వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2019
(వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 12 నుండి దారిమార్పు చెందింది)
2019 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు |
01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26 |
2019 సంవత్సరం లోని వాక్యాలు
01 వ వారం
- ... రాధికా సాంత్వనము ఆంగ్లేయుల పాలనలో నిషేధించబడిన గ్రంథం అనీ!
- ... ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడిగా పేరు గాంచాడనీ!
- ... జీశాట్ -7ఏ భారత వైమానిక దళం కోసం అధునాతన సేవలు అందిస్తుందనీ!
- ... సెంటినలీస్ ప్రపంచంలో అంతరించిపోయే అవకాశం ఉన్న గిరిజన తెగల్లో ఒకటనీ!
- ... జమ్మలమడుగు పిచ్చయ్య బ్యాడ్మింటన్ క్రీడలో అర్జున అవార్డు గెలుచుకున్న తొలి క్రీడాకారుడు అనీ!
02 వ వారం
- ... పాంచరాత్రం అంటే శ్రీ వైష్ణవులు పాటించే ఆగమ శాస్త్రం పేరనీ!
- ... షేర్ షా సూరి ఉత్తర భారతదేశంలో సూరి సామ్రాజ్య స్థాపకుడనీ!
- ... చౌదరి చరణ్ సింగ్ పుట్టిన రోజును జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారనీ!
- ... తొలితరం తెలుగు నటుడు గోవిందరాజు సుబ్బారావు ఐన్ స్టీన్ తో ప్రత్యుత్తరాలు జరిపే వాడనీ!
- ... బొల్లిన మునుస్వామి నాయుడు స్వాతంత్ర్యానికి మునుపు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడనీ!
03 వ వారం
- ... తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన వాడు కస్తూరి శివరావు అనీ!
- ... మేడపాటి వెంకటరెడ్డి యోగవిద్యలో నిష్ణాతుడనీ!
- ... ఖజానా బిల్డింగ్ మ్యూజియం ను కుతుబ్ షాహీల కాలంలో కార్యాలయం గానూ, ఆయుధాగారం గానూ ఉపయోగించేవారనీ!
- ... గ్లోబల్ వార్మింగు కుట్ర సిద్ధాంతం గ్లోబల్ వార్మింగ్ పేరిట జరిగే శాస్త్ర పరిశోధనలను వ్యతిరేకిస్తుందనీ!
04 వ వారం
- ..."పరమాత్మ రమణ" గా సుపరిచితులైన మానవతావాది మలిశెట్టి వెంకటరమణ అనీ!
- ... బ్రిటిష్ వారు రాయలసీమలో అడుగుపెట్టిన తొలి సంవత్సరంలోనే వారి నిరంకుశ పాలనను ఎదిరించినవాడు ముతుకూరి గౌడప్ప అనీ!
- ... శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విధ్వాంసుడు అయ్యగారి శ్యామసుందరం అనీ!
- ... తెలంగాణ లో సామాజిక న్యాయం కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కాసాని నారాయణ అనీ!
- ... నైపుణ్యాభివృద్ధి అంటే పెద్దగా తెలియని రోజుల్లో టెక్నికల్ కాలేజీల్లో కోర్సులు నిర్వహించిన విద్యావేత్త సి. సుబ్బారావు అనీ!
05 వ వారం
- ... స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణుడు ఖాదర్‌వలి మిల్లెట్ మ్యాన్ గా సుప్రసిద్ధులనీ!
- ... విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అయ్యగారి సోమేశ్వరరావు టాప్ గ్రేడు వైణికునిగా ఉండేవారనీ!
- ... నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన పోలీసు చర్యనూ విమర్శిస్తూ గళమెత్తిన దళిత కవి వయ్య రాజారాం అనీ!
- ... కేరళలో లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరసన ఏర్పడిన మానవ గొలుసు వనితా మాథిల్ అనీ!
- ... హితకారిణి కందుకూరి వీరేశలింగం స్థాపించిన సామాజిక సేవా సంస్థ అనీ!
06 వ వారం
- ... ఆర్థికంగా ఘనవిజయం సాధించి సారధి ఫిలిమ్స్ ని నిలబెట్టిన మాయలోకం సినిమా తీసిన దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం జానపద ఫక్కీలో మాయలు, మంత్రాలతో ఆ సినిమా తీసినందుకు సిగ్గుపడేవాడనీ!
- ... 100 పల్లవులను విభిన్న తాళాలలో వాయించే అరుదైన నేర్పున్న వైణికుడు పప్పు సోమేశ్వరరావు అనీ!
- ... ఆఫ్రికాలో అధిక జనసాంద్రత కలిగిన దేశాలలో 4 వ స్థానంలో కాంగో గణతంత్ర రిపబ్లిక్ ఉందనీ!
- ... 1816 ను వేసవి లేని సంవత్సరం అని పిలుస్తారనీ!
- ... సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాల లో అనేక మంది ప్రముఖులు చదువుకున్నారనీ!
