సారస్ (రవాణా విమానం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Saras
NAL Saras taking off
పాత్ర {{{type}}}

NAL సారస్ అనేది నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) రూపొందించిన తేలికపాటి రవాణా విమానం. ఇది, ఈ విభాగంలో భారతదేశంలో తయారైన మొట్టమొదటి బహుళ ప్రయోజన పౌర విమానం.

2016 జనవరిలో ప్రాజెక్టును రద్దైందని వెల్లడైంది. కానీ 2017 ఫిబ్రవరిలో క్ష్దీన్ని పునరుద్ధరించారు.[1] 2019 ఫిబ్రవరిలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ 6,000 crore (US$750 million) బడ్జెట్టును ఆమోదించింది.

అభివృద్ధి

[మార్చు]
ఏరో ఇండియా 2007 కోసం యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సారస్.

1980ల మధ్యకాలంలో, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) భారతదేశ పౌర విమానయాన అవసరాలను అధ్యయనం చేయాలని, ఆచరణీయమైన పౌర విమానయాన పరిశ్రమను స్థాపించే మార్గాలను సిఫార్సు చేయాలని రీసెర్చ్ కౌన్సిల్ సిఫార్సు చేసింది. బహుళార్థక లైట్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LTA - 1993 అక్టోబరులో దీనికి SARAS అని పేరు మార్చారు) అధికారిక సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని NAL నిర్వహించాలని కూడా ఇది సిఫార్సు చేసింది. సాధ్యాసాధ్యాల అధ్యయనం చేసాక (1989 నవంబరు), దేశంలో 9–14 సీట్ల బహుళార్థక తేలికపాటొఇ రవాణా విమానానికి గణనీయమైన డిమాండుందనీ, రాబోయే 10 సంవత్సరాలలో దాదాపు 250–350 విమానాల అవసరం ఉంటుందనీ అంచనా వేసింది. సాధ్యాసాధ్యాల అధ్యయన నివేదికను NAL, 1990 నవంబరులో రీసెర్చ్ కౌన్సిల్‌కు సమర్పించింది. పారిశ్రామిక భాగస్వామి కోసం అన్వేషణను ప్రారంభించింది.

ఈ ప్రాజెక్టు 1991లో రష్యా సహకారంతో ప్రారంభమైంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రష్యన్లు ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. 1998లో పోఖ్రాన్‌లో భారతదేశం జరిపిన అణు పరీక్షల తర్వాత అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఈ ప్రాజెక్టు దాదాపుగా ఆగిపోయింది. 2001 మార్చి నాటికి దాని తొలి పరీక్షా ప్రయాణం చెయ్యాలన్న లక్ష్యంతో సారస్ ప్రాజెక్టును 1999 సెప్టెంబరు 24 న అనుమతి మంజూరు చేసారు. మొదటి సారస్ (PT1) 2004 మే 29న బెంగుళూరులోని HAL విమానాశ్రయంలో తన తొలి ప్రయాణం చేసింది [2]

తొలి డిజైన్లో లక్ష్య పారామితులు ఇలా ఉన్నాయి: గరిష్టంగా 6,100 కిలోల టేకాఫ్ బరువు, గరిష్ఠంగా 1,232 కిలోల మోత సామర్థ్యం, 600 కి.మీ./గం కంటే ఎక్కువ వేగం, ఆరు గంటల ఏకధాటి ప్రయాణం, 12 కి.మీ. గరిష్ట ఎత్తు (క్రూయిజ్ ఎత్తు 10.5 కి.మీ.), సుమారు 600 మీ. టేకాఫ్, ల్యాండింగ్ దూరాలు, గరిష్టంగా 12 మీ/సె ఆరోహణ రేటు, తక్కువ క్యాబిన్ శబ్దం (78 డెసిబెల్), 19 మంది ప్రయాణికులతో 600 కి.మీ. పరిధి, 14 మందితో 1,200 కి.మీ. 8 మందితో 2,000 కి.మీ. ప్రయాణ సామర్థ్యం, 2.5 కి.మీ./కిలో నిర్దిష్ట పరిధి, ₹ 5/కి,మీ. ఖర్చు.

