Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

పూర్ణమాసీ జాని

వికీపీడియా నుండి
పూర్ణమాసీ జాని
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న పూర్ణమాసి జానీ
జననంపూర్ణమాసి జానీ
1944
ఒడిశా
జాతీయతభారతీయురాలు
ప్రసిద్ధిభక్తి సంగీతం
పురస్కారాలుపద్మశ్రీ (2021)

తాడిసారు బాయి అని కూడా పిలువబడే పూర్ణమాసీ జాని (జననం 1944) ఒడిశా చెందిన కవయిత్రి, సామాజిక కార్యకర్త. ఆమె కుయి, ఒడియా, సంస్కృత భాషలలో 50,000 కి పైగా భక్తి పాటలను స్వరపరిచింది. 2021లో, ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసింది.[1] కుయి భాషలో తాడి అంటే కొండ, సారు అంటే పైన, బాయి అంటే సాధిక. తాడిసారు బాయి అంటే కొండమీది సాధకురాలని అర్ధం. పూర్ణమాసీ తన ఆధ్యాత్మిక శక్తితో స్ఫూర్తి పొంది లక్షకు పైగా భక్తిపాటలను వెలువరించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జానీ 1944లో కంధమల్ జిల్లాలోని ఖజురీపాడ బ్లాక్ పరిధిలోని చారిపాడ గ్రామంలో జన్మించింది.[2] ఈమె తండ్రి పేరు నీల్‌కంఠ్ జానీ, తల్లి రాణీమాత. ఈమె అసలు చదువుకోలేదు. చిన్నవయసులోనే ఈమెకు చారిపాద గ్రామానికి చెందిన ఆరాధనా జానీతో వివాహమైంది. ఈమె ఆరుగురు పిల్లలు పుట్టారు. కానీ ఎవరూ జీవించలేదు. ఈ సంతాన శోకంతో భార్యాభర్తలిద్దరూ ఆధ్యాత్మికతవైపు దృష్టి సారించారు. 1969లో ఒక ముని ఈమెను తాడిసర్ అనే కొండకు తీసుకొని వెళ్ళి ఈమెకు సిద్ధి ఇచ్చాడు. ఆ తర్వాత నుండి పుర్ణిమాసి తాడిసర్ కొండల్లోనే ఉంటూ, తపస్సు చేస్తున్నది.

పాటలు

[మార్చు]

పూర్ణమాసీ పూర్తిగా నిరక్షరాస్యురాలు. అమెకు ఒడియా భాషకూడా సరిగా రాదు. అయితే ఈమె ధ్యానం చేస్తూ పాటలు పాడుతుంది. ఇప్పటి వరకు ఒక లక్షకు పైగా ఆధ్యాత్మిక పాటలను ఈమె పాడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఈమె ఒకసారి పాడిన పాటను మళ్లీ తిరిగి పాడదు.[2] ఇదంతా మొదటి నుండి ఎవరూ రికార్డు చేయలేదు. కానీ 1999 నుండి రికార్డు చేయటం ప్రారంభించారు. ఇప్పటి దాకా రికార్డైన పాటలు ఐదు వేలకు పైగా ఉన్నాయి. డా. సురేంద్రనాథ్ మొహంతీ ఈమె జీవితచరిత్ర, త్తత్వంపై రెండు పుస్తకాలను వ్రాశాడు. సాహితీవేత్త నృసింగానంద మహాపాత్ర కూడా ఈమె జీవితచరిత్ర వ్రాశాడు. ప్రేమానంద మహాపాత్ర ఈమె పాటల సంకలనాన్ని ప్రచురించాడు. దుర్యోధన్ ప్రధాన్ యొక్క పాటల సంకలనం ఇప్పుడు ప్రతి స్థాయిలో ఉన్నది. రేవెన్‌షా విశ్వవిద్యాలయం యొక్క కొందరు విద్యార్ధులు ఈమెపై డాక్టరేటు పరిశోధన కూడా చేశారు.

పురస్కారాలు

[మార్చు]
  • కవిత్వానికి ఒడిశా సాహిత్య అకాడమీ అవార్డు 2006లో [1]
  • 2008లో దక్షిణ ఒడిశా సాహిత్య పురస్కారం [1]
  • 2021లో పద్మశ్రీ [1]

మూలాలు

[మార్చు]
  1. ఇక్కడికి దుముకు: 1.0 1.1 1.2 1.3 Barik, Satyasundar (2021-01-26). "Padma award for tribal mystic from Odisha". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-03-05.
  2. ఇక్కడికి దుముకు: 2.0 2.1 "Padma Awards: Divine poetess Purnamasi Jani from Odisha's Kandhamal never repeats her songs". www.newindianexpress.com. The New Indian Express. Archived from the original on 2 February 2021. Retrieved 2 February 2021.