07 వ వారం
- ... మహేంద్రలాల్ సర్కార్ భారతదేశానికి సైన్సు పరిచయం చేసిన మొదటి తరం శాస్త్రవేత్త అనీ!(చిత్రంలో)
- ... సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న విశాఖపట్నం ప్రముఖుడు పొన్నాడ సుబ్బారావు అనీ!
- ... ప్రపంచ మహా నాటకకర్తలలో ఒకడిగా పేరొందినవాడు జాన్ మిల్లింగ్టన్ సింజ్ అనీ!
- ... పాలెగాడు పుస్తకం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం గురించి తెలియజేస్తుందనీ!
- ... నేలటూరు రామదాసు అయ్యంగార్ వేదము వెంకటరాయ శాస్త్రి శిష్యులలో అగ్రగణ్యుడనీ!
08 వ వారం
- ...భారతరత్న పురస్కార గ్రహీత భూపేన్ హజారికా ప్రముఖ సంగీతకారుడు, గాయకుడు అనీ!(చిత్రంలో)
- ...పద్మశ్రీ పురస్కార గ్రహీత దేవరపల్లి ప్రకాశ్ రావు టీ అమ్ముకొని జీవనం సాగించే ఓ తెలుగు వ్యక్తి అనీ!
- ... సచార్ కమిటీ 2005 లో భారతదేశంలో ముస్లింల స్థితిగతులపై విచారణకు వేసిన కమిటీ అనీ!
- ... ఆఫ్రికా దేశంలోని మలావి దేశాన్ని ది వాం హార్ట్ ఆఫ్ ఆఫ్రికా అని వ్యవహరిస్తారనీ!
- ... 1933 లో విడుదలైన కింగ్ కాంగ్ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలో మొదటిసారిగా రెండు థియేటర్లలో విడుదలైన చిత్రంగా రికార్డు సృష్టించిందనీ!
09 వ వారం
- ... భారతరత్న పురస్కార గ్రహీత నానాజీ దేశ్‌ముఖ్ భారతదేశానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు అనీ!(చిత్రంలో)
- ... 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగిందనీ!
- ... వయ్యా సామేలు తెలంగాణ సాయుధ పోరాటంలో బాల కొరియర్‌గా పనిచేసాడనీ!
- ... 1920లో లక్డీకాపూల్ ప్రాంతంలో ఈ ఖుస్రో మంజిల్ ను నిర్మించారనీ!
- ... బాబిట్ పురుగు సముద్ర జీవజాలాన్ని వేటాడి తినే జీవి అనీ!
10 వ వారం
- ...చార్మినార్ కు పడమర వైపున గల మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ ఐదు అంతస్తుల్లో నిర్మిచబడినదనీ!(చిత్రంలో)
- ...మణిపూర్ మన్యం వీరుడు హైపూ జడోనాంగ్ సాంప్రదాయలను కాపాడటానికి హెరాకా అనే భక్తి ఉద్యమం ఆరంభించాడానీ!
- ...దేశచరిత్రలో మొట్టమొదటిసారి ట్రాన్స్‌జెండర్ అయిన నర్తకి నటరాజ్ కు పద్మశ్రీ పురస్కారం లభించిందనీ!
- ... పద్మశ్రీ పురస్కార గ్రహీత వల్లభభాయ్ వాసారాంభాయ్ మార్వనీయ 1943లో గుజరాత్ ప్రజలకి క్యారెట్ మనుషులు తినే కాయగూర అని పరిచయం చేసిన వ్యక్తి అనీ!
- ...సిరియస్ నక్షత్రం భూమి మీద నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రమనీ!
11 వ వారం
- ...ఎందరో మహిళలకు ఉపాధి అవకాశాలను అందిస్తూ ఉన్న కొయ్యాన శ్రీవాణి మహిళా కమీషన్ సభ్యురాలు అనీ!(చిత్రంలో)
- ...పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు "రైతునేస్తం ఫౌండేషన్" వ్యవస్థాపకుడు అనీ!
- ... మణిప్రవాళము అనేది రెండు భాషలలో కవితా పంక్తులు సమాంతరంగా నడిచే సాహిత్య శైలి అనీ!
- ... కాళ్ల సత్యనారాయణ ను స్పానిష్ చిత్రకారుడు ఫ్రాన్సిస్కో గోయా తో పోలుస్తారనీ!
- ... తులిప్ పూల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వాడే విడిపూలు జర్బెరా అనీ!
12 వ వారం
- ... ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులలో అంబటి చంటిబాబు ప్రముఖ కార్టూనిష్టు, రచయిత అనీ!(చిత్రంలో)
- ... 1975 లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా విపక్షాలు కలిసి జనతా పార్టీ ఏర్పాటు చేశాయనీ!
- ... చార్లీ చాప్లిన్ తీసిన మూకీ చిత్రం మోడరన్ టైమ్స్ ను సంభాషణలతోనే తీయాలని డైలాగులు రాసుకున్నా చివర్లో మనసు మార్చుకుని మూకీగా తీశాడనీ!
- ... ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజు పట్నాయక్ మొదట్లో సైన్యంలో పనిచేశాడనీ, జమ్ము-కాశ్మీర్ మీద 1947లో దాడి జరిగినప్పుడు శ్రీనగర్‌లో అడుగుపెట్టిన తొలి సైనికుడు అతనేననీ!
- ... భారత ఆహార సంస్థ మొట్ట మొదటి ప్రధాన కార్యాలయం చెన్నై అనీ!
13 వ వారం
- ...గిరీశం పాత్ర కన్యాశుల్కం నాటకంలోనే కాక కొండుభొట్టీయం, గిరీశం లెక్చర్లు వంటి ఇతర సాహిత్య రచనల్లోనూ వస్తుందనీ!
- ...ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ ముచ్చటపడి లండన్ బకింగ్ హాం పాలెస్ తరహాలో తన కోసం కట్టించుకున్న సైఫాబాద్ ప్యాలెస్ లో ఒక్కరోజూ గడపలేదనీ!
- ...కరీంనగర్ పాతబజారులోని గౌరీశంకరాలయం సా.శ.1295-1323 మధ్యకాలంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు నిర్మించినట్టు భావిస్తారనీ!
- ...ప్రపంచంలో అతి పెద్ద సినిమా సెట్ ను అమెరికాలోని శాన్ ఫెర్నాండో లోయలో 500 ఎకరాల విస్తీర్ణంలో ది గుడ్ ఎర్త్ సినిమా కోసం వేశారనీ!
- ... రిమోట్ సెన్సింగ్ ద్వారా భూమిపై వాతావరణం, ఖనిజ సంపద లాంటి వాటి గురించి పరిశోధన చేస్తారనీ!
14 వ వారం
- ... ప్రపంచంలో తొలి పూర్తి నిడివి యానిమేషన్ చలన చిత్రం వాల్ట్ డిస్నీ నిర్మించిన స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ అనీ!
- ... సౌర కుటుంబంలోని ఖగోళ వస్తువులపై పరిశోధించడానికి వాటిపైకి స్పేస్ ప్రోబ్ లను ప్రయోగిస్తారనీ!
- ... పాటూరు రామయ్య పుచ్చలపల్లి సుందరయ్య శిష్యుడనీ!
- ... బాఘజ్ ఫాఖానీ యుద్ధం అమెరికా సైనిక దళాలు కుర్దిష్ సేనలతో కలిసి సిరియాలో జరిపిన దాడి అనీ!
- ... పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం ముంబై బ్యాంకు మోసపూరితంగా ఇచ్చిన 14 వేల కోట్ల ఋణం పూచీకత్తు అనీ!
15 వ వారం
- ... కైకలూరు మండలంలోని కొల్లేటికోట గ్రామం కొల్లేరు సరస్సు మధ్యలో ఒక ద్వీపంలో ఉందనీ, ఇక్కడి పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం దర్శించేందుకు భక్తులు పడవల్లోనూ, కర్రల వంతెనపైనా ప్రయాణించి చేరుకుంటారనీ!
- ...శాన్ ఫ్రాన్సిస్కో సినిమా క్లైమాక్స్ ను ప్రపంచ సినిమా రంగంలో అతి గొప్ప క్లైమాక్స్ గా సినీ చరిత్రకారులు పరిగణిస్తారనీ!
- ... రాజస్థాన్ లోని చాంద్ బవోరి మెట్ల బావి భారతదేశంలోకెల్లా లోతైన దిగుడు బావి అనీ!
- ... రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధి కారక క్రిములను కనుగొన్న 100 ఏళ్ళ తర్వాత నుంచి మార్చి 24 న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారనీ!
- ... హైదరాబాదులోని హోలీ ట్రినిటీ చర్చి 1847లో బ్రిటిష్ సైనికాధికారుల కోసం నిర్మించబడిన చర్చి అనీ!
16 వ వారం
- ... మాలిక్ అంబర్ ఇథియోపియా నుంచి బానిసగా వచ్చి దక్కన్ సామ్రాజ్యంలో సైనిక నాయకుడిగా ఎదిగాడనీ!
- ... సికింద్రాబాద్ క్లబ్ తెలంగాణా రాష్ట్రంలో ఉన్న పురాతనమైన క్లబ్ అనీ!
- ... విలియం స్టాన్లీ మెర్విన్ సాహిత్యంలో అమెరికాలో ఉన్న అన్ని పురస్కారాలు గెలుచుకున్న రచయిత అనీ!
- ... కేరళలోని మీన్ ముట్టి జలపాతాలు వయనాడ్ జిల్లాలో అతిపెద్ద జలపాతాలనీ!
- ... హైదరాబాదులోని పాతబస్తీలో గల దార్-ఉల్-షిఫా యునానీ ఆసుపత్రి నాలుగు శతాబ్దాల క్రితమే ప్రపంచ ప్రసిద్ధి పొందిన ముడు ఆసుపత్రులలో ఒకటిగా పేరు గాంచిందనీ!
