శేఖర్ (కార్టూనిస్టు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శేఖర్ కంబాలపల్లి కార్టూనిస్ట్

శేఖర్ (1965 జూలై 16 – 2014 మే 19) తెలుగులో ఉన్న బహుకొద్దిమంది మంచి కార్టూనిస్టుల్లో ఒకరు. ఆయన కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో రాజకీయాల పైన తీవ్రమైన, సున్నితమైన విమర్శలతో చాలా బావుంటాయి, శేఖర్ కార్టూన్లు నవ్వించేవే కాదు, లోతుగా ఆలోచింపజేస్తాయి కూడా. శేఖర్ కు కార్టూనిస్ట్ గా 22 సంవత్సరాల అనుభవం ఉంది.

జీవిత విశేషాలు[మార్చు]

శేఖర్ పూర్తి పేరు కంబలపల్లి చంద్రశేఖర్. ఆయన 1965 జూలై 16 సూర్యాపేటలో కంబాలపల్లి వెంకయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించారు. ఆయన హైదరాబాదులోనివాసముండేవారు. ఆయన బి.యస్.సి. డిగ్రీని 1985లో నల్గొండ లోని యన్.జీ. కళాశాలలో పూర్తి చేసారు. ఆ తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో యమ్.ఏ. తెలుగు లిటరేచర్ చదివారు. మెట్టమెదటి సారిగా 1989 లో ప్రజాశక్తి దిన పత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా ప్రస్థానాన్ని ఆరంబించారు. ఆతరువాత ఆంధ్రప్రభ, ది న్యు ఇండియన్ ఎక్స్ ప్రెస్ దిన పత్రికలకు పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేసారు. ప్రస్తుతం ఆంధ్ర జ్యోతి దిన పత్రికకు పనిచేసారు. గత 22 సంవత్సరాలలో శేఖర్ గీసిన దాదాపు 40000 కార్టూన్లు తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మరాటీ, పంజాబీ, బెంగాలీ భాషలలో ప్రచురించబడ్డాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన భార్య పేరు చంధ్రకళ. ఆయనకు ఇద్దరు పిల్లలు నందు, చేతనా.

శేఖర్ వ్రాసిన కార్టూన్ పుస్తకాలు[మార్చు]

  1. పారాహుషార్ (2004)
  2. శేకార్టూన్స్ (2005)
  3. బ్యాంకు బాబు (2004)
  4. గిదీ తెలంగాణా (2010)

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]