Jump to content

మహాత్మా గాంధీ విగ్రహం, గాంధీ మైదానం

వికీపీడియా నుండి
మహాత్మా గాంధీ విగ్రహం
ఇద్దరు పిల్లలతో ఆప్యాయంగా నిలబడి ఉన్న గాంధీజీ
మహాత్మా గాంధీ విగ్రహం, గాంధీ మైదానం is located in Patna
మహాత్మా గాంధీ విగ్రహం, గాంధీ మైదానం
Location of Statue in Patna
అక్షాంశ,రేఖాంశాలు25°37′7″N 85°8′33″E / 25.61861°N 85.14250°E / 25.61861; 85.14250
ప్రదేశంగాంధీ మైదానం, పాట్నా, బీహార్, భారతదేశం
రూపకర్తఅనిల్ సుతార్
రకంవిగ్రహం
నిర్మాన పదార్థంకాంస్యం
ఎత్తు22 మీటర్లు
నిర్మాణం ప్రారంభం2012
పూర్తయిన సంవత్సరం2013
ప్రారంభ తేదీ15-02-2013
అంకితం చేయబడినదిమహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ విగ్రహం భారత జాతి పిత మహాత్మాగాంధీ యొక్క ఒక ప్రజా స్మారక చిహ్నం. ఇది పాట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలో మహాత్మాగాంధీకి చెందిన విగ్రహాలలో అత్యంత పొడవైన కాంస్య విగ్రహం. ఈ విగ్రహాన్ని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2013 ఫిబ్రవరి 15 న ఆవిష్కరించారు. ఈ విగ్రహం 40 కోట్ల రూపాయల వ్యయంతో బీహార్ ప్రభుత్వం చే స్థాపించబడింది.[1] [2]

వివరణ

[మార్చు]

ఈ విగ్రహం 72 అడుగులు (22 మీ.) ఎత్తు ఉంటుంది, కాంస్యంతో తయారు చేయబడింది. ఈ విగ్రహాన్ని "రాం సుతార్" అనే శిల్పి రూపొందించారు. ఈ విగ్రహం పాట్నా లోని సెయింట్స్ క్సేవియర్ హై స్కూలు ఎదురుగా నెలకొని ఉంది.[3] ఈ విగ్రహంలో మహాత్మా గాంధీ ఇద్దరు పిల్లలను వాత్సల్యంగా పట్టుకుని నిలుచున్నట్టు ఉన్నది. ఈ విగ్రహం యొక్క వేదిక 24 అడుగులు (7.3 మీ.) ను కలిగి యుండి నలువైపులా గాంధీ జీవితంలో ముఖ్య చారిత్రిక ఘట్టాలైన 1930 లో జరిగిన దండి సత్యాగ్రహం, 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం, 1917 లో జరిగిన చంపారన్ సత్యాగ్రహం, గాంధీజీ ఉపయోగించిన చరఖా గుర్తు లను చిత్రించబడి ఉన్నాయి.[4]

ఈ విగ్రహ శిల్పి అయిన అనిల్ "రామ్‌సుతార్ ఆర్ట్స్ ప్రైవెట్ లిమిటెడ్" అనే సంస్థను నదుపుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహంలో గాంధీజీ చిరునవ్వుతో కలిపిస్తూ, ప్రపంచ శాంతి గూర్చి సందేశం యిచ్చేటట్లు కనిపిస్తారనీ, ప్రపంచంలో ధనిక, పేదలను తారతమ్యాలను రూపుమాపెందుకు అందరికీ సందేశం యిచ్చేటట్లు ఉన్నారనీ వివరించారు. [5]

దీనిని పది కోట్ల రూపాయల వ్యయంతో బీహార్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఢిల్లీకి చెందిన శిల్పి రామ్‌ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. మహాత్ముడు నిలబడి ఉన్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తమకు ఎంతో గర్వకారణమని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్ముడి విగ్రహమే పెద్దదిగా భావిస్తున్నారు. పార్లమెంటులో గాంధీ విగ్రహం ధ్యానముద్రలో ఉంటారు. పాట్నాలో నెలకొల్పిన విగ్రహంలో గాంధీజీ చిరునవ్వుతో కనిపిస్తారు. పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎత్తు 16 అడుగులు కావడం గమనార్హం. అయితే పాట్నాలోని గాంధీ విగ్రహం ఎత్తు 40 అడుగులు. ఇందుకోసం ఉపయోగించిన పీఠం ఎత్తు ముప్పై అడుగులు. మొత్తం డెబ్బై అడుగుల ఎత్తు విగ్రహం అని బీహార్ ప్రభుత్వం వెల్లడించింది.[6]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "World's Tallest Statue of Mahatma Gandhi Unveiled in Patna". PatnaDaily.Com. 2013-02-15. Archived from the original on 2023-06-24. Retrieved 2014-05-28.
  2. "Tallest Gandhi statue to be installed at Patna - The Times of India". Timesofindia.indiatimes.com. 2012-08-05. Retrieved 2014-05-28.
  3. "Gandhi vs Gandhi: Two statues of the Father of the Nation are getting differential treatment in Patna". PIYUSH KUMAR TRIPATHI. The Telegraph (Calcutta), Patna. 13 September 2013. Retrieved 29 May 2014.
  4. "Mahatma Gandhi's tallest statue unveiled - The Times of India". Timesofindia.indiatimes.com. 2013-02-16. Retrieved 2014-05-28.
  5. PTI (2013-02-15). "World's tallest Gandhi statue unveiled in Patna". The Hindu. Retrieved 2014-05-28.
  6. మహాత్మా గాంధీ: పాట్నాలో 70 అడుగుల ఎత్తుతో కాంస్య విగ్రహం ఆవిష్కరణ!

ఇతర లింకులు

[మార్చు]