17 వ వారం
- ... ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లా, పలివెల గ్రామంలో ఉందనీ!
- ... మద్దాళి ఉషాగాయత్రి కూచిపూడి నాట్యంలో నిష్ణాతురాలనీ!
- ... స్వాతి నక్షత్ర రాశిలో కనిపించే అతిప్రకాశవంతమైన నక్షత్రం అనీ!
- ... అల్యూమినియంను ప్రధానంగా బాక్సైట్ ధాతువు నుండి సంగ్రహిస్తారనీ!
- ... అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం ను ఏప్రిల్ 18 తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారనీ!
18 వ వారం
- ... మలక్ పేటలో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ ప్రభుత్వానికి ప్రతియేటా సుమారు 200 కోట్లకు పైగా పన్నులు చెల్లిస్తుందనీ!
- ... వైకుంఠపురం బ్యారేజ్ కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజికి ఎగువన నిర్మిస్తున్న మరో ఆనకట్ట అనీ!
- ... డవ్ పట్టకం కాంతిని మనకిష్టమొచ్చిన మార్గంలో నియంత్రించడానికి ఉపయోగిస్తారనీ!
19 వ వారం
- ... రాబర్ట్ బాయిల్ ఆధునిక రసాయన శాస్త్రానికి పునాది వేసిన వారిలో ఒకడనీ!
- ... సత్తు పురాతన కాలం నుంచీ వాడుకలో ఉన్న లోహమనీ!
- ... కేరళలో పెరియార్ నది తర్వాత రెండో పెద్ద నది పంపానది అనీ!
- ... హైదరాబాదు లో బేగంపేటలో ఉన్న వికార్ మంజిల్ నిజాం ప్రధానమంత్రి వికారుల్ ఉమ్రా పేరుమీదుగా పిలవబడుతోందనీ!
- ... బాతులాగా కనిపించే గ్రీబ్ పక్షి లో 22 జాతులు ఉన్నాయనీ!
20 వ వారం
- ... అణు సిద్ధాంతం తత్వ శాస్త్ర భావనగా మొదలై తరువాత విజ్ఞాన శాస్త్ర పరిధిలోకి వచ్చిందనీ!
- ... శబరిమల అయ్యప్ప ఆలయంలో కనిపించే పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అని వ్యవహరిస్తారనీ!
- ... నిజాం కాలంలో పైగా ప్యాలెస్ అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంగా ఉపయోగించారనీ!
- ... ప్రపంచంలో అతిచిన్న కోతి అయిన పిగ్మీ మార్మొసెట్ తన తలను 180 డిగ్రీల కోణంలో తిప్పగలదనీ!
- ... 2019లో విడుదలైన మజిలీ సమంత, నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత కలిసి నటించిన మొదటి చిత్రమనీ!
21 వ వారం
- ... డెకార్ట్ 1641లో రాసిన తత్వశాస్త్ర గ్రంథం నేటికీ విశ్వవిద్యాలయాల్లో ప్రామాణిక పాఠ్యపుస్తకంగా వాడుతున్నారనీ!
- ... నల్గొండ పట్టణంలో ఉన్న లతీఫ్ సాహెబ్ దర్గా వెయ్యేళ్ళు చరిత్ర గలిగిదనీ!
- ... తుమ్మల రమాదేవి భారతదేశంలో తొలిసారిగా మహిళల కోసం ప్రారంభించబడిన వనితా ఛానల్ నిర్వాహకురాలు అనీ!
- ... 1872 లో స్థాపించబడిన అలియా బాలుర ఉన్నత పాఠశాల వారసత్వ భవనాల జాబితాలో చేర్చబడిందనీ!
- ... ప్రపంచ జంతుజాలంలో 5% ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ దీవిలో ఉందనీ!
22 వ వారం
- ... అరుణోదయ రామారావు తాను నెలకొల్పిన సంస్థనే ఇంటిపేరుగా చేసుకున్న విప్లవ కళాకారుడనీ!
- ...సాగర సంగమం సినిమా పతాక సన్నివేశాల్లో వచ్చే "వేదం అణువణువున నాదం" పాటకు కాలికి తీవ్రగాయంతో అడుగుతీస్తే అడుగువేయలేని స్థితిలో కమల్ హాసన్ నాట్యంచేశాడనీ!
- ... లోపలి మనిషి భారత మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు ఆత్మకథాత్మక నవల అనీ!
- ... కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ముసలమ్మ మరణము 1900 లో ఆంధ్రభాషాభిరంజని పురస్కారం పొందిన పద్యకావ్యమనీ!
23 వ వారం
- ... బి. సుభాషణ్ రెడ్డి న్యాయమూర్తిగా, మానవ హక్కుల సంఘం ఛైర్మన్ గా, లోకాయుక్త ఛైర్మన్ గా పలురంగాల్లో కృషి చేశాడనీ!
- ... గోదావరి నదిపై నిర్మించిన హేవ్ లాక్ వంతెన 118 ఏళ్ళ చరిత్ర కలిగిన వంతెన అనీ!
