మూడవ సోమేశ్వరుడు
మూడవ సోమేశ్వరుడు | |
---|---|
పరిపాలన | 1126–1138 |
పూర్వాధికారి | ఆరవ విక్రమాదిత్య |
ఉత్తరాధికారి | రెండవ జగదేకమల్ల |
మరణం | 1138 |
మూడవ సోమేశ్వరుడు (సా.శ 1126 – 1138) పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన రాజు. ఆరవ విక్రమాదిత్య కుమారుడు, రాజ్య వారసుడు. ఈయన సా.శ 1126 CE, లేదా 1127 లో పశ్చిమ చాళుక్య రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు.
ఈ రాజవంశంలో శివుని నామాల్లో ఒకటైన సోమేశ్వర అని పేరు పెట్టుకున్న మూడవ రాజు ఈయన. శైవమతం, దాని సన్యాస పాండిత్యం కోసం అనేక భూములు మంజూరు చేశాడు.[1][2] భారతీయ ద్వీపకల్పంలోని ఈ మఠాలు వేదాలు, న్యాయ పాఠశాల వంటి హిందూ తత్వాల అధ్యయనానికి కేంద్రాలుగా మారాయి. ఈయన సా.శ. 1138లో మరణించాడు. తర్వాత అతని కుమారుడు జగదేకమల్ల అధికారంలోకి వచ్చాడు.[3]
సోమేశ్వరుడు ప్రముఖ చరిత్రకారుడు, పండితుడు, కవి.[4] రాజనీతి, పాలన, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్యం, వాక్చాతుర్యం, వైద్యం, ఆహారం, వాస్తుశిల్పం, చిత్రకణ, కవిత్వం, నృత్యం, సంగీతం వంటి అంశాలను స్పృశిస్తూ ఆయన సంస్కృతంలో మానసోల్లాస అనే కళా విజ్ఞాన సర్వస్వాన్ని రచించాడు. ఈ రచన 11వ మరియు 12వ శతాబ్దపు భారతదేశంలోని సామాజిక-సాంస్కృతిక విషయాలపై చారిత్రకంగా విలువైన ఆధునిక వనరు.[3][5] అతను సంస్కృతంలో తన తండ్రి ఆరవ విక్రమాదిత్య అసంపూర్ణ జీవిత చరిత్రను విక్రమాంకాభ్యుదయ అని పేరుతో పూర్తి చేశాడు. అతని పాండిత్య కార్యకలాపాలే అతను సర్వజ్ఞ-భూప, భూలోకమాల వంటి బిరుదులను కలిగి ఉన్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Prabhavati C. Reddy 2014, pp. 99–101.
- ↑ "नऊशे वर्षांपूर्वीचा शिलालेख जत तालुक्यात प्रकाशात". Loksatta (in మరాఠీ). 13 February 2021. Retrieved 28 March 2021.
- ↑ 3.0 3.1 3.2 Kincaid & Parasanisa 1918, pp. 32–33.
- ↑ A Textbook of Historiography, 500 B.C. to A.D. 2000 by E. Sreedharan, p.328-329, Orient Blackswan, (2004) ISBN 81-250-2657-6
- ↑ Banerji 1989, p. 238.