గీతా సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీతా సుబ్బారావు

గీతా సుబ్బారావు తెలుగు రచయిత మరియు కార్టూనిస్టు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన అసలు పేరు "పిళ్ళా సుబ్బారావు". కానీ గీతా సుబ్బారావుగా ప్రసిద్ధి చెందారు. సినిమా వాళ్ళందరికీ పబ్లిసిటీ కింగ్‌గా కూడా ఆయన ఆత్మీయుడు. పత్రికల్లో కుంచెతో అనుక్షణపు గిలిగింతలు పెట్టే గెంతులే కాక, గీతా ఆర్ట్స్, గీతా పబ్లిసిటీస్, గీతా చిత్ర అంటూ పబ్లిసిటీ రంగంలో తనదైన కళాకాంతులు వెదజల్లిన వాడాయన. బాల సాహిత్య రచయితగానూ అవార్డులందుకున్న మనిషి. తెలుగులో తొలి ప్యాకెట్ డైలీ కార్టూన్లు వేసిన క్రెడిట్ బహుశా పిళ్ళా సుబ్బారావ్ గారికే దక్కుతుంది. మరో విశేషం దినపత్రికల్లో ఆయన పుంఖాను పుంఖాలుగా పొలిటికల్ కార్టూన్లు వేసినా కార్టూన్లో నాయకుల క్యారికేచర్లు లేకుండానూ, రాజకీయ వ్యవస్థపై చురకలు వేసిన కార్టూనిస్టూ, అందునిమిత్తం ఒడిదుడుకులను మాత్రం ఎదుర్కొన్న కార్టూనిస్టూ, ఈయనే అనాలి.[2]

ఆయన చిన్నతనం నుండేకథలను వ్రాయడం ప్రారంభించారు. తొలి రచనే బెంగాలీలోకి అనువాదం కావడం, సినిమా రూపంలో రావడం జరిగింది. బాలల రచనలో విశేష ప్రతిభ కనబరిచిన గీతా సుబ్బారావుకు మంగాదేవీ బాల సాహిత్య పురస్కారాన్ని అందించారు. ఈయన సెన్సార్‌ బోర్డు సలహా మండలి సభ్యునిగా ఉన్నారు. సీనియర్‌ పాత్రికేయులైన సుబ్బారావు ఇప్పటి వరకు 35 నవలలు, వందలాది బాలల రచనలు చేశారు. ఈయన రచనలు అనేక భాషల్లోకి తర్జుమా అయ్యాయి. కొన్ని సినిమాల రూపంలోనూ వచ్చాయి.[3] ఆయన తనకు సన్మానం సందర్భంగా అందించిన రూ. 25 వేలను తిరిగి ఆ సంస్థకే ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్‌ మరిన్ని నిర్వహించాలన్న సదుద్దేశంతో ఈ నగదును సాయంగా అందించారు.

కార్టూనిష్టుగా[మార్చు]

గీతాసుబ్బారావుగారు దాదాపు మూడు దశాబ్దాలపాటుగీతా పేరుతో కారూన్లు వేశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక దినపత్రికలలో ప్రతిరోజు గీసిన హాస్యరేఖలు. రాజకీయాలకూ, సామాజికులకూ చురుక్కుమనిపించే విధంగా గీతోపదేశం చేసారు. శంకర్స్ వీక్లీతో పాటు మరికొన్నిహిందీ, ఇంగ్లీషు పత్రికల్లో.. అన్నితెలుగు పత్రికల్లో కారూన్లు ప్రచురించబడ్డాయి. కారూనిస్టుకు వుండాల్సిన లక్షణాలన్నీసుబ్బారావుగారికి ఉన్నాయి. అందువల్లనే దశాబ్దాలపాటు అఖండంగా వ్యంగ్యవిన్యాసాలూ, చమత్కార చిత్రాలూకొనసాగించ గలుగుతున్నారు. వాటిలో కొన్ని "గీతా నవ్వులు" పుస్తకంలో ప్రచురించారు.[4]

పుస్తకాలు[మార్చు]

  • చిన్నారి విజయం[5]
  • గీతాజగత్[6]
  • గీతానవ్వులు
  • గోరు ముద్దలు (పిల్లల కథలు) [7]
  • పిల్లలు కాదు పిడుగులు - ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ అవార్డును, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ బహుమతిని గెలుచుకుంది.[8]
  • అమ్మ చెప్పిన అత్తా కోడళ్ళు కథలు[9]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]