విమానం ఖాళీ బరువు దాదాపు 4,125 కిలోలు. మొదటి నమూనా బరువు సుమారు 5,118 కిలోలు ఉంది. మూడవ నమూనాలో మిశ్రమలోహపు రెక్కలు, తోకను చేర్చడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని భావించారు. సారస్-PT2 ఎయిర్‌ఫ్రేమ్‌ను తేలికపాటి మిశ్రమాలతో నిర్మించి దాని మొత్తం బరువును సుమారు 400 కిలోల వరకు తగ్గించారు. ఇంకా ఇది దాదాపు 900 కిలోల వరకు అధిక బరువు కలిగి ఉంది. ఈ విమానాన్ని రెండు ప్రాట్ & విట్నీ టర్బో-ప్రాప్ ఇంజిన్లు నడుపుతాయి.

సవరించిన సంస్కరణ

[మార్చు]
పషర్ కాన్ఫిగరేషన్‌తో విమాన సమయంలో సారస్.

2013 చివరి నాటికి ప్రాజెక్టు కోసం నిధులు ఆగిపోయినందున, 2016 జనవరి 20 నాటికి నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) సారస్‌పై అన్ని పనులను నిలిపివేసింది. NAL సారస్‌పై పని చేస్తున్న ఇంజనీర్లను అధిక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఇతర ప్రాజెక్టులపై నియమించారు.

విమానం రెండవ నమూనా బరువు, డిజైనులో పేర్కొన్న బరువు 4,125 కిలోల కంటే 500 కిలోలు ఎక్కువగా ఉంది. మూడవ నమూనా ఇంకా ఎగరాల్సి ఉంది. ప్రాజెక్టు కోసం నిధులను పునరుద్ధరించాలని NAL భావిస్తోంది.[3]


2016 అక్టోబరులో, ప్రభుత్వం పునరుద్ధరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రణాళికను దాదాపుగా నిలిపివేసిన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), పునరాలోచనలో పడింది.[4]

2017 ఫిబ్రవరి 14 నాటికి, పునర్నిర్మించబడిన మొదటి నమూనాను భారతీయ వాయుసేనకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ & సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ASTE)కి అప్పగించారు, ఇది కొన్ని తక్కువ వేగపు గ్రౌండ్ రన్‌లను నిర్వహించింది.

అప్‌గ్రేడ్ చేసిన సారస్ 2018 జనవరి 2న బెంగుళూరులో హై స్పీడ్ టాక్సీ ట్రయల్‌ని చేపట్టింది. [5]


సవరించిన నమూనా మొదటిసారిగా 2018 జనవరి 24న HAL విమానాశ్రయం నుండి ఎగిరి, 40 నిమిషాల పాటు ప్రయాణించి 8,500 అ. (2,600 మీ.) కు, 145 kn (269 km/h) వేగాన్నీ చేరుకుంది. మరో 20 పరీక్షా ప్రయాణాలలో వ్యవస్థల పనితీరును అంచనా వేసాక, ఉత్పత్తి చేసే డిజైన్ను నిశ్చయించారు.[6] ఏరో ఇండియా 2019 సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, NAL ఇటీవలే దాని మెరుగైన వెర్షన్‌కు ధృవీకరణ పొందినందున, విమానం ఉత్పత్తికి ₹ 6,000 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడైంది. 0.9 టన్నుల బరువును తగ్గించుకోవడంలో జట్టు విజయం సాధించినందున బరువు ఇక సమస్య కాదు. కొత్త వెర్షన్‌లో మెరుగైన ఏవియానిక్స్‌ను కూడా అమర్చనున్నారు. 2018 ఫిబ్రవరి 21న రెండవ పరీక్షా ప్రయాణం 25 నిమిషాల పాటు సాగింది.[7] సారస్ కోసం స్వదేశీ టర్బోప్రాప్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంలో CSIR డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తో సహకరిస్తుంది.[8] హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దాని కాన్పూర్ ఫెసిలిటీలో సారస్‌ని తయారు చేస్తుంది.[9]

