Jump to content

పట్‌కాయ్

అక్షాంశ రేఖాంశాలు: 27°0′N 96°0′E / 27.000°N 96.000°E / 27.000; 96.000
వికీపీడియా నుండి
పట్‌కాయ్
పాంగ్సౌ కనుమ నుజ్ండి పట్‌కాయ్ శిఖరాల దృశ్యం
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంమౌంట్ సరమతి[1]
ఎత్తు3,826 మీ. (12,552 అ.)
నిర్దేశాంకాలు27°0′N 96°0′E / 27.000°N 96.000°E / 27.000; 96.000
భౌగోళికం
పట్‌కాయ్ is located in Myanmar
పట్‌కాయ్
పట్‌కాయ్
పట్‌కాయ్ స్థానం
స్థానంభారతదేశం, మయన్మార్

పట్-కాయ్ (Pron:pʌtˌkaɪ) లేదా పట్‌కాయ్ బుమ్ (బర్మీస్‌లో : కుమోన్ తౌంగ్డాన్ ) [2] అనేది భారత-మయన్మార్ సరిహద్దులో, ఈశాన్య భారత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లలోను, మయన్మార్‌లోని ఎగువ బర్మా ప్రాంతంలోనూ విస్తరించి ఉన్న పర్వతాల శ్రేణి. తాయ్-అహోం భాషలో పాట్ అంటే కోయడం, కాయ్ అంటే కోడి అని అర్థం.

భౌగోళికం

[మార్చు]

పట్‌కాయ్ శ్రేణి పర్వతాలు హిమాలయాల వలె కఠినమైనవి కావు. శిఖరాలు చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. శంఖాకార శిఖరాలు, నిటారైన వాలులు, లోతైన లోయలూ ఈ శ్రేణి లక్షణాలు.

పట్‌కాయ్ కింద మూడు పర్వత శ్రేణులు వస్తాయి. పట్‌కాయ్-బుమ్, గారో-ఖాసీ-జైంతియా కొండలు, లుషాయ్ కొండలు. గారో-ఖాసి శ్రేణి మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఈ పర్వతాల గాలివాలు వైపున వార్షిక వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి మౌసిన్‌రామ్, చిరపుంజి ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రదేశాలు,

ఈ శ్రేణి లోని శిఖరాల ఎత్తులలో ఉన్న తేడాల కారణంగా వాతావరణం సమశీతోష్ణం నుండి ఆల్పైన్ వరకు ఉంటుంది.

పాంగ్సౌ కనుమ పట్‌కాయ్ గుండా వెళ్ళేందుకు అత్యంత ముఖ్యమైన మార్గం. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో భారతదేశాన్ని బర్మా రోడ్డు తోను, ఆ తరువాత చైనాకూ అనుసంధానించే వ్యూహాత్మక సరఫరా రహదారిగా లెడో రోడ్డును ఈ కనుమ ద్వారా నిర్మించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో, మిత్రరాజ్యాల దళాలు పట్‌కాయ్ శ్రేణిని ది హంప్‌లో భాగంగా పరిగణించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • అరకాన్ పర్వతాలు
  • ఆగ్నేయాసియా యొక్క అల్ట్రాస్ జాబితా
  • దేహింగ్ పట్‌కాయ్ పండుగ

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పట్‌కాయ్&oldid=4283477" నుండి వెలికితీశారు