కునిచ్చే ఆలోచనను సమర్థిస్తూ లింకన్ మాట్లాడారు. విపరీతంగా ప్రేరేపితమైన బూత్ లింకన్ ను హత్యచేయడానికి నిర్ణయించుకున్నారు, లూయీస్ పావెల్ తో అతను ఈ విధంగా మాట్లాడారు:

అంటే నిగ్గర్ పౌరసత్వం. ఇప్పుడు దేవుడా, నేనతని పనిపడతాను. అతను ఇచ్చే చివరి ప్రసంగం అదే.

[7]: 6 

లింకన్ భవిష్యత్ సూచన[మార్చు]

మార్చి 6, 1865న లింకన్ వైట్ హౌస్ బాల్కనీలో ఉండగా ఫోటో. ఇది లింకన్ కు సంబంధించి మనకు తెలిసిన ఆఖరి మంచి క్వాలిటీ ఫోటోగ్రాఫ్.

లింకన్ తన మరణాన్ని తాను ముందే ఊహించాడని విస్తృతంగా నమ్ముతారు.[9]

లింకన్ స్నేహితుడు, జీవితచరిత్రకారుడు వార్డ్ హిల్ లామన్ ప్రకారం లామన్ తోనూ, ఇతర మిత్రులతోనూ తన మరణానికి 3 రోజుల ముందు తనకు వచ్చిన కల గురించి చెప్పారు. రాత్రి వైట్ హౌస్ లో కంటికి కనిపించని వ్యక్తులు ఏడుస్తూన్నట్టు వినిపించిందనీ, తాను వెంటాడుతూ వెళ్తే అంత్యక్రియల నాటి వస్త్రంలో చుట్టిన శవం, దాని చుట్టూ ఏడుస్తున్న అంగరక్షకులు కనిపించారని, ఇంతకీ ఎవరు మరణించారంటే అధ్యక్షుడు, ఆయనను ఓ హంతకుడు చంపాడని సమాధానమిచ్చారని, ఇంతలో చూస్తే తనకు మెలకువ వచ్చి ఇదంతా కల అని తెలిసిందనీ చెప్పారు.[10]

తనను హత్య చేసే రోజున లింకన్ బాడీ గార్డు విలియం హెచ్. క్రుక్ తో మూడు రాత్రుల నుంచి తనను హత్యచేసినట్టు కలలు వచ్చాయని చెప్పారు. క్రుక్ లింకన్ ను ఆ రాత్రి ఫోర్డ్స్ థియేటర్ కు వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. ఐతే తన భార్యకు తీసుకువెళ్తానని మాట ఇచ్చినట్టు లింకన్ చెప్పారు. లింకన్ వెనక్కి తిరిగి గుడ్ బై క్రుక్ అన్నారనీ, ఎప్పుడూ గుడ్ నైట్ క్రుక్ అనే మనిషి గుడ్ బై అనేసరికి కొత్తగా అనిపించిందనీ క్రుక్ చెప్పారు. ఆ సమయంలో అదే విషయాన్ని ఆలోచించాననీ, కొద్ది గంటల్లో వాషింగ్టన్ అంతటా లింకన్ ని కాల్చారన్న వార్త వ్యాపించగా ఆయన ఆఖరి మాటలు తననెంతో కలవరపరిచాయని క్రుక్ చెప్పారు.[11]

లింకన్ ను కాల్చాకా, మేరీ అతని కల ప్రవక్తకు సందేశం వచ్చినట్టు వచ్చిందని వ్యాఖ్యానించారు.

మూలాలు[మార్చు]

 1. "Good Friday, 1865: Lincoln's Last Day". The NHPR Staff. 18 February 2008. Archived from the original on 23 ఆగస్టు 2017. Retrieved 11 January 2014.
 2. "Lincoln Shot at Ford's Theater".
 3. Richard A. R. Fraser, MD (February–March 1995). "How Did Lincoln Die?". American Heritage. 46 (1).
 4. Bob Brewer Shadow of the Sentinel, p. 67, Simon & Schuster, 2003 ISBN 978-0-7432-1968-6
 5. "Prisoner exchange". Spartacus.schoolnet.co.uk. Archived from the original on 2011-06-05. Retrieved 2016-05-27.
 6. 6.0 6.1 6.2 6.3 Kauffman, Michael W. (2004). American Brutus: John Wilkes Booth and the Lincoln Conspiracies. New York: Random House. ISBN 978-0-375-50785-4. Retrieved 2012-09-09.
 7. 7.0 7.1 Swanson, James. Manhunt: The 12-Day Chase for Lincoln's Killer. Harper Collins, 2006. ISBN 978-0-06-051849-3
 8. Goodwin, Doris Kearns. Team of Rivals: the political genius of Abraham Lincoln. Simon and Schuster, New York, 2005. ISBN 978-0-684-82490-1
 9. The Diary of Gideon Welles; The History Channel Publishings, Chapter XXVI, April 14, 1865
 10. p. 116–117 of Recollections of Abraham Lincoln 1847–1865 by Ward Hill Lamon (Lincoln, University of Nebraska Press, 1999).
 11. Lloyd Lewis (1994). The Assassination of Lincoln: History and Myth. University of Nebraska Press. p. 297. ISBN 978-0-8032-7949-0.