మద్దెల శాంతయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్దెల శాంతయ్య తెలుగు విశ్వవిద్యాలయ భాషాభివృద్ధి పీఠంలో అసిస్టెంటు ప్రొఫెసర్ గా పనిచేసారు. ఆయన కవి, వ్యాసకర్త.[1] క్రైస్తవ జీవితంలో ఉంటూనే దానిలోనూ ప్రవేశించిన కులాన్ని ప్రశ్నించిన అంబేద్కరైట్ మద్దెల శాంతయ్య [2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన దళితవాద రచయిత. దళిత సాహిత్యంలో ఆయన విశేష కృషిచేసారు. ఆయన భావోద్వేగాలను కవిత్వం రూపంలో రాసారు. ఆయన కవిత్వం చాలా వరకు అముద్రితంగానే వుండిపోయింది. ఆయన సమాజంలోని అన్యాయాలకు, అక్రమాలకు గొంతునిచ్చాడు. ఆయన "ఓ.సి. క్రీస్తు" అనే కవిత రాసాడు. శాంతయ్య ముస్లింలలోని పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని చూసి కరిగి నీరయిపోయాడని ఆయన రాసిన కవితలే చెప్తాయి. 1996 లో తుఫాను బీభత్సానికి ఒళ్లంతా కన్నీరై రాసిన శాంతయ్య కవిత ఆదివారం ఆంధ్రజ్యోతి కవర్‌ పేజీని అలంకరించింది. 'సముద్రం చోటు చాలక/ మనిషి కంట్లో చోటడిగింది అని అన్నాడా కవితలో. శాంతయ్య ఏది రాసినా తన హృదయాన్ని దహించి వేస్తేనే రాశాడు. అందుకే ఆయన కవిత్వం ఒక చెలిమెలోంచి జాలువారే స్వచ్ఛమైన జలం లాంటిది. అందులో ఆర్ద్రత మనను కట్టి పడేస్తుంది. దళిత ఉద్యమాన్ని సమర్థిస్తూ ఆయన వ్యాసాలు రాశాడు. తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాహిత్య, సామాజిక కృషిని కొనసాగించాడు. వ్యక్తిగత పేరు ప్రతిష్ఠల కోసం కాకుండా తాను నమ్మిన విశ్వాసాల కోసం నిబద్ధతతో కృషి చేసిన కృషీవలుడు శాంతయ్య.[3]

మరో కవితలో మతం మారినంత మాత్రాన మనస్తత్వాలు మారవని సమాజపు పోకడను మద్దెల శాంతయ్య ఎత్తి చూపారు. తను రాసిన ఒ.సి క్రీస్తు కవితలో "మాల ఫాదరీ, సాలె ఫాదరీ, కమ్మ ఫాదరీ, కమ్మ సిస్టరమ్మ, రెడ్డి సిస్టరమ్మ'లు ఉన్నందుకే 'ఒ.సి క్రీస్తు'ను మాల క్రీస్తుగానో మాదిగ క్రీస్తుగానో రమ్మని ప్రార్థిస్తుంటాం" అనే చరణాలు సభ్యసమాజాన్ని ఒక కుదుపు కుదుపుతాయి.[4]

మరణం[మార్చు]

ఆయన కామెర్ల వ్యాధితో 2001 లో మరణించాడు.

మూలాలు[మార్చు]