చర్చ:ప్రజల మనిషి (నవల)
కొన్ని వాక్యాల నిర్దుష్టతపై సందేహం
[మార్చు]వెంకటరమణ గారూ తెలంగాణలో దోపిడీకి గురవుతు న్న ప్రజలను చైతన్యపరచడానికి ‘ప్రజల మనిషి’ అన్న నవల రాశారు. తెలంగాణ పోరాటంపై ఈ నవల ప్రభావం ఎనలేనిది. అన్న వాక్యాల నిర్దుష్టతపై నాకు కొన్ని సందేహాలున్నాయి. ఎందుకంటే పుస్తకాన్ని ఆళ్వారు స్వామి 1955లో రాశారు. తెలంగాణా సాయుధ పోరాటం, ఆపైన కమ్యూనిస్టుల సంపూర్ణ విప్లవ పోరాటం వంటివన్నీ ఆపాటికి ముగిసిపోయాయి. నవలలో చిత్రీకరించిన నైజాం పాలన వ్యవస్థ 1955 నాటికి లేదు, ఐతే అదే పాలకులు మరో రూపంలో వచ్చారనీ అనేవాళ్ళున్నా కానీ. కనుక దోపిడీకి గురవుతున్న ప్రజలను చైతన్యపరచడం అన్నది వాస్తవమని నిరూపించడం చాలా కష్టమనీ, దానికి ద్రవిడ ప్రాణాయామం చేయాల్సివుంటుందనీ నా అభిప్రాయం. మూలంగా ఇచ్చిన సాక్షి వ్యాసంలో ఈ వాక్యాలు వ్యాసకర్తకు నవలపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబిస్తున్నాయే కానీ వాస్తవాన్ని కాదేమోననుకుంటున్నాను. ఇక తెలంగాణా పోరాటం అన్న పదమూ చాలా అస్పష్టమైన పదం. ఏ పోరాటం తెలంగాణా సాయుధ పోరాటమా? (1940ల్లో ముగిసిపోయింది), నక్సలైట్ పోరాటమా? (1960లు, 70ల్లో సాగింది), తెలంగాణా రాష్ట్ర సాధన పోరాటమా (1971, 2000 దశకం నుంచి 2014 వరకూ) అన్న స్పష్టత లేదు. ముందే అన్నట్టు అప్పటికే ముగిసిన తెలంగాణా సాయుధ పోరాటంపై ప్రభావం ఇర్రిలవెంట్. ఇక కమ్యూనిస్టు పోరాటాన్ని కానీ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పోరాటాన్ని కానీ ప్రభావితం చేసిందని నిరూపించడం ఓ సాహిత్య పరిశోధనే అవుతుంది కానీ నిర్ధారణ అవసరంలేని వాస్తవం అయితే కాదు. కనుక ఈ వాక్యాలను పరిహరించమని ప్రతిపాదిస్తున్నాను. మూలాలను వినియోగించి అభివృద్ధి చేసిన మీ కృషికి చాలా ధన్యవాదాలూ తెలుపుకుంటున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:58, 24 మే 2016 (UTC)
- పవన్ సంతోష్ గారూ, మూలాలను ఆధారం చేసుకొని ఆ వాక్యాన్ని చేర్చడం జరిగినది. అది సరియైనది కాదనిపిస్తే తొలగించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 06:09, 25 మే 2016 (UTC)