జికా వైరస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జికా వైరస్
Electron micrograph of Zika virus. Virus particles are 40 nm in diameter, with an outer envelope and a dense inner core (source: CDC).
Virus classification
Group:
Group IV ((+)ssRNA)
Family:
Flaviviridae/ఫ్లావివైరిడె
Genus:
ఫ్లావి వైరస్
Species:
జికా వైరస్

జికా వైరస్ దోమ కాటు వలన మనుషులకు వ్యాప్తి చెందుతుంది.దూకుడుగా ఉండే ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా ఈ వైరస్ సోకుతుంది. నిజానికి ఎల్లో ఫీవర్, వెస్ట్‌నైల్ చికన్‌గన్యా, డెంగ్యూ వంటి వైరస్‌ల కుటుంబానికి చెందినదే జికా. ఆఫ్రికాలో బయలుదేరిన ఈ వైరస్. క్రమంగా లాటిన్ అమెరికా, పలు యూరప్ దేశాలకు విస్తరించింది.జికా వైరస్ సోకిన రోగికి వ్యాధి నయం చేసే మందులు లేవు. ఎబోలా వైరస్ సృష్టించిన బీభత్సం మర్చిపోకముందే కొన్ని తరాలను ప్రభావితం చేయగల ఒక వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నది.దోమల ద్వారా వ్యాపించే జికా అనే మహమ్మారి ఇప్పటికే 25 దేశాల్లో విస్తరించింది. దాదాపు 4వేల మంది అప్పుడే పుట్టిన శిశువుల భవితవ్యాన్ని అంధకారం చేసింది. వారిలో దాదాపు 50 మంది చిన్నారులు చనిపోయారు కూడా[1].

ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ పై భారత దేశ కేంద్రప్రభుత్వ ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఇప్పటికి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వైరస్ నలభై లక్షల మందికి సోకే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా గర్భిణీలు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ధోమల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.. ఫిబ్రవరి 1న కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.. భారత్ లోకి ఈ వైరస్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది.జికా వైరస్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి కారకం గురించి మొదట్లో ఎవరికీ తెలియదు. ఇది బ్రెజిల్‌లో గత ఏడాది వ్యాపించింది.2015 మార్చి నాటికి అంతు చిక్కని వ్యాధిగా గుర్తింపు పొందింది[2].

ఈవైరస్ విసృతంగా వ్యాపించిన దేశాలు

[మార్చు]

ప్రత్యేకించి లాటిన్ అమెరికాలో ఈ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నది.బొలీవియా, బ్రెజిల్, కేప్ వెర్డే, కొలంబియా, పరాగ్వే, అమెరికా వర్జిన్ ఐలాండ్స్, వెనిజులా, పోర్టెరికో తదితర దేశాల్లో ఇప్పటికే వ్యాపించింది.జికా వైరస్ నేపథ్యంలో కరీబియన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులు, పర్యాటకులకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, కెనడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశాయి.అతి త్వరలో ఈ వైరస్ చిలీ, కెనడా మినహా మొత్తం రెండు అమెరికా ఖండాలకూ విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.ఇప్పటికే వైరస్ ఉన్న దేశాల్లోని మహిళలు కనీసం మరో రెండేండ్ల వరకూ గర్భం దాల్చవద్దని ఆయా దేశాలు హెచ్చరించాయి[1]. న్యూయార్క్‌లో మొదటి జీకా ఇన్‌ఫెక్షన్‌ను 2013 డిసెంబరులో కనిపెట్టారు. ఇప్పుడు ఈ వైరస్ లక్షలాది మందిని కబళించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం33దేశాల్లో జికా వ్యాపించిందంటున్నారు[2].

జికా వైరస్ వలన ఏర్పడు ముప్పు/హాని

[మార్చు]
A video explanation of Zika virus and Zika fever

ఈ వైరస్ సోకిన మహిళ గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డలు అసాధారణమైన రీతిలో చిన్న తలలతో (మైక్రోసిఫలే) పుడతారని, కొన్ని సందర్భాల్లో శిశువుకు వృద్ధిపరమైన సమస్యలు తలెత్తుతాయని, మరింత తీవ్రతరమైతే మృతశిశువులే మిగులుతాయని పేర్కొంటున్నారు.ఇప్పటికే పలు కేసులలో ఉమ్మ నీరు ద్వారా గర్భంలోని చిన్నారులకు ఈ వైరస్ సోకింది. ఒక్క బ్రెజిల్‌లోనే 4వేల మంది గర్భిణులు చిన్న తలలతో కూడిన బిడ్డలకు జన్మనిచ్చారు.మైక్రోసిఫలే అనే ఈ వ్యాధి లక్షణానికి చికిత్స కూడా లేదు.గర్భిణులకు ఈ వైరస్ సోకిందీ లేనిదీ తెలుసుకోవడం కూడా అసాధ్యం[1]. కొలంబియాలో ఇప్పటివరకు 3,100మంది గర్భిణులకు సోకినట్లు ఆ దేశ అధ్యక్షుడు జువాన్‌ మాన్యుయేల్‌ సాంటోస్‌ శనివారం తెలియజేశారు. జికా వైరస్ కారణంగా పుట్టబోయే బిడ్డల యొక్క తలలు పూర్తి పరిమాణంలో అభివృద్ధి చెందవు.కొలంబియాలో మొత్తం 25,645 మంది జికా వైరస్‌ బారిన పడ్డారని, అందులో 3,177 మంది గర్భిణులు ఉన్నట్లు సాంటోస్‌ వివరించారు[3]

