మిమిక్రీ శ్రీనివాస్
మిమిక్రీ శ్రీనివాస్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | శ్రీనివాస్ చించపట్టణ |
జననం | 1961 డిసెంబరు 25 |
వృత్తి | మిమిక్రీ |
క్రియాశీల కాలం | 1977-present |
మిమిక్రీ శ్రీనివాస్ (శ్రీనివాస్ చించపట్టణ గోమఠేశం) అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వెంట్రిలాక్విస్టు, మికిక్రీ కళాకారుడు. ఆయన భారతదేశంలో మొదటి ధ్వని ఇంద్రజాలికుడు. ఆయన 37 సంవత్సరాల నుండి ఈ మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళలను ప్రతర్సిస్తూ భారతదేశాం, ప్రపంచవ్యావ్తంగా సుమారు 6500 ప్రదర్శనలిచ్చాడు. ఆయన యు.ఎస్, యు.కె, యు.ఎ.ఇ, సింగపూర్, మలేసియా, షార్జా, భహ్రాయిన్, కువైట్, టాంజానియా, సౌదీ అరేబియా, శ్రీలంక దేశాలను పర్యటించారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన నేరెళ్ల వేణుమాథవ్ గారి ఆరాధకులు. ఆయన చెన్నై లోని ఎం.ఎం.రాయ్ నుండి వెంట్రిలాక్విజం కళను అభ్యసించారు. తరువాత ఆయన యు.ఎస్. లోణి కొలొరాడో లో మహెర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వెండ్రిలాక్విస్ట్స్ లో వెంట్రిలాక్విజం లో పట్టభద్రుడైనాడు. ఆయన "ఉత్తర అమెరికా వెంట్రిలాక్విస్టుల అసోసియేషన్" లో సభ్యులు. ఆయన "మిమిక్రీ శ్రీనివాస్", "మిమిక్రీ శ్రీనివోస్", "మిమిక్రీ శ్రీను" గా సుపరిచితులు. 2013 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిదవ తరగతి భౌతిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో "ధ్వని" పాఠంలో ఆయన గూర్చి పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు.
ప్రారంభ జీవితం
[మార్చు]శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లాలోని కేసముద్రం గ్రామంలొ 1961లో జన్మించాడు. ఆయన బాల్యదశలో ఉన్నప్పుడు డా.నేరెళ్ళ వేణుమాథల్ ప్రదర్శనకు ప్రాభావితులై వివిధ ధ్వనులను అనుకరించుతను ప్రారంభించాదు. వారి తల్లిదండ్రులు వరంగల్ పట్టణానికి కుటుంబాన్ని మార్చినందున ఆయనకు మిమిక్రీ చేర్చుకునే అవకాశం దక్కింది. వరంగల్ నేరెళ్ల వేణుమాథవ్ యొక్క స్వంత పట్టణం అయినందున ఆయన వేణుమాధవ్ యొక్క్ ఆరాధకునిగా మారాడు. తన 15 వ యేట స్టేజి ప్రదర్శనలివ్వడం ప్రారంభించాడు. అతి త్వరలొ ఆయన మిమిక్రీ కళాకారునిగా విశేష ఖ్యాతినార్జించారు.
మూలాలు
[మార్చు]- https://web.archive.org/web/20091229185531/http://www.123oye.com/mimicry-careers.htm
- http://www.telugucinema.com/c/publis[permanent dead link]