Jump to content

చెన్నుపాటి జగదీశ్

వికీపీడియా నుండి
చెన్నుపాటి జగదీశ్
చెన్నుపాటి జగదీశ్ చిత్రం
జననం
చెన్నుపాటి జగదీశ్
విద్యాసంస్థఆంధ్రా విశ్వవిద్యాలయం
వృత్తిసెమీ కండక్టర్‌ ఆప్టో ఎలక్ర్టానిక్స్‌
నానో టెక్నాలజీ విభాగాలకు అధిపతిగా
ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ ఫాబ్రికేషన్‌ ఫెసిలిటీకి డైరెక్టర్‌
ఉద్యోగంLaureate Fellow and Distinguished Professor
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శాస్త్రవేత్త, రచయిత

యాదృచ్ఛిక పేజీ

చెన్నుపాటి జగదీశ్ కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్ వర్సిటీ (ఏఎన్‌యూ)లో ఫిజిక్స్‌ ప్రొఫెసర్[1].అదే వర్సిటీలో సెమీ కండక్టర్‌ ఆప్టో ఎలక్ర్టానిక్స్‌, నానో టెక్నాలజీ విభాగాలకు అధిపతిగా, ఆసే్ట్రలియన్‌ నేషనల్‌ ఫాబ్రికేషన్‌ ఫెసిలిటీకి డైరెక్టర్‌గానూ ఆయన కొనసాగుతున్నారు.[2][3] ఆయనకు ఆస్ట్రేలియన్ రీసెర్చ్ కౌన్సిల్ నుండి ఫేడరేషన్ ఫెలోషిప్ (2004–2009), లేరేట్ ఫెలోషిప్ (2009–2014) లు లభించాయి.[4] ఆయన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో భౌతిక శాస్త్ర విభాగానికి ఉపాధ్యకులుగానూ, సెక్రటరీ గానూ తన సేవలందించారు.[5]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన కృష్ణా జిల్లా లోని మారుమూల గ్రామం వల్లూరు పాలెం లో జన్మించారు. ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ నాగార్జున వర్సిటీలో గ్రాడ్యుయేషన్, 1977లో ఆంధ్రా వర్సిటీలో ఎమ్మెస్సీ (టెక్నాలజీ) పూర్తి చేశారు. 1977లో నాగార్జున యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పూర్తిచేశారు. 1986లో ఢిల్లీ వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసి, కొన్నాళ్లు కెనడాలో అధ్యాపకునిగా పనిచేశారు. అనంతరం 1990లో ఆస్ట్రేలియాకు వెళ్లి, ఆప్ట్రోఎలక్ట్రానిక్స్‌, నానో టెక్నాలజీ రంగాల్లో పరిశోధన సంస్థను స్థాపించారు[3][6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన తన భార్య విద్యతో కలసి చెన్నుపాటి, విద్య జగదీశ్ ఎండోమెంట్ టు సపోర్ట్ స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్ ఫ్రమ్‌ డెవలపింగ్ కంట్రీస్ ను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ సందర్శించే విద్యార్థులు, పరిశోధకులకు చేయూత అందిస్తారు.[7]

‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు

[మార్చు]

ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా మొత్తం 600 మంది సమాజ సేవకులకు పురస్కారాలు దక్కగా అందులో మన వాళ్లు ముగ్గురు ఉండటం విశేషం. అందులో ఆయనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 2016కు గాను ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాలకు ఎంపిక చేసింది.[1][8][9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "తెలుగు వ్యక్తికి 'ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా' అవార్డు". Sakshi. 28 January 2016. Retrieved 28 January 2016.
  2. "ANFF ACT & WA Nodes - Home".
  3. 3.0 3.1 "చెన్నుపాటి జగదీశ్‌కు ఆస్ట్రేలియా అత్యున్నత పౌరపురస్కారం". andhrajyothy. 28 January 2016. Archived from the original on 29 జనవరి 2016. Retrieved 28 January 2016.
  4. "AUSTRALIAN LAUREATE FELLOWSHIPS ANNOUNCEMENT". Archived from the original on 2015-12-27. Retrieved 2016-01-28.
  5. Australian Academy of Science Annual Report 2013-2014. Canberra: Australian Academy of Science. 2014. p. 11. Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-28.
  6. "IEEE PHOTONICS SOCIETY 2010 Distinguished Service Award Recipient: Chennupati Jagadish". Photonics society. IEEE. 2010. Archived from the original on 2015-12-27. Retrieved 2015-12-31.
  7. "Endowment fund to support scientists from the developing world :: Industry News :: LabOnline". www.labonline.com.au. Retrieved 2015-12-31.
  8. MacDonald, Emma (25 January 2016). "Australia Day Honours 2016: Indian academic Chennupati Jagadish a pioneer in nanotechnology". Brisbane Times. Retrieved 25 January 2016.
  9. Brereton, Adam (26 January 2016). "Neurotechnologist Chennupati Jagadish: 'science is fun for me'". The Guardian. Retrieved 25 January 2016.

ఇతర లింకులు

[మార్చు]