- ... మాలతీ మాధవం భవభూతి రచించిన ప్రసిద్ధ సంస్కృత నాటకం అనీ!
- ... ప్రజలకు పాలపై అవగాహన కల్పించడానికి ప్రపంచ పాల దినోత్సవం ఏర్పాటు చేయబడిందనీ!
- ... సంగీత విద్వాంసుడు విశ్వమోహన్ భట్ పండిట్ రవిశంకర్ శిష్యుడనీ!
24 వ వారం
- ... కన్నడ నటుడు యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ అనీ!
- ... తమ్మినేని సీతారాం 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా ఎన్నికయ్యాడనీ!
- ... సరోజినీ పుల్లారెడ్డి హైదరాబాదు నగర తొలి మహిళా మేయర్ అనీ!
25 వ వారం
- ... నల్లపాటి వెంకటరామయ్య ఆంధ్రరాష్ట్రం తొలి శాసనసభ స్పీకరు అనీ!
- ... శిశుపాల వధ అనే ఒకే కావ్యంతో మహాకవిగా పేరుగాంచిన సంస్కృత కవి మాఘ అనీ!
- ... ఉమాశంకర్ జోషి గుజరాతీ సాహిత్యంలో చేసిన కృషికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నాడనీ!
- ... హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న మొజాంజాహి మార్కెట్ 1935 లో స్థాపించబడినదనీ!
- ... భారతీయ నటి, మోడల్ ప్రియా బెనర్జీ 2011 లో మిస్ కెనడా గా ఎంపికైందనీ!
26 వ వారం
- ... కోయంబత్తూరులో "ఓజోన్ యోగా సంస్థను" స్థాపించిన యోగా గురువు వి.నానమ్మల్ అనీ!(చిత్రంలో)
- ...ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి యేటా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహింపబడుతుందనీ!
- ... స్త్రీ పాత్రల కంటే పురుష పాత్రలను అధికంగా ప్రదర్శిస్తున్న తెలంగాణ హరికథా కళాకారిణి పద్మాలయ ఆచార్య అనీ!
27 వ వారం
- భారతదేశంలోని అతి పొడవైన రోడ్డు వంతెన విక్రమ్ శీలా సేతు అనీ!(చిత్రంలో)
- భారతదేశంలోని అతి పొడవైన రైల్వే వంతెన వెంబనాద్ రైల్వే వంతెన అనీ!
28 వ వారం
- ...జాసింగ్ దేవాలయం మరియు జాసింగ్ మసీదులను ఒకే చోట నిర్మించి జాసింగ్ మతసామరస్యాన్ని చాటాడనీ!
- ...118 సంవత్సరాల చరిత్ర కలిగిన హేవ్ లాక్ వంతెనను 1997 లో భారతీయ రైల్వే నిలిపివేసినదనీ!
- * ...25 ఏళ్ల 3 నెలల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్‌సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ప్రతినిధి గొడ్డేటి మాధవి అనీ!
29 వ వారం
- ... బి.వి.పరమేశ్వరరావు మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కోరి మహిళా సంఘాలను ప్రారంభించిన వారిలో మొదటి వాడనీ!
- ... మడోనా ను పాప్ సంగీతానికి రాణిగా వ్యవరిస్తారనీ!
- ... దీపా మాలిక్ ప్రమాదవశాత్తూ చక్రాలకుర్చీకే పరిమితమైనా పారా ఒలంపిక్స్ లో పాల్గొని వెండి పతకం సాధించిందనీ!
- ... జపనీస్ సినిమా సెవెన్ సమురాయ్ 1586 నాటి ఆ దేశ చరిత్ర ఆధారంగా రూపొందించబడినదనీ!
- ... ఓం బిర్లా భారతదేశ 17వ లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికయ్యాడనీ!
30 వ వారం
- ...ప్రభుత్వం తలపెట్టిన జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్థులు చేసిన సుదీర్ఘ ఉద్యమం వేంపెంట ఉద్యమం అనీ!
- ...1947లో భారత్ పాకిస్తాన్ మధ్య పంజాబ్ విభజన జరిగాక పంజాబ్ పునరావాస కార్యక్రమం జరిగిందనీ!
- ...ఒక మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని హత్యచేసిన వైనం తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ రచన ద్వారా ప్రపంచానికి తెలిసిందనీ!
- ...2002 మే నెలలో వచ్చిన తెలంగాణ కవిత్వ సంకలన పుస్తకం పొక్కిలి అనీ!
31 వ వారం
- ...హెపటైటిస్-బి వైరస్ ను కనుగొన్న శాస్త్రవేత్త బారుచ్ శామ్యుల్ బ్లూమ్‌బర్గ్ జన్మదినం నాడు ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం నిర్వహిస్తారనీ!
- ...భారతదేశంలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అనీ!
- ... ఆసియాలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అనీ!
- ...నెల్సన్ మండేలా జయంతిని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గా జరుపుకుంటారనీ!
