సయ్యద్ ఫరీదుద్దీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయ్యద్ ఫరీదుద్దీన్

సయ్యద్ ఫరీదుద్దీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అణుశాస్త్రవేత్త. ఇతడు మనదేశంలోని న్యూక్లియర్ ప్లాంట్లలో వినియోగానికి అవసరమైన భారజల ఉత్పత్తికి సంబంధించి విశేషమైన కృషి చేశాడు. భారత ప్రభుత్వం ఇతని సేవలను గుర్తించి 1967లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

విశేషాలు[మార్చు]

ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి. పట్టాపుచ్చుకున్నాడు. పిమ్మట అమెరికాలోని మిచిగన్ యూనివర్శిటీలో ఉన్నతవిద్యను అభ్యసించాడు. ఇతడు 1953లో భారత ప్రభుత్వ అణుఇంధన శాఖలోని హెవీ వాటర్ బోర్డులో జూనియర్ ఆఫీసర్‌గా ఉద్యోగంలోచేరాడు. ఇతడు తన ఉద్యోగ ప్రస్థానంలో అనేక పదవులను పొందాడు. ఇంజనీరింగ్ విభాగానికి డైరెక్టర్‌గా, బాబా అణుపరిశోధనాకేంద్రానికి అడిషనల్ డైరెక్టర్‌గా, భారజల ప్రాజెక్టుల ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వివిధ పదవులను నిర్వహించాడు. ఇతడు వియన్నాలోని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీలోని న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ విభాగానికి డైరెక్టర్‌గా 1980-1985 మద్యకాలంలో పనిచేశాడు. ప్రస్తుతం భారతదేశంలోని భారజల ప్లాంట్లు స్వయం సమృద్ధి సాధించడానికి ఇతని కృషియే కారణం.[1]

మూలాలు[మార్చు]

  1. "హెవీవాటర్ బోర్డ్ జాలస్థలిలో సయ్యద్ ఫరీదుద్దీన్ వివరాలు". Archived from the original on 2016-12-07. Retrieved 2016-11-27.