జికా వైరస్ వ్యాప్తి కారకాలు-వ్యాధి లక్షణాలు

[మార్చు]
వైరస్ కారణంగా చేతిపైన దద్దుర్లు

ఈడిస్ దోమ ఈ వైరస్‌కు వాహకంగా పనిచేస్తుంది.లైంగిక సంపర్కం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే హెచ్చరికలు ఉన్నప్పటికీ దీన్ని ధ్రువీకరించేందుకు ఇప్పటి వరకూ కేవలం రెండే కేసులు ఉదాహరణగా ఉన్నాయి. రక్తమార్పిడి ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది.ఈ వైరస్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, వంటి మీద దద్దుర్లు, కండ్లు ఎర్రబారడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. దీనితో పరిస్థితి ముదిరిపోయేదాకా దీనిని గుర్తించడం కష్టమవుతుంది[1].అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట జికా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఇప్పుడే చెప్పడం తొందరపాటే అయినప్పటికీ చాలా సందర్భాల్లో వైరస్ల వ్యాప్తిలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రతతో దోమ మరిన్ని దోమల్ని ఉత్పత్తి చేస్తుందని వారు చెబుతున్నారు.

వ్యాధిలక్షణాలు

[మార్చు]

చాలామందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కన్పించకపోవచ్చును.కాకపోతే కొద్దిపాటి జ్వరం, వంటిపై దద్దుర్లు, కీళ్ళనొప్పులు, కళ్ళకలక (కళ్ళుఎర్రబడటం) వంతివి కనబడతాయి.కొంతమందికి కండరాలనొప్పులు కనిపించ వచ్చును. కొందరిలో తలనొప్పి ఉంటుంది.ఓకసారి వైరస్ సోకాక లక్షణాలు కనిపించటానికి కొద్ది రోజులు మొదలుకొని కొన్ని వారాలు పట్టవచ్చును.వైరస్ సోకితే అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ళవరకు ఉండవచ్చును.అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాపింపచేసె పరిస్థితిలో వారుంటారు.

వ్యాధి సోకినపుడు ఏర్పడె వ్యాధి లక్షణాలు ప్రాణాంతకం కాదు, సాధారణ తలనొప్పులు, వళ్లునొప్పులే, అయితే వ్యాధిసోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదకరమైనవి.అవి సరీర/దేహ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసేఆటో ఇమ్మ్యూన్ వ్యాధులను కలగజేయవచ్చును.ఆతరువాత రోగికి గులియన్ బ్యారీ సిండ్రోమ్, మొదడు కుంచించుకుపోయే మైక్రోసెఫాలీ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ వచ్చును.

లైంగిక చర్య ద్వారా కూడా

[మార్చు]

ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాప్తి చెందుతోంది. టెక్సాస్‌లో ఈ విధంగా జికా సోకిన తొలి కేసు నమోదైంది.ఈ మేరకు అమెరికా ఆరోగ్య విభాగ వర్గాలు ధ్రువీకరించాయి.ఇప్పటివరకూ ఈ వైరస్ దోమల ద్వారానే సోకుతుందని భావించారు. తాజాగా వైరస్ సోకిన వారితో లైంగిక చర్య ద్వారా కూడా సోకుతుందని తేలింది.ఈ మేరకు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డెరైక్టర్ డాక్టర్ టామ్ ఫ్రీడెన్ ఓ ఈ మెయిల్‌లో స్పష్టం చేశారు.[4]

గర్భిణుల పాలిట శాపంగా

[మార్చు]

జికా వైరస్ గర్భిణుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకి ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వైరస్‌తో సంభవించే మైక్రోసెఫలీ అనే వ్యాధి పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జికా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవద్దని గర్భిణులకు డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది[4].