32 వ వారం
- ... 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా కార్గిల్ విజయ దినోత్సవం జరుపుకుంటారనీ!
- ... భారతదేశంలో వినోద పార్కులను నిర్వహించే అతి పెద్ద సంస్థ వండర్లా వినోద పార్కు అనీ!
- ... వహ్రేహ్వా.కామ్ అనే వెబ్సైట్ వ్యవస్థాపకుడు తుమ్మా సంజయ్ భారతీయ వంటగాడనీ!
33 వ వారం
- ... ప్రపంచంలో మొట్టమొదటిసారి అబ్రహాం లింకనే ఎమోజీని వాడారనీ!
- ...ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటారనీ!
- ... మల్లీశ్వరి సినిమాలోని "ఆకాశ వీధిలో" పాట ఆభేరి రాగంలో వచ్చినదనీ!
- ...ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు నీరు, తాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించినది ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు అనీ!
34 వ వారం
- ...వికీమీడియా ఫౌండేషన్ హోస్ట్ చేసిన సహకారంతో సవరించగల జ్ఞాన భాండారము వికీడేటా అనీ!
- ...అతి పిన్న వయస్కుడైన భారత అమరవీరుడు బాజీ రౌట్ అనీ!
- ...భూదాన్ ఉద్యమంలో తన 14 ఎకరాల స్థలాన్ని పంచిన స్వాతంత్ర్య సమరయోధుడు మహమ్మద్ బాజి అనీ!
- ...ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగులను కాపాడి సంరక్షించాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటారనీ!
35 వ వారం
- ...అనాథగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కలిఖో పుల్అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగారనీ!(చిత్రంలో)
- ...మహిళలు, చిన్నారుల భద్రతకు సి.ఎస్.రంగరాజన్ స్థాపించినది జటాయు సేన అనీ!
- ....పాంచాల పరాభవం నాటకంలో పంజాబ్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం ఇమడ్చబడినదనీ!
- ...నీలగిరి తార్ అనే ఒక అంతరించి పోతున్న జంతువు సంరక్షణ కోసం ముకుర్తి జాతీయ ఉద్యానవనం నిర్మించబడినదనీ!
36 వ వారం
- ... ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా చేతులూ, కాళ్ళూ లేకుండా పుట్టిన నిక్ వుజిసిక్ ప్రేరణ అందించే వక్త అనీ!
- ... భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చిన్న ఉపగ్రహాల ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నదనీ!
- ...బౌద్ధ గ్రంథం, మజ్జిమా నికాయ బుద్ధుడిని కోసల పౌరుడుగా పేర్కొన్నదనీ!
- ... బ్రెజిల్లో 2019 జనవరి నుంచి ఆగస్టు 23 వరకు 75,336 కార్చిచ్చులు రేగాయనీ!
37 వ వారం
- ... చంద్రయాన్ కార్యక్రమం భారతదేశం చేపట్టిన చంద్రుడి పరిశోధన కార్యక్రమమనీ!
- ... ప్లీస్టోసీను భౌగోళిక యుగంలో చాలా కాలం వరకు నివసించిన పురాతన మానవుల జాతి హోమో ఎరెక్టసు అనీ!
- ... 70 సంవత్సరాలుగా గణిత శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్న సంఖ్య కాప్రేకర్ స్థిరాంకం అనీ!
- ...తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనీ!
38 వ వారం
- ...భారతదేశంలో మూడో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం నమ్దఫా జాతీయ ఉద్యానవనం అనీ!
- ...నేటికి లభిస్తున్న మహిళలు రాసిన శతకాల్లో మొట్టమొదటిదైన భావలింగ శతకాన్ని రాసినది దార్ల సుందరీమణి అనీ!
- ... భూస్వామ్య ప్రభువు గురించి "బండి ఎన్క బండి కట్టి" పాట రాసినది బండి యాదగిరి అనీ!
- ... "రైస్ బకెట్ ఛాలెంజ్" సృష్టి కర్త మంజు లత కళానిధి అనీ!
- ...మహాభారత ఇతిహాసంలో పాండవుల నేతృత్వంలోని రాజ్యానికి రాజధాని ఇంద్రప్రస్థం అనీ!
39 వ వారం
- ... సూక్ష్మదర్శినితో బాక్టీరియాను మరింత కనిపించేలా చేసే విధానం "గ్రామ్ స్టెయిన్" సృష్టికర్త హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ అనీ!
- ...ఆంగ్లంలో "ఉమెన్ ఇన్ వాల్మీకి రామాయణం" రాసి తెలుగులోకి కూడా అనువదించిన రచయిత చెళ్ళపిళ్ళ సీతారామమూర్తి అనీ!
- ... తన బాలల కథలలో పర్యాయపదాలనుపయోగించి బాలలకు పదజాలాభివృద్ధి కల్పించిన రచయిత పాలంకి వెంకట రామచంద్రమూర్తి అనీ!
- ... ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి జి. రోహిణి అనీ!
