బాబా రాందేవ్
బాబా రాందేవ్ | |
---|---|
జననం | రాం కృష్ణ యాదవ్ ఆలీపూర్, మహేంద్రఘర్, హర్యానా |
జాతీయత | భారతీయుడు |
గురువు | ఆచార్య ప్రద్యుమ్న్ |
తత్వం | వసుధైక కుటుంబం |
బాబా రాందేవ్ ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు., సుప్రసిద్ద యోగా గురువు. పతంజలి ఆశ్రమాన్ని స్థాపించి పలు మత, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
వార్తలలో రాందేవ్
[మార్చు]మాతృ భూమిపై ఆపేక్ష చాటడమే యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. భారత్ మాతాకీ జై అని అనని వారి తల నరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేయడం లేదని అన్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదం చేయడమంటే మాతృ భూమిపై ఆపేక్ష చాటడమేనని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని రాందేవ్ బాబా అన్నారు. రాందేవ్ వ్యాఖ్యలు హింసకు పిలుపునివ్వడమేనని కాంగ్రెస్ నేత సంజయ్ ఝా ప్రజలను బెదిరిస్తున్న రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ, భారత్‌మాతాకీ జై అనడం ముస్లిం మతానికి విరుద్ధమని, అందుకే తాము ఆ నినాదం చేయబోమని దేశంలోని అతిపెద్ద ఇస్లాం సంస్థ దారుల్ ఉలూమ్ డియోబంద్ ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్ మాతాకీ జై బదులు.. తాము హిందూస్తాన్ జిందాబాద్ అని నినదిస్తామని ఆ సంస్థ తెలిపిందని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాందేవు బాబాను సమర్ధిస్తూ స్పందించారు. భారత్ మాతాకీ జై అనని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.
పతంజలి ప్రొడక్టులను
[మార్చు]బాబా రాందేవ్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ అవుతున్న పతంజలి ప్రొడక్టులను వాడవద్దని తమిళనాడు తహీద్ జమాత్ (టీఎన్టీజే) ఫత్వా జారీ చేసింది. ఇస్లాంలో ఎంతమాత్రమూ స్థానంలేని గోమూత్రాన్ని వివిధ ఆహార, చర్మ సంరక్షణ, ఆరోగ్య ఉత్పత్తుల్లో వాడుతున్నారని, ఇవి బహిరంగ మార్కెట్లో, ఆన్ లైన్లో లభ్యమవుతున్నాయని టీఎన్టీజే ఓ ప్రకటనలో ఆరోపించింది. "ముస్లింల నమ్మకాల ప్రకారం ఆవు మూత్రం ఎంతమాత్రమూ ఉపయోగించరాదు. అందువల్ల పతంజలి ఉత్పత్తులు కూడా వాడకండి" అని ఆ ఫత్వాలో పేర్కొన్నారు.
డెంగ్యూ వ్యాధికి
[మార్చు]డెంగ్యూతో ఢిల్లీ వణుకుతుంటే దానికంత భయపడాల్సిన పనిలేదని, ఆయుర్వేద మందులతో తగ్గించొచ్చని యోగా గురువు రామ్‌దేవ్ బాబా అభయమిస్తున్నారు. 4 రకాల ఆకుల రసంతో డెంగ్యూ వ్యాధికి ఆయన విరుగుడు కనిపెట్టారు. గిలోయ్, అనార్ అంటే దానిమ్మ, అలోవేరా అంటే కలబంద, పపీతేకా పత్తా అంటే బొప్పాయి ఆకులతో తీసిన జూస్‌ను 50 ఎంఎల్ చొప్పున తీసుకుంటే 4 రోజుల్లో డెంగ్యూ నయమవుతుందని తెలిపారు. డెంగ్యూ చాలా సీరియస్‌గా ఉంటే ప్రతి రెండు గంటలకోసారి ఈ రసాన్ని తీసుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల డెంగ్యూ వ్యాధి తగ్గడమే కాదు..ప్లేట్‌లెట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని కొంతమంది రోగులకు చికిత్స చేసిన తర్వాతే దీన్ని రుజువు చేశామని బాబా తెలిపారు.
లండన్ లో నిర్భధం
[మార్చు]2013 సెప్టెంబరులో యోగా గురు బాబా రాందేవ్ కు ఇంగ్లండ్లో చేదు అనుభవం ఎదురైంది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దాదాపు ఎనిమిది గంటల పాటు నిర్బంధించారు. శనివారం రాందేవ్ ను విడిచిపెట్టినట్టు ఆయన ప్రతినిధి ఎస్.కె.తేజరావాలా తెలిపారు. వేధింపులకు గురైనట్టు 'స్వామీజీ' భావించారని తెలిపారు. కస్టమ్స్ అధికారులు రాందేవ్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్రిటన్కు విజట్ వీసాపై వచ్చారా లేక బిజినెస్ వీసాపైనా అన్న విషయం గురించి ఆరా తీశారు. ఆయన వెంట తీసుకెళ్లిన ఆయుర్వేద మందుల గురించి ప్రశ్నించారు. రాందేవ్ తన వెంట నాలుగు జతల దుస్తులు, కొన్ని మందులు, పుస్తకాలు తీసుకెళ్లారు.
'తనను ఎందుకు నిర్బంధించారని బాబా పలుసార్లు అధికారులను ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడూ నేరం, అనైతిక పనులు చేయలేదని చెప్పారు. ఐతే అధికారులకు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు' అని తేజరావాలా చెప్పారు. 125 కోట్ల భారతీయులందరికీ ఇది అవమానకర సంఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడేళ్లుగా బాబా పలుసార్లు ఇంగ్లండ్ వెళ్లి యోగా తరగతులు నిర్వహించారని తెలిపారు. పతంజలి యోగ పీఠం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ http://www.ndtv.com/article/india/yoga-guru-baba-ramdev-detained-for-six-hours-at-heathrow-airport-421599