నీరజా భానోట్
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
నీరజా భానోట్ అశోకచక్ర | |
---|---|
జననం | |
మరణం | 1986 సెప్టెంబరు 5 | (వయసు 22)
జాతీయత | భారత దేశము |
ఇతర పేర్లు | లాడో |
వృత్తి | పర్సర్ |
అశోకచక్ర నీరజా భానోట్ విమాన సేవకురాలు. పాన్ అమ్ అనే సంస్థలో ఆవిడ పని చేసే వారు. 1986 సెప్టెంబరు 5[1]లో హైజాక్ అయిన పాన్ అమ్ విమానం 73 లోని ప్రయాణికులను, పర్యాటకులను ఆతంకవాదుల నుండి కాపాడే సందర్భంలో చనిపోయింది.[2] మరణానంతరం ఈమె ధైర్యానికి గానూ భారతదేశ ప్రభుత్వం అందించే అత్యంత మేటి పురస్కారం అశోక చక్రను ఈమెకు అందించారు.[3] ఈమె అశోక చక్ర పొందిన పిన్నవయస్కురాలే కాకుండా ఈ పురస్కారం పొందిన తొలిమహిళ.
జీవితం తొలినాళ్ళు
[మార్చు]నీరజా భానోట్ ఒక చండీగఢ్ లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. రమా భానోట్, హరీష్ భానోట్ ఈమె తల్లిదండ్రులు. ఈమె తండ్రి ముంబైలో పత్రికా సంపాదకుడిగా పని చేసేవారు. ఈమె సేక్రెడ్ హార్ట్ సీనియర్ సెకండరీ స్కూల్, చండీగఢ్, బోంబే స్కాట్టిష్ స్కూల్, సెయింట్ జేవియర్ కాలేజ్, ముంబైలో చదువుకున్నారు. భానోట్ వివాహం గల్ఫ్ లో పని చేసే ఒక వ్యక్తితో 1985లో అయినప్పటికీ, ఆ పెళ్ళి నీలువలేదు. వరకట్న వేధింపుల వలన ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసాక పాన్ అమ్ లో విమాన సేవకురాలిగా పని చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎంపికైన తరువాత మియామీకి తర్ఫీదుకు వెళ్ళి పర్సర్ గా తిరిగి వచ్చారు.
జీవితం
[మార్చు]నీర్జా బానోత్ 1963 సెప్టెంబరు 7న పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. రమా భానోట్, హరీష్ భానోట్ ఆమె తల్లిదండ్రులు. తండ్రి హిందుస్తాన్ టైమ్స్ లో 30 ఏళ్ల పాటు సేవలందించి తన 86వ ఏట 2008 జనవరిలో కన్నుమూశారు[4]. నీర్జాకు అఖిల్, అనీష్ అనే ఇద్దరు సోదరులు. తన బాల్యపు చదువు ఛండీగఢ్‌లోని సేక్రెడ్ హార్ట్ సీనియర్ సెకండరీ స్కూల్, అనంతరం ముంబైలోని బోంబే స్కాట్టిష్ స్కూల్, సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకుంది. 1985లో గల్ఫ్ లో పని చేసే ఓ వ్యక్తితో బానోత్‌కు వివాహమైంది. వరకట్న వేధింపుల వల్ల ఆమె కొన్ని నెలలకే పుట్టింటికి తిరిగి వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాన్ అమ్‌లో విమాన సేవకురాలి (ఎయిర్‌హోస్టెస్)గా ఎంపికై ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది.
విమానం హైజాక్
[మార్చు]1986 సెప్టెంబరు 5న అమెరికాకు చెందిన పాన్ ఆమ్-73 విమానం ముంబైలోని సహార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుండి పాకిస్తాన్‌లోని కరాచీ జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తోంది. సరిగ్గా ఉదయం 5 గంటల ప్రాంతంలో కరాచీలో ఆ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేశారు. అందులో ఉన్న 360 మంది ప్రయాణికులు, 19 మంది విమాన సిబ్బందిని నిర్బంధించారు. అయితే అమెరికన్లే లక్ష్యంగా వచ్చిన ఉగ్రవాదులు.. వారిని గుర్తుపట్టేందుకు యత్నిస్తున్నారు. అంతలోనే నీర్జాకు ఓ ఉపాయం తట్టింది. ప్రయాణికుల వద్దున్న పాస్‌పోర్టులన్నింటినీ చిక్కకుండా దాచేసింది. దీంతో ఉగ్రవాదులు అమెరికన్లెవరో? విదేశీయులెవరో తెలుసుకోలేకపోయారు. దాదాపు 17 గంటల పాటు డ్రామా నడిచింది. చివరకు లాభం లేదనుకుని విమానంలో బాంబులు పేల్చేందుకు సిద్ధమయ్యారు.
