మల్లాది లీలా కృష్ణమూర్తి
మల్లాది లీలా కృష్ణమూర్తి (M.L.K.Murty) చారిత్రక పరిశోధకుడు, విద్యావేత్త. ఆయన ఇండియన్ సొసైటీ ఫర్ ప్రి హిస్టారిక్, క్వటార్నరీ స్టడీస్ లో సభ్యులు. ఆయన 1990 నుండి ఇండో పసిఫిక్ ప్రీ హిస్టారిక్ అసోసియేషన్ కు సభ్యులుగా ఉన్నారు.[1] ఆయన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి విశ్రాంత ఆచార్యులు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన మార్చి 12 1941 న గుంటూరు జిల్లాలో మల్లాది మల్లిఖార్జునశాస్త్రి, హైమావతి దంప్తతులకు జన్మిచారు. 1962లో బరోడాలోని మాస్టర్ ఆఫ్ సైన్స్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ చేసారు. 1967లో పూణె లోని పూణె విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టాను పొందారు.
వృత్తి
[మార్చు]ఆయన 1970-1985 మద్య పూణె లోని పూణె విశ్వవిద్యాలయంలోని ఆర్కియాలజీ విభాగంలో అధ్యాపకునిగా పనిచేసారు. సౌత్ ఆసియన్ ఆర్కియాలజీ దక్కన్ కళాశాల యందు రీడరుగా 1985-1988 లలో పనిచేసారు. 1988 లో శ్రీశైలం లోని చరిత, సంస్కృతి తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగానూ, 1988 నుండి రీజనల్ స్టడీస్ హైదరాబాదులో ప్రొఫెసరు, విభాగాధిపతి గానూ పనిచేసారు. 1990 నుండి సౌత్ ఆసియా ఇనిస్టిట్యూట్ యూనివర్శిటీ హైడల్‌బర్గ్, జర్ననీకి అతిథి అధ్యాపకునిగా ఉన్నారు.[1]
పరిశోధనలు
[మార్చు]అతనికి మైక్రోబయాలజీ అంటే అప్పట్లో ఇష్టంగా ఉండేది. అందుకోసం బరోడా, మహారాజా సయాజీ విశ్వవిద్యాలయానికి వెళ్లి అనుకోకుండా పురావస్తు శాస్త్రంలో చేరేడు. సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త ఆచార్య బెండపూడి సుబ్బారావు గారు ఆయన గురువు. మూర్తిగారు 1965 ప్రాంతంలో పరిశోధన కొనసాగించడానికి పూనా దక్కన కళాశాలలో చేరేరు. అక్కడ సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త హెచ.డి. సాంకరియా ఆయనకి గురువు. మూర్తిగారు దక్కన కళాశాలలో చాలాకాలం పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విలక్షణమైన పరిశోధనలు చేశారు. చిత్తూరు జిల్లా రాళ్ల కాలువ వెంట ఉదయం నుంచీ సాయంకాలం వరకూ నడిచేవారు. ఆ పరిశోధన విశేషాలే మూర్తిగారు వరల్డ్ ఆర్కియాలజీలో వ్యాసరూపంలో ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆయన పేరు ప్రతిష్ఠలకి మొదటి మెట్టు అది. బేతంచర్ల, బిల్లసర్గం గుహల్లో శిలాయుగ మానవ ఆవాసాలను గుర్తించి గొప్ప పరిశోధక వ్యాసాలు ప్రచురించాడతను. ఆంధ్ర తెలంగాణలలో ఆయన చేసిన పరిశోధనల్లో ముఖ్యవిశేషం, ప్రాచీన శిలాయుగపు కాలనిర్ణయం చేసే క్రమంలో అప్పటికే బెండపూడి సుబ్బారావు గారు, సాంకరియా వంటి పరిశోధకులు ఒక స్థూల సాంస్కృతి స్తలాలను గుర్తించడం. అరవై దశకంలో ప్రాచీన శిలాయుగాన్ని ఉపశిలా యుగ సంస్కృతులుగా ఉపవిభజన జరిగింది. ఈ ఉపవిభజన స్థానిక, ప్రాదేశిక సామీప్యాన్ని బట్టి క్రమపరిణామాన్ని అనుసరించి స్థూలంగా ఇతర తవ్వకాలలో సరిపోల్చుకుంటూ చేసిన విభజనలు. మూర్తిగారు మధ్యశిలాయుగానికి చెందిన సూక్ష్మ శిలా పరికరాల సాయంతో ఉప విభజనల ప్రత్యేకతని వెలుగులోకి తీసుకొచ్చారు.[3]
ఆయన ముచట్ల చింతమానుగావి గుహల పరిశోధకులు. ఇక్కడ మూర్తిగారు కచ్చితమైన మధ్యశిలాయుగపు క్రమపరిణామాన్ని స్పష్టంగా ధృవీకరించారు. దీన్ని వెలుగులోకి తీసుకురావడం మూర్తిగారి ఘనత. 1974 నాటికి అంతర్జాతీయ పురావస్తు సంచికలలో దీని గురించి ఆయన వ్యాసాలు ప్రచురించారు. ఆయన లెక్కలేనన్ని అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించాడు. దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించాడు. చింత మానుగావిలో ప్రాచీనావాసాలను పరిశీలించేటప్పుడు మూర్తి గారి జర్మన మిత్రుడు, ప్రాచీన హిందూ న్యాయస్మృతిలో పండితుడు సాంతహైమర్ యథాలాపంగా చేసిన సూచనతో మూర్తిగారు జానపద గిరిజన సంస్కృతుల అధ్యయనంలో ప్రవేశించారు. కొన్నేళ్ళ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జానపద పరిశోధనా సంస్థకి డైరెక్టర్లుగా వెళ్లి ఆంధ్ర దేశంలో స్థిరపడ్డాడు. ఇటువంటి మల్టీ డిసిప్లినరీ పరిశోధకుల్లో అరుదైన వ్యక్తి ఆయన.[3]
ఆయన నాలుగు పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో గౌరవాచార్యులుగా ఉండేవారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆయన దగ్గర పరిశోధన చెయ్యడానికి విద్యార్థులలో ఒకరకమైన పోటీ ఉండేది.
రచనలు
[మార్చు]2003 లో మొదటి సంపుటి, పూర్వయుగము నుండి క్రీ పూ500 వరకు [4] ఎమ్ ఎల్ కె మూర్తి సంపాదకత్వంలో విడుదలైంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Malladi Leela Krishna Murty archaeologist, educator[permanent dead link]
- ↑ కొత్త వెలుగులో తెలుగు చరిత్రలు 19-08-2015[permanent dead link]
- ↑ 3.0 3.1 అరుదైన పరిశోధకుడు 11-06-2016[permanent dead link]
- ↑ Pre and Protohistory till 500BC (పూర్వయుగము నుండి క్రీ పూ500 వరకు) గూగుల్ బుక్స్ లో మునుజూపు
- ↑ [ http://www.hindu.com/thehindu/mp/2003/02/12/stories/2003021200370100.htm Archived 2010-11-28 at the Wayback Machine Looking back in time , news story onfirst volume release in 2003]