ప్రజల మనిషి (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రజల మనిషి (నవల)
Prajala manishi.jpg
"ప్రజల మనిషి (నవల)" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: వట్టికోట ఆళ్వారుస్వామి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: తెలంగాణా సాయుధ పోరాటానికి పూర్వరంగం నేపథ్యం
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 1955
పేజీలు: 154
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): TELVPH0033

ప్రజల మనిషి నవల వట్టికోట ఆళ్వారుస్వామి 1955లో రాశారు.[1] [2] నవలలో వర్ణించిన కాలం 1928-38 దశాబ్ది, ప్రతిబింబించిన ప్రాంతం నిజాం పాలనలోని నిజామాబాద్ జిల్లా. తెలంగాణ తొలి నవలగా వాసికెక్కింది. నిజాం కాలపు తెలంగాణ జీవితాన్ని సమర్థంగా చూపిన నవలగా ఖ్యాతి పొందింది. ఈ నవల ఒక దారి చూపించడం వల్లే దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్లు’ వంటి అద్భుత నవలను రాయగలిగారు.[3]

రచన నేపథ్యం[మార్చు]

వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి నవలను తెలంగాణా సాయుధ పోరాటానికి పూర్వరంగం నేపథ్యంలో రాశారు. తెలంగాణా సాయుధ పోరాటంలో వ్యక్తిగతంగా పాల్గొని, సుదీర్ఘమైన జైలు జీవితాన్ని గడిపిన ఆళ్వారు స్వామి తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం, సాగిన వైనం, తదనంతర పరిణామాలు ప్రతిబింబిస్తూ తెలంగాణా జన జీవితాన్ని నవలల్లో చిత్రీకరిద్దామని ప్రయత్నించారు. ఆ క్రమంలో రాసిన మొదటి నవల ప్రజల మనిషి 1938లో తెలంగాణా ప్రాంతంలో రాజకీయ చైతన్యం పొడడసూపుతున్న కాలం వరకూ సాగుతుంది. ఐతే తర్వాతి నవల గంగు తెలంగాణా సాయుధ పోరాట కాలాన్ని చిత్రీకరించగా, చిన్నవయసులోనే ఆళ్వారుస్వామి మరణించడంతో తన నవలా ప్రణాళిక కూడా ఆగిపోయింది. ఐతే ఈ ప్రణాళికనే స్వీకరించి దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం అన్న నవలలు రాశారు.[3]

శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ నవలను ఆంగ్లంలోనికి అనువదించింది. [4]

ఇతివృత్తం[మార్చు]

నిజామాబాద్ జిల్లాలో దిమ్మెగూడెం ఓ పల్లెటూరు. ఆ ఊరికి దొర రాంభూపాల్ రావు. అతను గ్రామప్రజల ఆస్తులు, శ్రమ వంటివి దోచుకుతింటూంటాడు. దొర నివసించే విశాలమైన, దృఢమైన కోటలాంటి ఇల్లు గడీ. ఇలాంటి నేపథ్యంలో రాంభూపాల్ రావు తన అల్లుణ్ణి బిడ్డతో పంపే సమయంలో వారికి అరణంగా ఆవును తోలించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రైతు కోటయ్య ఆవు మీద కన్నేశాడు. చేసేదేమీ లేక కోటయ్య ఆవునూ, దూడనూ తోలిపెట్టాడు.

ప్రాచుర్యం[మార్చు]

ప్రజల మనిషి నవల తెలంగాణా తొలి నవల అన్న ప్రత్యేకతను స్వంతం చేసుకుంది.[5]

మూలాలు[మార్చు]

  1. వట్టికోట నవలలు - నిర్దిష్ట వాస్తవికత
  2. Dasarathi's cell in fort prison wears forlorn look by P.Ram Mohan, The HIndu, Friday, Sep 17, 2004
  3. 3.0 3.1 ప్రజారాజ్యాన్ని కలగనే ప్రజల మనిషి Sakshi | Updated: December 08, 2013
  4. The HIndu, elugu language course for foreign nationals, June 10, 2008
  5. నెమలికన్ను, మురళి. "ప్రజల మనిషి". nemalikannu.blogspot.in. మూలం నుండి 22 జూలై 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 25 May 2016. Check date values in: |archive-date= (help)

ఇతర లింకులు[మార్చు]