Jump to content

గురుకుల విద్యా విధానం

వికీపీడియా నుండి
(గురుకులం నుండి దారిమార్పు చెందింది)
గురుకుల విద్యావిధానంలో బోధన

గురుకుల విద్యా విధానం ఒక ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ. ఈ విధానంలో విద్యార్థులే గురువు ఆశ్రమానికి లేదా నివాసానికి వచ్చి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం.

గురుకులం

[మార్చు]

ఋషి సంప్రదాయాన్ని గురుకులం అని అంటారు. గురుకులాన్ని గురుపీఠం అని కూడా అంటారు. విద్యాపీఠం అని కూడా అనవచ్చు. గురుకులంలోని విద్యారెథులకు విద్యాభ్యాసానికి సుల్కముండదు. (పీజు) గురుకు చేసే సేవ, గురుభక్తినే శుల్కంగా భావించ బడుతుంది. ఈ గురుకులాల్లో ఒకప్పుడు బ్రాహ్మణ, క్షత్రియులకు మాత్రమే ప్రవేశం వుండేది. మహారాజుల ఆశ్రయంతో, వారి రక్షణతో నడుస్తుండేవి. జనావాసాలకు దూరంగా.... నదీ తీరాలలో ప్రశాంత వాతా వరణంలోగురుకులాలుండేవి. అందులో చేరిన విద్యార్థులు ఎంతటివారైనా, మహారాజ కుమారులైనా ఆశ్రమ పద్ధతులకు కట్టుబడి చదువుకొనవలసిందే. అయితే కొందరు బ్రహ్మ చారులు సమీప గ్రామాలలోని శ్రీ మంతుల ఇండ్లలో బిక్షను స్వీకరించి గురుకులానికి సహాయ పడుతూ వుండేవారు. బిక్షాటన చేయడము ఆనాటి గురుకుల విద్యార్థులకు చిన్నతనముగా వుండేది కాదు. బ్రాహ్మణ పిల్లలకు చిన్నతనంలోనే ఉపనయము చేయటములోని మర్మమిదే. ఉపనయము కాకుండా బిక్షను స్వీకరించ కూడదు. ఉపయనము కానివారికి దానం చేయకూడదు. ఇది హైందవ ధర్మం.

[మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు.]

ఐదు నియమాలు

[మార్చు]

గురువు

[మార్చు]

ఈ విధానంలో భగవద్గీతలో చెప్పిన తొమ్మిది నియమాలు పాటించని వాళ్ళు గురువు కానేరరు. అవి

  1. శాంతము (Peacefulness)
  2. ఆత్మ నిగ్రహం (self-control)
  3. క్రమశిక్షణ (austere/disciplined)
  4. స్వచ్ఛత (purity)
  5. ఓర్పు (tolerance)
  6. నిజాయితీ (honesty)
  7. జ్ఞానము (knowledge)
  8. బ్రహ్మ జ్ఞానము (wisdom)
  9. ఆధ్యాత్మికత (religiousness)

ఆధునిక విద్యా విధానంలో విద్యా బోధనకు సొమ్ములు తీసుకుంటున్నట్లుగా గురువులు విద్యార్థుల నుంచి ఎటువంటీ జీతమూ ఆశించరాదు. ఎందుకంటే విద్య, జ్ఞానము మొదలగునవి వినియోగ వస్తువులు కావు. [1]

విద్యార్థి

[మార్చు]

విద్యను ఆర్జించదలచిన వారిని గురువు వ్యక్తిగతంగా పరీక్షించి వాళ్ళు విద్యార్థిగా జ్ఞాన సముపార్జనకు సరియైన వారో కాదో నిర్ణయించాలి. అంటే విద్య అనేది ఒక హక్కులా కాక ప్రతిభావంతులకు ఒక గౌరవంగా భావిస్తారు. ఒక విద్యార్థి తన విద్య పూర్తయ్యేవరకు (సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాల వరకు) సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా తన విద్యను పూర్తి చేస్తాడు.

ok that’s what!,!!!!!

పాఠ్యాంశం

[మార్చు]

ఈ విద్యా విధానంలో బోధించే అన్ని పాఠాలు వైదిక సాహిత్యం నుంచే అయి ఉండాలి. ఎందుకంటే వేదాలలో అన్ని కళలూ, సైన్సుకు సంబంధించిన సమాచారం ఉంది. అది భౌతిక మార్గంలో కావచ్చు లేదా ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాఠ్యాంశాలలో భగవత్తత్వం అంతర్లీనంగా గోచరిస్తుంటుంది.

పాఠశాల

[మార్చు]

విద్యార్థులు తమ శిక్షణాకాలమంతా గురువు (ఆశ్రమం) వద్దనే గడపాల్సి ఉంటుంది. ఎప్పడైనా బయటకు కానీ ఇంటికి వెళ్ళాల్సి వస్తే గురువు అనుమతి తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ప్రతి రోజు దినచర్య వేకువ జామునే (సూర్యోదయానికి ఒక గంట లేదా ఒకటిన్నర గంటలకు ముందు) ఆరంభమౌతుంది.

దేవాలయం

[మార్చు]

అందరు విద్యార్థులు, గురువులు ఉదయం, సాయం సమయాల్లో దేవాలయాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలి. ఈ విధంగా హాజరు కావడం వలన దయ, క్రమశిక్షణ, పరిశుభ్రత, సత్యశీలత మొదలగు లక్షణాలు అలవడతాయి. సామాజిక బాధ్యత అలవడుతుంది. ఈ విధానంలో లౌకిక జీవన విధానానికీ, ఆధ్యాత్మిక జీవన విధానాల్నీ వేరు చేసి చూడలేదు. జీవితాన్నే పాఠంగా, నేర్చుకున్న విద్యనే జీవితంగా అలవరుచుకోవడమే దీనియొక్క ముఖ్యోద్దేశం.

మూలాలు

[మార్చు]
  1. "గురుకుల విద్యా విధానం".[permanent dead link]