నార్డిక్ దేశాలు
నార్డిక్ దేశాలు (నార్డిక్ అంటే ఉత్తర భాగం అని అర్థం[1]) అనేవి భౌగోళికంగా ఉత్తర ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతానికి చెందిన దేశాలు. ఇందులో గణతంత్ర రాజ్యాలైన స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, ఇంకా ఫారో దీవులు, గ్రీన్‌లాండ్ లోని స్వతంత్ర ప్రాంతాలు, ఆలండ్ ఉన్నాయి.[2] నార్డిక్ దేశాలు వారి జీవన విధానం, చరిత్ర, మతం, సామాజిక ఆర్థిక నమూనాలో చాలా సారూప్యతలు కలిగి ఉన్నాయి. ఈ దేశాలు చారిత్రకంగా సన్నిహిత రాజకీయ సంఘాలు, ఇతర సంబంధాలు కలిగి ఉన్నారు కానీ ఏకీకృత అస్తిత్వాన్ని ఏర్పరుచుకోలేదు. స్కాండినేవిస్ట్ ఉద్యమం 19వ శతాబ్దంలో డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్‌లను ఒక దేశంగా ఏకం చేయడానికి ప్రయత్నించింది. కానీ నార్వే స్వీడన్ యూనియన్ విచ్ఛిన్నమై నార్వే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడం, 20వ శతాబ్దం ప్రారంభంలో ఫిన్లాండ్ స్వాతంత్ర్యం, 1943 ఐస్‌ల్యాండ్ రాజకీయ ప్రజాభిప్రాయ సేకరణతో ఇది సాధ్యం కాలేదు కానీ వివిధ దేశాలుగా విడిపోయినా ఒకదానికొకటి సహకారం అందించుకోవాలని నిర్ణయించుకున్నాయి. 1962 నుంచి హెల్సింకి ఒప్పందం ఆధారంగా సహకరించుకునేందుకు నార్డిక్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసుకున్నాయి.
నార్డిక్ దేశాలు విద్య, ఆర్థికపరమైన పోటీ, ప్రజా హక్కులు, జీవన ప్రమాణాలు, మానవాభివృద్ధి సూచికలో ముందుంటాయి.[3] ప్రతి దేశం దాని స్వంత ఆర్థిక, సామాజిక నమూనాను కలిగి ఉంటుంది. కొన్నిసార్లు దాని పొరుగు దేశాల నుండి పెద్ద తేడాలు ఉంటాయి. అయినప్పటికీ, వారు ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక నిర్మాణం యొక్క నార్డిక్ నమూనా యొక్క అంశాలను వివిధ స్థాయిలలో సారూప్యతలు ఉంటాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ Leaders (2 February 2013). "The next supermodel". The Economist. ISSN 0013-0613. Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
- ↑ Kronvall, Alf (n.d.). "Facts about the Nordic countries". Nordic Co-operation. The Nordic Council and the Nordic Council of Ministers. Archived from the original on 20 March 2022. Retrieved 22 March 2022.
- ↑ Munch Haagensen, Klaus (2013). Nordic Statistical Yearbook. Nordic Council of Ministers. p. 8. doi:10.6027/Nord2013-001. ISBN 978-92-893-2350-5. Archived from the original on 17 April 2023. Retrieved 15 November 2018.
- ↑ Lane, Kenworthy (3 December 2013). Social Democratic America. New York City: Oxford University Press. p. 138. ISBN 9780199322527. Archived from the original on 17 April 2023. Retrieved 21 October 2020.