సింధూ లిపి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సింధూ లిపి (లేదా హరప్పా లిపి) అనేది సింధూ లోయ నాగరికత విలసిల్లిన రోజులలో వాడబడిన కొన్ని చిహ్నాల సముదాయం. ఈ లిపి క్రీ.పూ 3500 నుండి క్రీ.పూ 2000 వ వరకు ప్రాచుర్యంలో ఉంది. ఈ చిహ్నాలు ఉన్న శాసనాలు అత్యంత చిన్నవిగా ఉన్నాయి. అసలు ఈ చిహ్నాలు ఒక భాషను రాయడానికి వాడారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. అసలు ఇది ఒక లిపి అనే విషయం కూడా వివాదాస్పదమే. ఎన్నో ఏళ్ళుగా కృషిచేచేస్తున్నా [1] ఈ లిపిని, దాని వెనుక ఉన్న భాషను చేధించలేకపోయారు. ఈ లిపిని వేరే భాషలో అర్థం చేసుకోవడానికి అవసరమైన ద్విభాషా శాసనాలు కూడా ఏమీ అందుబాటులో లేవు. చాలా కాలం పాటు ఈ లిపిలో మార్పులు కూడా రాలేదు.

ఈ చిహ్నాలను 1875 వ సంవత్సరంలో అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ అనే పురాతత్వ శాస్త్రవేత్త మొట్టమొదటి సారిగా ఒక బొమ్మ రూపంలో ప్రచురించాడు. [2] అప్పటి నుండి ఈ చిహ్నాలు ముద్రితమై ఉన్న వస్తువులు 4,000 వరకు దొరికాయి. వీటిలో కొన్ని ఎక్కడో సుదూర ప్రాంతమైన మెసొపొటేమియా లో కూడా దొరికాయి. 1970 వ దశకం ప్రారంభంలో ఐరావతం మహదేవన్ అనే శాస్త్రజ్ఞుడు సుమారు 3,700 ముద్రలకు సంబంధించిన పాఠ్యాన్ని ప్రచురించాడు. అందులో 417 వేర్వేరు గుర్తులు, వివిధ రకాలైన నమూనాలలో అమర్చబడి ఉన్నాయి. ఒక్కో శాసనానికి సగటున ఐదు చిహ్నాలున్నాయి. అత్యంత పొడవైన దానిపై కేవలం 17 చిహ్నాలు మాత్రమే ఉన్నాయి. ఈ లిపి కుడి వైపు నుండి ఎడమ వైపుకు రాయబడుతుందని ఆయనే కనుగొన్నాడు. [3]

చెక్కబడిన ఐదు “అక్షరాలను” సూచిస్తున్న ముద్ర.

మూలాలు[మార్చు]

  1. (Possehl, 1996)
  2. Cunningham, Alexander (1875). "Harappa". Archaeological Survey of India: Report for the Years 1872-3 5: 105–108. 
  3. "Write signs for Indus script?". Nature India. 2009-05-31. Retrieved 2009-06-01. 
"https://te.wikipedia.org/w/index.php?title=సింధూ_లిపి&oldid=1878840" నుండి వెలికితీశారు