40 వ వారం
- ... 17.60 లక్షలతో కొలను రామిరెడ్డి బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్నాడనీ!
- ...మగధసామ్రాజ్యానికి మూడవ పాలక రాజవంశం శిశునాగ వంశం అనీ!
- ...స్వతంత్ర ఇజ్రాయిల్ ఏర్పాటుకు హైఫా యుద్ధం యుద్ధమే పునాది వేసిందనీ!
- ... అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని సెప్టెంబరు 15న నిర్వహిస్తారనీ!
41 వ వారం
- ... సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి ప్రాణకోటికి ఓజోన్ పొర రక్షిస్తున్నదనీ!
- ...అంతరించి పోతున్న నీలగిరి తార్ అనే జంతువులకు పేరుగాచింది ఎరవికులం జాతీయ ఉద్యానవనం అనీ!
- ...మగధను 138 సంవత్సరాలు పరిపాలించిన రాజవంశం ప్రద్యోత వంశం అనీ!
- ... ఇండో-ఆర్య భాషలను మాట్లాడే ప్రజలు ఒక బిలియను మందికంటే అధికంగా ఉన్నారనీ!
42 వ వారం
- ...పర్యావరణంపై "భవితకోసం శుక్రవారం" పేరుతో గ్రెటా థన్ బర్గ్ పోరాటం చేస్తున్నదనీ!
- ... పాండవులను చంపడానికి లక్క గృహాన్ని నిర్మించినది పురోచనుడు అనీ!
- ...9 వ శతాబ్దం ప్రారంభంలో పాలా సామ్రాజ్యం ఉత్తర భారత ఉపఖండంలో ఆధిపత్య శక్తిగా ఉందనీ!
- ... ఒపెరా పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో ఒక ముఖ్య భాగమనీ!
43 వ వారం
- ... 2000 సంవత్సరాల కిందట అగ్నిపర్వత విస్ఫోటనంలో నాశనమై పోయిన ఇటలీ నగరం, పాంపేలో భారతదేశంలో తయారైన యక్షి విగ్రహం దొరికిందని, దీన్ని పాంపే లక్ష్మి అంటారనీ! (చిత్రంలో)
- ... క్షయ వ్యాధిని నిరోధించటానికి బి. సి. జి టీకా ను ఉపయోగిస్తారనీ!
- ... బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గౌరవ గ్రాడ్యుయేట్ కామిని రాయ్ అనీ!
- ... గుప్తరాజవంశానికి చెందిన మొదటి చక్రవర్తి మొదటి చంద్రగుప్తుడు అనీ!
44 వ వారం
- ... జోసెఫ్ ప్లాటూ కనుగొన్న "ఫెనాకిస్టిస్కోప్" అనే పరికరం చలన భ్రమను సృష్టించి చివరికి "సినిమా" అభివృద్ధికి దారితీసింది.
- ... సాధనద్వారా అష్టమాసిద్ధులను సాధించినవారు సిద్ధులు అనీ!
- ...పూర్వం రాముడు లంకేయులపై నిఘా ఉంచడానికి బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనాన్ని లక్మణుడికి ఇచ్చినట్లు చరిత్ర చెబుతోందనీ!
- ...అక్టోబరు 4 నుండి అక్టోబరు 10 వరకు వారంరోజులపాటు ప్రపంచ అంతరిక్ష వారం నిర్వహించబడుతుందనీ!
45 వ వారం
- ... రాముడు అరణ్యవాస కాలంలో తాగునీటి కోసం లక్ష్మణుడు బ్రహ్మగిరి కొండల్లోకి బాణం వేసి లక్ష్మణ తీర్థ నదిగా తీసుకువచ్చాడనీ!
- ...భారతదేశం లో ఐదవ ఎత్తైన "దుధ్సాగర్ జలపాతం" మోల్లెం జాతీయ ఉద్యానవనంలో ఉన్నదనీ!
- ... భారత్, పాకిస్తాన్ యుద్ధాలలో 1971 యుద్ధాన్ని మినహాయించి మిగిలిన ప్రధాన ఘర్షణలన్నిటికీ కాశ్మీర్ సమస్యే ప్రధాన కారణమనీ!
- ... 2016 లో ఎఎన్ విమానం అదృశ్యం సంఘటనలో 29 మంది మరణించారనీ!
46 వ వారం
- ... మధ్య పరిధి క్రూయిజ్ క్షిపణులలో ఇప్పటికీ టర్బోజెట్ ఇంజన్లను వాడుతున్నారనీ!
- ...కేరళ రాష్ట్రంలో కెల్లా అతిచిన్న జాతీయ ఉద్యానవనం పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం అనీ!
- ... తలైయార్ జలపాతం అంచున ఉన్న వెదురు పొదల్లో కామాక్షి అమ్మవారు జన్మించినట్లు పురాణ కథనమనీ!
- ...మెహర్గఢ్ ప్రస్తుతం సింధు లోయ నాగరికతకు పూర్వగామిగా చూడబడిందనీ!
