మల్లిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లిక్
మల్లిక్
జననంమల్లిక్
ఇతర పేర్లుమల్లిక్
వృత్తితెలుగువన్.కాం అనే వెబ్సైట్ కి ముఖ్య సంపాదకులు
ప్రసిద్ధిప్రముఖ కార్టూనిస్టు

మల్లిక్ ప్రముఖ కార్టూనిస్టు. . ఆయన వేసిన ప్రతీ వ్యంగ్యాస్త్రం ఆలోచన రేకెత్తించేదిగా ఉంటుంది.అలాగే సమకాలీన విషయాలపై వారు వ్రాసిన వ్యంగ్యకథలు కూడా ఆలోచింపజేసేవిగా ఉంటాయి.మల్లిక్ వివిధ పత్రికలలో వివిధ కార్టూన్లను సృష్టించిన వ్యక్తి. అందులో ఆంధ్రభూమి పాఠకులకు మల్లిక్ సృష్టించిన చిట్టి, టింగు తెలియ కుండా ఉండరు. .ఐదు వందలకు పైగా చిన్న కథలు వివిధ పత్రికలకు వ్రాసారు. అలాగే యెన్నో ధారావాహికాలు కూడా ప్రచురింపబడ్డాయి. "పరుగో పరుగు”, "జీవితమే ఒక ఢమాల్" కథలు సినిమాలుగా తీయబడి జనాదరణను పొందాయి. అలాగే "మనీ", సిసింద్రీ" చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్ గా ఛాయాచిత్రాలను అందించారు. ఆల్ ఇండియా రేడియో వారికి 30కి పైగా నాటికలు వ్రాసారు. అందులో "ఇంపోర్టెడ్ కెమేరా" రేడియో శ్రోతకు బాగా తెలిసిందే! ఇంకా యెన్నో టీ.వి ధారావాహికాలకు కథను అందించారు. మచ్చుకి -జెమినీ వారికి "అమృతం", "ఆంధ్రా అందగాళ్ళు", ఈ టీ.వికి "ఫన్నీస్", "ఆవిడ నా భార్య కాదు".

బాల్యం[మార్చు]

వరంగల్లు జిల్లా నుండి వెండితెరకు పాటల రచయిత కావాలనుకొని హైదరాబాద్‌ ఫిలింనగర్‌ చేరాడు మల్లిక్. అనేక కష్టాలు పడ్డాడు. చివరకు పాటల రచయిత కావాలనుకున్న వాడు సంగీత దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. 'మల్లిక్‌' ఇప్పటి వరకు 21 తెలుగు టీవీ సీరియళ్లకు స్వరకర్తగా వ్యవహరించారు.

పల్లె పాటల ప్రభావం[మార్చు]

ఆయన తండ్రి నాటకాలు ఆడేవారు. అమ్మ పల్లెపాటలు పాడేది. ఆ ప్రభావం ఆయనపై ఉంది. డిగ్రీ పూర్తి చేసిన తదుపరి హైదరబాద్ లో వెళ్లాలని నిర్ణయించుకుని ఎక్కడ ఉండాలో తెలియక ఓయూలో ఎమ్మెస్సీలో చేరారు. ఉండేందుకు వసతి దొరగ్గానే అవకాశాల కోసం ఫిలింనగర్‌లో ప్రయత్నించారు. స్టూడియోల వద్ద గంటల కొద్దీ ఎదురు చూశావారు. కానీ స్టూడియోలలోనికి అనుమతించేవారు కాదు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఒక్క ఛాన్సూ రాలేదు. ఓయూ హాస్టల్లో ఉంటూనే కొన్నాళ్లకు మిత్రుల సాయంతో 'అల్ట్రామోడల్‌ ఆంధ్రాబేబీ' ఆల్బమ్‌కు మూడు పాటలు రాశారు.అది విడుదల కాగానే ఓ సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. కానీ అది రిలీజ్‌ కాలేదు.

ఆగిన పి.జీ. చదువు[మార్చు]

ఎప్పుడూ ఫిలింనగర్‌ రోడ్లపై ఉండటంతో కాలేజీలో హాజరు తగ్గింది. పీజీ మధ్యలోనే ఆగిపోయింది. క్యాంపస్‌ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. దీంతో రచయిత కావాలన్నా కోరికను పక్కన పెట్టి వద్ద అసిస్టెంట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేరారు. సంగీతంలో ఓనమాలు మొదల య్యాయి. 2005లో ఓ స్నేహితుడు సాయంతో చిన్న అవకాశం వచ్చింది. జెమినీ టీవీ వారు తీస్తున్న 'ఆనందమానందమాయే' సీరియల్‌కు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేశారు.

శబ్దాలయాలో అవకాశం[మార్చు]

రోజు గడవడం కోసం చిన్న ఉద్యోగంలో చేరారు. జాబ్‌ చేస్తుండగా నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి తమ శబ్దాలయా బ్యానర్‌పై తొలిసారి డెయిలీ సీరియల్‌ తీస్తున్నారని తెలిసి కలిశారు. ఆ సీరియల్‌ డైరెక్టర్‌ డి.విజయ భాస్కర్‌ ఆయనకు కొత్త జీవితం ఇచ్చారు. ఆ సీరియల్‌ 'శ్రావణమేఘాలు' మంచి పేరు తెచ్చింది. తర్వాత అవకాశాలు శూన్యం. ఏడాది తర్వాత మరలా డి.విజయభాస్కరే 'తూర్పువెళ్ళే రైలు' సీరియల్‌కు స్వరకల్పన చేసే అవకాశం ఇచ్చారు.

ఇందులో పాటకు మంచి గుర్తింపు వచ్చింది.దీనికి 2008 'సినీగోయర్స్‌ అవార్డు' తీసుకున్నారు. 2011 నుంచి జీ టీవిలో వస్తున్న 'చిన్న కోడలు' సీరియల్‌ పాట' ఈ రాధాకృష్ణార్పణం'... పేరు తెచ్చింది. దీనికి జీటీవీ అవార్డు అందుకున్నాడు. 'అలా మొదలైంది' డెయిలీ సీరియల్‌కు స్వరకల్పన చేస్తున్నారు. ఢిల్లీ తెలుగు అకాడమి బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.

తెలుగువన్.కాం అనే వెబ్సైట్ కి ముఖ్య సంపాదకులుగా, తెలుగువన్ టీ.వికి కంటేట్ హెడ్ గా పనిచేస్తున్నారు. వీటితో పాటు వారు టీ.విలో స్టాండప్ కామెడీ కూడా చేస్తున్నారు!

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మల్లిక్&oldid=2896199" నుండి వెలికితీశారు