మార్క్ 2

[మార్చు]

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సహకారంతో, NAL కూడా విమానం యొక్క 19-సీటర్ వెర్షన్ సారస్ Mk2 అభివృద్ధిలో నిమగ్నమై ఉంది. దీని అభివృద్ధికి ప్రభుత్వం NAL కి అనుమతి ఇస్తూ, నిధులు విడుదల చేసింది.[10] NAL ప్రీ-ప్రొడక్షన్ స్టాండర్డ్ కోసం ప్రాథమిక పరీక్షను పూర్తి చేసింది. 4 సంవత్సరాలలో సర్టిఫికేషన్ పొందడం, ఆ తరువాత ఒకటిన్నర సంవత్సరంలో మొదటి విమానాన్ని ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 2021–22 లో అదనంగా ₹100 కోట్లు మంజూరు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (DSIR) డిమాండ్ చేసింది. [11] ₹55 కోట్ల ఖరీదు ఉన్న డార్నియర్ 228 కి ప్రతిగా ₹50 కోట్లు ధర ఉండేలా సారస్ Mk2 ను తయారుచెయ్యాలని ఎన్‌ఏఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. తయారీని లాభదాయక చెయ్యడానికి, ప్రభుత్వం 50-60 యూనిట్లను కొనుగోలు చేయాలని NAL కోరుతోంది.[12][13]

2022 మార్చి 27న, NAL వింగ్స్ ఇండియా 2022లో సారస్ Mk2 లోని 16-సీట్ల ఎయిర్ అంబులెన్స్ రకాన్ని ఆవిష్కరించింది. బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్ క్రిటికల్ కేర్ ఎయిర్ ట్రాన్స్‌ఫర్ టీమ్ (ICATT) 2 యూనిట్లను కొనుగోలుపై ఆసక్తి ఉన్నట్లు లేఖ రాసింది.[14]

2022 మే 14 న NAL, సారస్ PT1N నమూనాలో స్థానికంగా అభివృద్ధి చేసిన డిజిటల్ యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ వ్యవస్థపై టాక్సీ పరీక్షలను ప్రారంభించింది, ఇది చిన్న రన్‌వేలపై ల్యాండింగ్ చేయడంలో సహాయపడుతుంది. ఈ వ్యవస్థ పనితీరును తనిఖీ చేయడానికి మొత్తం 15-20 పరీక్షలు జరపాలని తలపెట్టారు. ఇది అత్యాధునిక బ్రేక్-బై-వైర్ ఎలక్ట్రో-హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టం. దీన్ని ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ నియంత్రిస్తుంది. ధ్రువీకరణ తర్వాత, ఈ వ్యవస్థను సారస్ Mk2లో వాడతారు.[15] పారస్ డిఫెన్స్ 2023 మార్చిలో సారస్ MK2 కోసం పూర్తి గ్లాస్ ఏవియానిక్స్ సూట్‌ను సరఫరా చేసింది.[16]

ఆర్డర్లు

[మార్చు]

15 సారస్ విమానాల కొనుగోలు కోసం భారతీయ వాయుసేన, బెంగుళూరులోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్‌తో ఒప్పందం చేసుకుంది. మరో 45 అవసరం పడవచ్చు.[17] "15 సారస్ విమానాలను విక్రయించడానికి IAFతో NAL ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి కాన్పూర్ కర్మాగారం ఈ విమానాలను తయారు చేస్తుంది" అని వెల్లడించారు. ఈ విమానాలను తీరప్రాంత నిఘా కోసమూ, రవాణా రంగంలో యువ క్యాడెట్‌లకు శిక్షణ ఇవ్వడానికీ ఉపయోగిస్తారు.[18]

విమానాల ఉత్పత్తి కోసం 2019 ప్రారంభంలో ₹6,000 కోట్లు విడుదలయ్యాయి. IAF ఇచ్చిన 15 విమానాల ప్రారంభ ఆర్డరు భవిష్యత్తులో 120–140కి పెరిగే అవకాశం ఉంది.

