మద్దూరి నగేష్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్దూరి నగేష్ బాబు (1964-2005) ఒక ప్రముఖ కవి. దళితవాద సాహిత్యంలో పేరు గాంచిన వాడు. దళిత ఉద్యమ రచయిత.[1][2] తెలుగు కవిత్వం నిండా దళిత కవిత్వం పరుచుకున్న కాలంలో ఆ దళిత కవిత్వ జెండాని రెప రెప లాడించిన ఇద్దరు బాబుల్లో ఒకరు తెరేష్ బాబు అయితే మరొకరు మద్దూరి నగేష్ బాబు.[3]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలోని రుద్రారం గ్రామంలో ఆగస్టు 15 1964లో జన్మించాడు. ఆయన తల్లిదంద్రులైన అనసూయమ్మ మరియు జకరయ్యలు ఉపాధ్యాయులు. నగేష్ బాబు 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన తండ్రి మరణించాడు. ఆయన తన సోదరితో పాటు తన తల్లివద్ద ఉండి నరసరావుపేట లోని లూథరన్ హైస్కూలులో చదివాడు. ఇంటర్మీడియట్ మరియు బి.ఎ (1985-88) విద్యను గుంటూరులోని అంధ్ర క్రిస్టియన్ కళాశాలలో పూర్తిచేశాడు. తదుపరి ఆధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల లిటరేచర్ లో ఎం.ఎ (1988-91) పూర్తి చేసాడు. 1991 నుండి 1993 వరకు ఆయన హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేసాడు. 1993లో ఆయన ఆలిండియా రేడియోలో అనౌన్సర్ గా ఎంపిక కాబడి కొత్తగూడెంలో ఉద్యోగంలో చేరాడు. అచ్చట పనిచేస్తున్న మరొ రచయిత ఖాజా ఆయన స్నేహితుడు.[1][4]

రచనలు[మార్చు]

  1. వెలివాడ -1997[5]
  2. రచ్చబండ - 1997[5]
  3. మీరేవుట్లు - 1998[5]
  4. నాకేం కావాలి - 1998[5]
  5. లోయ
  6. నరలోక ప్రార్థన - 2002[6]
  7. విడి ఆకాశం - 1999 [5]
  8. పుట్ట (దీర్ఘ కవిత )
  9. గోదావరి (దీర్ఘ కవిత)

గ్రంథాలు దళిత సాహిత్యానికీ, ఉద్యమానికీ కూడా కొత్త చూపునీ వూపునీ ఇచ్చాయి. ఒక దృష్టికోణాన్ని, సాహిత్య దృక్పథాన్నీ, తాత్వికతనూ అందించాయి.

దళిత ధిక్కార కవిత్వం – నిశాని, దళిత సహానుభూతి కవిత్వం, కాస్త సిగ్గుపడడాం, సంకర కవిత్వం –ఊరూ-వాడ, అంబేద్కరిస్టు ప్రేమకవిత్వం – విడి ఆకాశం. ఇవ్వన్నీ నగేష్ బాబు క్రియేటివ్ ఆలోచనలకు నిదర్శనాలు.

మరణం[మార్చు]

ఆయన 2005 జనవరి 10 లో మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]