చిక్సిత

[మార్చు]

వ్యాధిసోకిన తరువాత నిర్దిష్త చికిత్స ప్రక్రియ లేదు.ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికి ఇస్తారు.ఇప్ప‌టివ‌ర‌కు జికా వైర‌స్‌కి ప్ర‌త్యేకంగా మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు. బాగా విశ్రాంతి తీసుకోవాలి. శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కి గురికాకుండా ద్ర‌వ‌ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవాలి.జ్వ‌రం, నొప్పుల‌ను త‌గ్గించే మందులు వాడాలి.యాస్ప్రిన్ గానీ, ఇంకా ఇత‌ర నాన్ స్టిరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్ అంటే ఇబుప్రొఫెన్‌, న్యాప్రాక్సెన్ లాంటివి వాడకూడ‌దు. డెంగ్యూ, జికా ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలేవ‌ర‌కు ఈ మందుల‌ను వాడ‌కూడ‌దు. అలా వాడితే ర‌క్త‌స్రావం ప్ర‌మాదం ఉంటుంది.మ‌రేదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్న‌వారు కూడా డాక్ట‌రుని సంప్ర‌దించాకే మందులు వేసుకోవాలి.జికా ల‌క్ష‌ణాలున్న‌వారికి ఒక వారం వ‌ర‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ దోమ‌లు కుట్ట‌కుండా జాగ్ర‌త్తప‌డాలి. ఎందుకంటే ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ మొద‌టివారంలో ర‌క్తంలో జికా వైర‌స్ ఉంటుంది. దోమ‌లు మ‌ళ్లీ కుట్టిన‌పుడు ఆ వైర‌స్ వాటి ద్వారా తిరిగి మ‌రొక వ్య‌క్తికి సంక్ర‌మించ‌వ‌చ్చు. ఇన్‌ఫెక్ష‌న్‌కి కార‌ణ‌మ‌య్యే వైర‌స్‌ని మోసుకువెళ్లే దోమ అది కుట్టిన‌వారికి దాన్నివ్యాపింప‌చేస్తుంది[5].

తగినంత విశ్త్రాంతి తీసుకోవాలి.ద్రవ ఆహారాని ఎక్కువ తీసుకోవడం వలన డిహైడ్రెసన్ తగ్గించవచ్చును.జ్వరాన్ని తగ్గించూ అసిటమినొపెన్ (acetaminophen) వంటి మందుమాత్రలు వాడాలి.అస్ప్రిన్, నాన్ స్టెరీయోడల్ (non-steroidal), నొప్పినివారణమందులు (anti-inflammatory ) వాడరాదు.[6]

మొదటి సారి జికా వైరస్‌ గుర్తింపు

[మార్చు]

జికా వైరస్‌ను గుర్తించడం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. బ్రెజిల్ డాక్టర్లు వైద్య శాస్త్రానికి అంతుబట్టని వ్యాధి ఏదో ప్రబలుతోందని గమనించారు. అంతకుముందు కనిపించని లక్షణాలు కనిపిస్తున్నాయని గుర్తించారు. గుర్తించడం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. బ్రెజిల్ డాక్టర్లు వైద్య శాస్త్రానికి అంతుబట్టని వ్యాధి ఏదో ప్రబలుతోందని గమనించారు. అంతకుముందు కనిపించని లక్షణాలు కనిపిస్తున్నాయని గుర్తించారు.నవజాత శిశువుల ముఖాలు సాధారణంగానే ఉంటున్నా, నుదుటి భాగం వింతగా ఉంటోందని, అయినప్పటికీ వీరు ఆరోగ్యంగానే ఉంటున్నారని పరిశీలనగా చూసి తెలుసుకున్నారు. దీనిని మైక్రోసెఫలీ అని పేర్కొన్నారు. డాక్టర్లు తాము చూసిన ఇటువంటి పిల్లల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. అయితే ఇదంతా భారీ ప్రభంజనానికి కారణమవుతుందని వారికి తెలియదు. దోమల ద్వారా జికా వైరస్ ఓ ఏడాది నుంచి బ్రెజిల్‌లో వ్యాపిస్తోందని వారికి సమాచారం లేదు. ఈ శిశువులకు ఏమైందో తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలే జీకా వైరస్ గురించి తెలుసుకోగలిగేలా చేశాయి.డాక్టర్లు మొదట్లో ఈ వ్యాధిని స్వల్ప స్థాయిలో డెంగ్యూ అని అభిప్రాయపడ్డారు. కానీ పరీక్షల్లో అది నిజం కాదని తేలడంతో ఏదో తెలియనిది వ్యాపిస్తోందని భావించి అప్రమత్తమయ్యారు.2015మార్చి నాటికి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేని వ్యాధి స్థాయికి ఎదిగింది. ఇది ఎలర్జీ అని డాక్టర్లు భావించారు. కలుషిత నీటి వల్ల వ్యాపిస్తూ ఉండొచ్చని కొందరు అనుకున్నారు. సాల్వడార్‌లోని బహియా విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ డాక్టర్ గుబియో సోర్స్ మాత్రం ఇది దోమల ద్వారా వ్యాపిస్తోందేమోనని అనుమానించారు. తన కొలీగ్ డాక్టర్ సిల్వియా సర్దితో కలిసి రక్త నమూనాలను పరీక్షించారు. ఇతర వైద్యులు కూడా ఇదే విధంగా పరీక్షలు చేశారు. మొత్తం 6800బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించారు. చివరికి డాక్టర్ గుబియో సోర్స్డాక్టర్, సిల్వియా సర్ది కచ్చితమైన ఫలితాలను సాధించారు.2015 ఏప్రిల్‌లో జికా వైరస్‌ను కనుగొన్నారు[2].