వినియోగదారులు

[మార్చు]
 భారతదేశం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ – 60 ఎయిర్‌క్రాఫ్ట్ (ప్రణాళిక)

  • దశ 1 - 15 విమానాలు
  • దశ 2 - 45 విమానాలు

సంఘటనలు, ప్రమాదాలు

[మార్చు]

2009 మార్చి 6 న, బెంగళూరు సమీపంలో ఫ్లైట్ 49లో ఉన్న రెండవ ప్రోటోటైప్ సారస్ విమానం కూలిపోయి మంటలు చెలరేగడంతో, ఇద్దరు భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు, వింగ్ కమాండర్ ప్రవీణ్ కోటేకొప్ప, వింగ్ కమాండర్ దీపేష్ షాతో పాటు ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్ స్క్వాడ్రన్ లీడర్ ఇళయరాజాలు మరణించారు.[19] పైలట్‌లకు ఇచ్చిన తప్పుడు ఇంజన్ రీలైట్ డ్రిల్‌లు క్రాష్‌కు దోహదపడ్డాయని విచారణ న్యాయస్థానం కనుగొంది.[20]

స్పెసిఫికేషన్‌లు (Saras Mk2)

[మార్చు]

Data from NAL,[21]

సామాన్య లక్షణాలు

  • సిబ్బంది: 3 (Pilot, Co-Pilot, Flight Engineer)
  • సామర్థ్యం: 19 passengers / 1,710 కి.గ్రా. (3,770 పౌ.)
  • పొడవు: 17.3 మీ. (56 అ. 9 అం.)
  • రెక్కలవెడల్పు: 18 మీ. (59 అ. 1 అం.)
  • ఎత్తు: 5.5 మీ. (18 అ. 1 అం.)
  • రెక్కల వైశాల్యం: 30.4 మీ2 (327 sq ft)
  • ఎయిర్‌ఫాయిల్: NASA GA(W)-2 mod.[22]
  • ఖాళీ బరువు: 5,100 కి.గ్రా. (11,244 పౌ.)
  • గరిష్ఠ టేకాఫ్ బరువు: 7,600 కి.గ్రా. (16,755 పౌ.)
  • ఇంధన సామర్థ్యం: 1832 kgమూస:Aircraft specs/engమూస:Aircraft specs/engమూస:Aircraft specs/eng
  • ప్రొపెల్లర్లు: 5-బ్లేళ్ళు MT-Propeller, 2.65 మీ. (8 అ. 8 అం.) diameter constant speed pusher propellers

Performance

  • గరిష్ఠ వేగం: 550 km/h (340 mph, 300 kn) at FL250
  • క్రూయిజ్ వేగం: 485 km/h (301 mph, 262 kn)
  • స్టాల్ వేగం: 145 km/h (90 mph, 78 kn) flaps down, power off at sea level
  • దాటకూడని వేగం: 688 km/h (428 mph, 371 kn)మూస:Aircraft specs/rangeమూస:Aircraft specs/rangeమూస:Aircraft specs/range
  • ఎండ్యురెన్స్: 6 hours * With 45 min reserve
  • సర్వీస్ సీలింగు: 9,100 మీ. (29,900 అ.) maximum certified altitude
  • ఎక్కే రేటు: 10.17 m/s (2,002 ft/min)
  • వింగ్ లోడింగు: 237.4 కి.గ్రా./మీ2 (48.6 పౌ./sq ft)
  • Takeoff distance: 670 మీ. (2,200 అ.)
  • Landing distance: 900 మీ. (3,000 అ.)