47 వ వారం
- ...ఇండో-ఆర్యన్ వలస వెళ్లిన 300 సంవత్సరాల తరువాత సరస్వతి నది ఎండిపోయిందని తెలియజేసిన పురాతత్వ శాస్త్రవేత్త బి. బి. లాల్ అనీ!
- ... ఫంగ్పుయి జాతీయ ఉద్యానవనం మిజోరాం యొక్క బ్లూ మౌంటైన్ అని పిలువబడుతుందనీ!
- ... ఆద్యాత్మ రామాయణాన్ని కీర్తనల రూపంలో సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన కవి మునిపల్లె శేషాద్రి సుబ్రహ్మణ్య కవి అనీ!
- ... హోమో సేపియన్స్ సుమారు 350,000 సంవత్సరాల క్రితం నుండి ఉనికిలో ఉన్నట్లు అంచనా వేసారనీ!
- ... చైనాలో మహావరద కనీసం రెండు తరాల పాటు కొనసాగిందనీ!
48 వ వారం
- ... భారతదేశంలో స్వంత నిర్మాణ సంస్థను స్థాపించిన మొదటి మహిళ షీలా శ్రీ ప్రకాష్ అనీ!
- ... క్రెటేషియస్ యుగం నాటి శిలాజాలు దిండోరి ప్లాంట్ శిలాజాల జాతీయ ఉద్యానవనం లో ఉన్నాయనీ!
- ... సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం ఆధారంగా గాలిమేడలు నాటకం రాయబడినదనీ!
- ... దుద్వా జాతీయ ఉద్యానవనాన్ని 1987 లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారనీ!
- ... హరప్పా వద్ద లభించిన స్మశానవాటికకు "ఏరియా హెచ్" అని పేరు పెట్టారనీ!
49 వ వారం
- ...గాలి పీల్చుకునే జెట్ ఇంజిన్ యొక్క ఒక రూపం ర్యామ్జెట్ అనీ!
- ...సింధు లోయ నాగరికత కాలానికి చెందిన పురావస్తు ప్రదేశం బనావలీ అనీ!
- ... ప్రపంచంలోని అతి చిన్న, అత్యాధునిక కెమెరా ఓవీఎం 6948 కెమెరా అనీ!
- ...మొఘలు చక్రవర్తి జహంగీరు పెద్ద కుమారుడు ఖుస్రౌ మిర్జా అనీ!
- ...ప్రపంచంలొనే మొట్టమొదటి పాలిన్ డ్రోమ్ చిత్రం "అవర్ గ్లాస్" నిర్మాత శ్రీను పాండ్రంకి అనీ!
50 వ వారం
- ...నాల్గవ మొఘలు చక్రవర్తి జహంగీరు అల్లుడు హుషాంగు మిర్జా అనీ!
- ... మొఘలు సామ్రాజ్యం స్థాపకుడు బాబరు చక్రవర్తి కుమార్తె గుల్రుఖు బేగం అనీ!
- ...పురాతన భారతదేశంలోని నంద సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి మహాపద్ముడు అనీ!
- ...మానవ పరిణామంలో ఆస్ట్రలోపిథెకస్ జాతులు గణనీయమైన పాత్ర పోషించాయనీ!
- ...అంతరించిపోయిన కోతుల జాతులలో శివాపిథెకస్ ఒకటనీ!
51 వ వారం
- ... ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ ను ఆధునిక మానవులకు ప్రత్యక్ష పూర్వీకుడిగా భావించారనీ!
- ...గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేసే అరుదైన వ్యాధి మిర్రర్ సిండ్రోమ్ అనీ!
- ...అమోఘవర్ష ను "దక్షిణాది అశోక" గా చరిత్రకారులు పేర్కొన్నారనీ!
- ... కావేరి నది వరద ఒడ్డున ఆనకట్ట నిర్మించిన ఘనత కరికాల చోళునిదనీ!
- ... తమిళ సాహిత్యంలోని ఐదు గొప్ప ఇతిహాసాలలో ఒకటైన సిలప్పాధికారం రచయిత ఇళంగో అడిగళు అనీ!
52 వ వారం
- ...నేరం చేసిన తన కుమారుడుకి మరణశిక్ష విధించి అసమాన న్యాయనిర్ణేతగా ఎల్లాళను గుర్తింపబడినాడనీ!
- ... విజయనగరానికి గొప్ప పాలకుడిగా పరిగణించబడే కృష్ణదేవరాయ చక్రవర్తి పెద్దభార్య తిరుమల దేవి అనీ!
- ... నానేఘాటు శిలాశాసనం మొదటి శాతకర్ణి పాలనలో తయారు చేయబడిందని భావిస్తున్నారనీ!
- ... హర్యాంక రాజవంశ స్థాపకుడు బింబిసారుడు అనీ!
- ... సామ్రాజ్య శాసనాలు జారీ చేసిన మౌర్య రాజవంశం చివరి పాలకుడు దశరధమౌర్య అనీ!