గంటల కొద్ది ఉగ్రవాదులను తికమక పెట్టిన నీర్జా.. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంది. విమానంలోని అత్యవసర ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను బయటకు తోసేస్తోంది. దీన్ని గమనించిన తీవ్రవాదులు తుపాకులకు పనిచెప్పారు. పిల్లలపై తూటాల వర్షం కురిపిస్తుండగా చిన్నారులకు అడ్డుగోడగా నిలిచి వారి ప్రాణాలను రక్షించింది. నీర్జా మాత్రం కుప్పకూలింది. వివిధ దేశాలకు చెందిన 20 మంది ప్రయాణికులు అప్పటికే ప్రాణాలోదిలారు. అయితే వందల మంది క్షేమంగా బయట పడటం వెనుక సాహసనారి నీర్జా ధీరత్వమే కారణం. ఉగ్రవాదుల తూటాలకు తీవ్రంగా గాయపడిన ఆ ధీరవనిత అదేరోజు (సెప్టెంబరు 5, 1986)న ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. మరణానంతరం నీర్జా ధైర్యసాహసాలకు గుర్తుగా భారత ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది.[5]
ఆమె హంతకులు
[మార్చు]హైజాక్‌కు పాల్పడిన ఐదుగురిని అబు నిదల్ ఆర్గనైజేషన్ (లిబియా)కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. దోషులుగా గుర్తించిన కోర్టు 1988లో ఉరిశిక్ష విధించింది.[6][7]
మరణానంతరం
[మార్చు]"Her loyalties to the passengers of the aircraft in distress will forever be a lasting tribute to the finest qualities of the human spirit".
Ashok Chakra citation[1]
ఆమె సాహసానికి భారత ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పురస్కారం "అశోక చక్ర"ను అందజేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న పిన్న వయస్కురాలామె. 2004 లో భారత తపాలాశాఖ ఆమెపై ఒక తపాలాబిళ్ళను విడుదలచేసింది.[8][9]
పేన్ ఆమ్ నుండి వచ్చిన ఇన్సూరెన్సు డబ్బు, అంతే మొత్తం కలిపి భానోత్ తల్లిదండ్రులు "నీరజా భానోట్ పాన్ ఆమ్ ట్రస్టు"ను ఏర్పాటు చేసారు. ఈ ట్రస్టు ప్రతి సంవత్సరం రెండు పురస్కారాలను అందజేస్తుంది. అందులో ఒకటి విమాన సర్వీసులలలో విశేష సేవలందించేవారికి, రెండవది సామాజిక న్యాయం అవసరమైన వరకట్న వేదింపులకు గురై సాంఘికంగా బాధలు పడుతున్న స్త్రీకి అందజేస్తారు. ఈ అవార్డు రూ.1,50,000 నగరు, ఒక ట్రోఫీ రూపంలో యిస్తారు.[10][11]
అవార్డులు
[మార్చు]మరణానంతరం నీర్జా ధైర్యసాహసాలకు గుర్తుగా భారత ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. ఆమె పేరిట స్టాంపులను కూడా విడుదల చేశారు. అప్పట్లో ఆమెను ప్రపంచమంతా హీరోయిన్ ఆఫ్ హైజాక్‌గా కీర్తించింది. వివిధ దేశాలు అందించిన మరికొన్ని అవార్డులు..
- ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ హీరోయిజం అవార్డు (అమెరికా)
- తంగా ఇ ఇన్సానియత్ (ఆమె చూపిన మానవతా హృదయానికి) పాకిస్తాన్
- జస్టిస్ ఫర్ క్రైమ్స్ అవార్డు (యునైటెడ్ స్టేట్స్ అటార్నీ, కొలంబియా)
- ధైర్యానికి గుర్తుగా స్పెషల్ కవరేజీ అవార్డు (యుఎస్ ప్రభుత్వం)
- భారత పౌర మంత్రిత్వ శాఖ అవార్డు
- 2004లో భారత తపాలా శాఖ నీర్జాకు గుర్తుగా స్టాంపులను ముద్రించింది.
సినిమా
[మార్చు]రామ్ మధ్వాని దర్శకత్వంలో నీర్జా భానోత్ కథను సినిమా తీశారు. నీర్జా భనోత్‌గా సోనమ్ కపూర్ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 19 2016 న విడుదల అయింది. నీర్జా ధైర్య సాహసాలను కళ్ళకు కట్టినట్లుగా ఎంతో అద్భుతంగా ఇందులో చిత్రీకరించారు... [12]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Brave in life, brave in death by Illa Vij". The Tribune. 13 November 1999.
- ↑ "బ్రేవ్ ఇన్ లైఫ్, బ్రేవ్ ఇన్ డెత్, ఇళ్ళ విజ్(జీవితంలోనూ ధైర్యమే, చావులోనూ ధైర్యమే)". ది ట్రిబ్యూన్. 13 November 1999.
- ↑ తపాళా బిళ్ళ గురించిన వార్త
- ↑ "Journalist, former MC member Harish Bhanot passes away". The Indian Express. 2 January 2008. Archived from the original on 5 డిసెంబరు 2008. Retrieved 12 మార్చి 2015.
- ↑ Rajghatta, Chidanand (17 January 2010). "24 yrs after Pan Am hijack, Neerja Bhanot killer falls to drone". The Times of India. Archived from the original on 2011-08-11. Retrieved 2015-03-12.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-06-20. Retrieved 2015-03-12.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-10. Retrieved 2015-03-12.
- ↑ "Stamp on Neerja released". The Tribune. 9 October 2004.
- ↑ "Pak frees Pan Am hijack quartet", The Telegraph, 4 January 2008.
- ↑ Neerja Trust Archived 2011-07-26 at the Wayback Machine Karmayog.
- ↑ "Mumbai based Chanda Asani to get Neerja Bhanot Award 2008". Business Standard. 16 September 2008.
- ↑ సినిమాగా ఎయిర్‌హోస్టెస్ నీర్జా Feb 07, 2016[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]- The Tribune - information on the trial of Bhanot's killer
- Chhibber, Maneesh (8 May 2004). "Neerja's killer may get 160 years in prison". The Tribune. Tribune Trust. – account of the trial of Zaid Hassan Abd Latif Safarini
- నీర్జా.. నీ ధైర్య సాహసాలకు సెల్యూట్!