ఏవియానిక్స్
Integrated digital avionics system using ARINC 429 data bus interfaces
Full glass cockpit: EFIS-Four PFD/ ND/ MFDs
Comm/Nav suite: VHF-VOR and radio, ADF, DME, ILS
TAWS- Terrain Avoidance Warning System
FMS: Flight Management System
TCAS: Traffic Collision Avoidance System
Auto pilot and Weather Radar

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూస:Aircontent

మూస:Aircontent

  1. Urs, Anil (16 February 2017). "NAL to revive SARAS, two other civil passenger aircraft". The Hindu Business Line (in ఇంగ్లీష్).
  2. NAL news report, with pictures, of the First Saras Test Flight Archived 21 ఆగస్టు 2007 at the Wayback Machine
  3. Waldron, Greg (17 March 2016). "NAL hopeful of funding to revive Saras". Flight Global.
  4. "IAF plans for dedicated satellite on track; Sukhoi to fire BrahMos in 3 months". Mathrubhumi. 4 October 2016.
  5. Hemanth C S (2 January 2018). "NAL's Saras PT1N teaser hints take-off time is near". Bangalore Mirror.
  6. Addison Schonland (25 January 2018). "A "first flight" in India". AirInsight.
  7. "Indigenously-built Saras aircraft successfully completes second test flight". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-02-21. Retrieved 2022-08-19.
  8. Mohan, Vijay (16 January 2020). "CSIR, DRDO to join hands to develop Saras engine". The Tribune (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
  9. CS, Hemanth (28 September 2019). "NAL and HAL prepare to take off with short haul flights". Bangalore Mirror (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
  10. "SARAS completes the second test-flight successfully; Indian Air Force commits to induct 15 aircrafts [sic] initially". PIB. 21 February 2018. Retrieved 12 January 2022.
  11. CS, Hemanth (13 March 2021). "DSIR seeks Rs 100 cr for SARAS to take off". Bangalore Mirror (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
  12. Nair, Sobhana K. (2020-01-05). "National Aerospace Laboratory wants govt. push for Saras Mk2 takeoff". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-08-19.
  13. Tripathi, Neha LM (2021-09-04). "If we don't plan today, we won't be able to produce even a toy plane, says Suresh Prabhu". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
  14. Bommakanti, Ujwal (27 March 2022). "Wings India 2022: NAL's 16-seater air ambulance to have ICU facilities". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-19.
  15. "Bengaluru: NAL initiates taxi trials for evaluation of indigenously developed digital antiskid braking system for SARAS Mk 2". The Indian Express (in ఇంగ్లీష్). 2022-05-14. Retrieved 2022-08-19.
  16. Balachandran, Manu (21 March 2024). "How Paras Defence Is Building Itself To Become India's One Stop Shop For Everything Critical". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2024-03-22.
  17. "IAF to induct 15 indigenously-built Saras aircraft". Deccan Herald (in ఇంగ్లీష్). 2009-06-14. Retrieved 2022-08-19.
  18. Ray, Kalyan (14 September 2011). "Home-spun Saras to train Air Force's trainee pilots". Deccan Herald. DHNS.
  19. "Three IAF pilots die in trainer plane crash". IBNLive. Indo-Asian News Service. 6 March 2009. Archived from the original on 20 February 2015.
  20. Sharma, Ravi (21 July 2009). "Wrong relight drills caused Saras crash". The Hindu. Retrieved 23 November 2010.
  21. "SARAS MK2 brochure" (PDF). CSIR-National Aerospace Laboratories.
  22. Lednicer, David. "The Incomplete Guide to Airfoil Usage". m-selig.ae.illinois.edu. Retrieved 16 April 2019.

మూలాలు

[మార్చు]