ఉగాండాలో 1947లో ఈ వైర‌స్ పుట్టింద‌ని ఆ దేశ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మొద‌ట కోతుల్లో దీన్ని గుర్తించారు. మ‌నుషుల‌కు అంత ప్ర‌మాద‌క‌రం కాదులే అనుకున్నారు. కానీ చాలా వైర‌స్‌లు కాల‌క్ర‌మేణా త‌మ జ‌న్యువుల్లో మార్పులు సంత‌రించుకున్న‌ట్టే జికా వైర‌స్‌లో కూడా మార్పులు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ వైర‌స్ మ‌నుషుల‌కు హాని త‌ల‌పెట్టే స్థాయిలో బ‌ల‌ప‌డింది. 1960లో ఆఫ్రికాలో మొట్ట‌ మొద‌ట దీన్ని మ‌నిషికి సోకిన‌ట్టుగా గుర్తించారు. ఇప్పుడిది అమెరికా, ఆఫ్రికా దేశాల‌కే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాప్తి చెందింది. 2014లో బ్రెజిల్‌లో గుర్తించ‌గా ఇప్పు డ‌క్క‌డ వంద‌ల కేసులు న‌మోదు అవుతున్నాయి. కొలంబియా, సాల్వేడార్‌, ప‌రాగ్వే వెనిజులా, ప‌నామా, ఫ్రంచ్ గ‌యానా, ఈక్వెడార్‌, క‌రేబియ‌న్ దీవులు, బొలీవియా, హైతీ…ఈ వ‌రుస పెరిగి పెరిగి…ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా 40ల‌క్ష‌ల వ‌ర‌కు జికా వైర‌స్ బాధితులు ఉన్న‌ట్టుగా స‌మాచారం[5].

వ్యాక్సిన్

[మార్చు]

హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ దీనికి టీకా/వ్యాక్సిన్ కనుగొన్నట్లుగా చెప్పుచున్నది.అయితే అది ఇంకా ప్రీ-కికికల్ ప్రయోగ దశలో ఉందనీ, చాలాత్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు.రెండున్నరేళ్లుగా జికా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో, ప్రభుత్వ అనుమతితో ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి రావడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుందని ప్రకటించింది.ఇక రెండున్నరేళ్లుగా చేస్తున్న పరిశోధనల్లో ఫలితాలు కనిపించాయన్నారు. ప్రయోగశాల పరిశోధనల్లోనూ వ్యాక్సిన్‌తో జికా వైరస్‌ను నిరోధించగలిగామని స్పష్టం చేసింది. జికా వ్యాక్ పేరుతో వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది[7]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "వణికిస్తున్న జికావైరస్". aadabhyderabad.in. Archived from the original on 2016-02-08. Retrieved 2016-02-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 "జికా వైరస్ ఎప్పుడు బయటపడిందో తెలుసా?". andhrajyothy.com. Archived from the original on 2016-02-08. Retrieved 2016-02-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "కొలంబియాలో 25,645 మందికి జికా వైరస్". amaraawathi.com. Retrieved 2016-02-08.[permanent dead link]
  4. 4.0 4.1 "లైంగిక చర్య ద్వారానూ జికా వైరస్". sakshi.com. Archived from the original on 2016-02-08. Retrieved 2016-02-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. 5.0 5.1 "ముంచుకొస్తున్న మ‌రొక ముప్పు…జికా వైర‌స్‌!". teluguglobal.com. Archived from the original on 2016-02-08. Retrieved 2016-02-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Symptoms, Diagnosis, & Treatment". www.cdc.gov. Retrieved 2016-02-08.
  7. "జికా వైరస్ నిరోధక వ్యాక్సిన్@ భారత్ బయోటెక్". namasthetelangaana.com. Archived from the original on 2016-02-08. Retrieved 2016-02-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)