ఆచార్య బాలకృష్ణ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆచార్య బాలకృష్ణ | |
---|---|
జననం | నారాయణ్ ప్రసాద్ సుబేది |
పౌరసత్వం | భారతీయుడు[1] |
వృత్తి | పతంజలి ఆయుర్వేద్ కార్యనిర్వాక అధ్యక్షుడు |
నికర విలువ | US$2.5 billion (సెప్టెంబరు 2016)[1] |
తల్లిదండ్రులు |
|
ఆచార్య బాలకృష్ణ (జన్మనామం: నారాయణ్ ప్రసాద్ సుబేది[2]) భారత దేశానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థల కార్యనిర్వాహణాధికారి.[3] యోగ్ సందేశ్ అనే పత్రికకు ముఖ్య సంపాదకుడిగానూ, పతంజలి విద్యాపీఠానికి అధినేతగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
వ్యక్తిగతం
[మార్చు]బాలకృష్ణ అసలు పేరు నారాయణ్ ప్రసాద్ సుబేది. ఆయన నేపాల్ లో పుట్టాడు. భారత్ లో పెరిగాడు. హర్యానా లో ఓ గురుకులం లో చదువుకునేటపుడు బాబా రాందేవ్ తో పరిచయం ఏర్పడింది.
వివాదాలు
[మార్చు]బాలకృష్ణ భారతీయ పౌరసత్వానికి సంబంధించి, తన విద్యార్హతల నేపథ్యంలో అనేక వివాదాల్లో ఎదుర్కొన్నాడు.[4] 2011 లో సీబీఐ అతని మీద ఫోర్జరీ, మోసం అభియోగాలు మోపింది. వారి అభియోగం ప్రకారం ఆయనకు జారీ చేసిన పాస్ పోర్టు నకిలీ హైస్కూల్, గ్రాడ్యుయేషన్ పత్రాల ఆధారంగా ఇచ్చారని, అతను అనుమతి లేకుండా పిస్టల్ ను కలిగి ఉన్నాడని పేర్కొంది.[4] తరువాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కు సంబంధించి ఒక కేసు పెట్టింది,[5] కానీ 2 సంవత్సరాల విచారణ తర్వాత ఆధారలేమీ దొరకకపోవడంతో 2014 లో కేసును మూసేసింది. ఇంకో కేను ఆయన మీద, ఆయనకు నకిలీ ధృవపత్రం ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న ఒక సంస్కృత కళాశాల ప్రింసిపల్ నరేష్ చంద్ర ద్వివేది మీద నమోదు చేశారు.[6] ఈ కేసులన్నీ 2014 లో మూసివేయబడ్డాయి.[1][7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Singh, Kanishka (14 September 2016). "How our craze for Patanjali made Ramdev aide Acharya Balkrishna one of the wealthiest Indians". Indian Express. Retrieved 17 September 2016.
- ↑ 2.0 2.1 "Balkrishna Nepalese identity under lens of Indian CBI".[permanent dead link]
- ↑ "పదేళ్లలో రూ.25వేల కోట్లు!". ఈనాడు. 23 October 2016. Archived from the original on 24 అక్టోబరు 2016. Retrieved 24 అక్టోబరు 2016.
- ↑ 4.0 4.1 Prashant, Shishir (30 July 2011). "The rise and fall of Balkrishna". Business Standard. Retrieved 28 August 2015.
- ↑ "Balkrishna, aide of Baba Ramdev, booked in money laundering case; may be arrested". NDTV. PTI. 22 August 2011. Retrieved 8 September 2015.
- ↑ "Charges framed against Ramdev aide Balkrishna in fake passport case". NDTV. PTI. 31 October 2013. Retrieved 8 September 2015.
- ↑ "ED closes laundering case against Ramdev aide Balkrishna". The Times of India. 30 September 2014. Retrieved 8 September 2015.