Jump to content

భగవాన్ (చిత్రకారుడు)

వికీపీడియా నుండి
(భగవాన్(చిత్రకారుడు) నుండి దారిమార్పు చెందింది)
క్యానం భగవాన్‌దాస్
భగవాన్
జననంక్యానం భగవాన్‌దాస్
అక్టోబరు 23, 1939
కృష్ణా జిల్లా, విజయవాడ
మరణండిసెంబరు 8, 2002
విజయవాడ
నివాస ప్రాంతంవిజయవాడ
ఇతర పేర్లుభగవాన్
వృత్తిటైపురైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్‌, వ్యంగ్య చిత్రకారుడు
ఉద్యోగంస్వంత స్కూలు (స్వామీ కమర్షియల్ టైప్ రైటింగు ఇన్‌స్టిట్యూట్)
పదవి పేరుప్రిన్సిపాల్
భార్య / భర్తఅమ్మాజి
పిల్లలుప్రవీణ్‌కుమార్‌, వీణాధరి, ప్రజ్ఞాన్‌
తండ్రిక్యానం వీరాస్వామి నాయుడు
తల్లిక్యానం అమృతవల్లి తాయారమ్మ

భగవాన్ అన్న పేరుతో కార్టూన్లు వేసిన ఈయన అసలు పేరు క్యానం భగవాన్‌ దాస్. ఈయన అక్టోబరు 23, 1939 న విజయవాడలో, అమృతవల్లి తాయారమ్మ, వీరాస్వామి నాయుడు దంపతులకు, జన్మించాడు. ఈయన భార్య పేరు అమ్మాజి. ఈయనకు ఇద్దరు కుమారులు ప్రవీణ్ కుమార్, ప్రజ్ఞాన్, ఒకకుమార్తె వీణాధరి.

వృత్తి

[మార్చు]

ఈయన సత్యనారాయణపురం (విజయవాడ)లో స్వామి కమర్షియల్, టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్ 1965 లో స్థాపించి, విద్యార్థులకు టైపురైటింగులో శిక్షణ ఇస్తూ జీవనం మొదలు పెట్టాడు. స్వతహాగా మంచి కళాకారుడు, చమత్కారి. మంచి వక్త. విద్యార్థులకు చక్కగా అర్ధమయ్యే పద్ధతిలో టైపురైటింగులో మెళకువలను నేర్పుతూ ఉండేవాడు.

ప్రవృత్తి

[మార్చు]

ఈయన వృత్తి రీత్యా మాస్టారుగా ఉన్నా, ప్రవృత్తి రీత్యా మంచి వ్యంగ్య చిత్రకారుడు. ఈయన కార్టూన్‌లు 1960 దశకం చివరి రోజులనుండి దాదాపు 1980ల వరకు అనేక వార/మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఆయన తన వ్యంగ్య చిత్రాకళా నైపుణ్యాన్ని, విద్యార్థులను ఉత్తేజపరచటానికి కూడా చక్కగా వాడేవాడు.

ప్రోత్సాహం

[మార్చు]

ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు బాబు, జయదేవ్, భగవాన్ మంచి మిత్రులు. తెలుగువారికి ఒక మంచి కార్టూనిస్టును అందించిన ఘనత, భగవాన్‌దే అని చెప్పవచ్చు. కొలను వెంకట దుర్గాప్రసాద్ను తన మాటలతో ఎంతగానో ఉత్తేజితుడిని చేసి బాబు గా మార్చాడు. ఈ విషయం, బాబు మాటల్లోనే చెప్పాలంటే "....హాస్యం, కార్టూన్ల గురించి ఎంతో చెప్పి వెయ్యమని ప్రోత్సహించినవారు, గురువులాంటి మిత్రుడు క్యానం భగవాన్‌ దాస్".

మరణం

[మార్చు]

ఈయన 2002 డిసెంబరు 8 న మరణించాడు.