సెంటినలీస్
సెంటినలీస్ అండమాన్ నికోబార్ దీవులులోని ఉత్తర సెంటినెల్ ద్వీపవాసులు, ఇది భారతదేశంలో బెంగాల్ బేలోని ఉత్తర సెంటినెల్ ద్వీపంలో నివసిస్తున్న ఒక స్వదేశీ ప్రజలు, వీరు ప్రపంచంలోని అంతరించే అవకాశమున్న గిరిజన సమూహం ప్రజలలో ఒకటిగా పరిగణింపబడుతున్నారు.[1]
గ్రేట్ అండమానీస్, జరావాస్, ఓంగ్, షోంపెన్, నికోబారీస్ తెగల వారితో సహా ఈ సెంటినలీస్ తెగ వారు తరతరాలుగా అక్కడే బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నివాసముంటున్నవారు. వారు బయటి ప్రపంచంతో కలవడమే కాక, బయటి నుంచి తమతో కలవడానికి వచ్చిన వారిని కూడా శత్రువులుగా పరిగణిస్తారు.[2] 1990ల్లో ఒకసారి స్నేహభావంతో వ్యవహరించినా అలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగాయి.
1956 లో భారత ప్రభుత్వం ఉత్తర సెంటినలీస్ దీవిని గిరిజన పరిరక్షక ప్రాంతంగా ప్రకటించి దాని చుట్టూ సుమారు 5.6 కిమీ దూరం వరకు ఎవరూ తిరగకూడదని నిషేధించింది. దీనిని పర్యవేక్షించడానికి సాయుధ బలగాలను కూడా మొహరించింది. ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా నిషిద్ధమే. ఇక్కడ ఉండే ప్రజల బృందం కూడా ఎంతమంది ఉన్నారనే ఖచ్చితమైన సమాచారం లేదు. 35 నుంచి 500 మధ్య దాకా ఉంటుందని ఒక అంచనా.
భౌగోళికం
[మార్చు]బంగాళాఖాతంలోని భారతీయ ద్వీపసమూహం అయిన అండమాన్ దీవులలోని ఉత్తర సెంటినెల్ ద్వీపంలో సెంటినెలీస్ నివసిస్తున్నారు.[a][4][5] ఈ ద్వీపం అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్కు పశ్చిమాన 64 km దూరంలో ఉంది. దీని వైశాల్యం దాదాపు 59.67 కిమీ2 (14,740 ఎకరాలు). ఇంచుమించు చతురస్రాకారంలో ఉంది.[6] సముద్ర తీరం దాదాపు 45 మీ వెడల్పుతో ఉంది. దట్టమైన ఉష్ణమండల సతత హరిత అడవికి దారితీసే సముద్రతీర అటవీ సరిహద్దులో ఉంది. ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉన్న ఈ ద్వీపం చుట్టూ పగడపు దిబ్బలు ఉన్నాయి.
గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "అండమాన్ సెంటినల్: ఆ ఆదివాసీలను బయట ప్రపంచంలోకి తీసుకొచ్చినపుడు ఏమైంది?". BBC News తెలుగు. 1 December 2018.
- ↑ Wire Staff (22 November 2018). "'Adventurist' American Killed by Protected Andaman Tribe on Island Off-Limits to Visitors". The wire. Archived from the original on 22 November 2018. Retrieved 24 November 2018.
- ↑ Pandya 2009, p. 362.
- ↑ Foster, Peter (8 February 2011). "Stone Age tribe kills fishermen who strayed on to island". The Daily Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Archived from the original on 22 November 2018. Retrieved 11 November 2018.
- ↑ Dobson, Jim (21 November 2018). "A Human Zoo on the World's Most Dangerous Island? The Shocking Future of North Sentinel". Forbes (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2018. Retrieved 11 November 2018.
- ↑ "North Sentinel". The Bay of Bengal Pilot. Admiralty. London: United Kingdom Hydrographic Office. 1887. p. 257. OCLC 557988334. Archived from the original on 17 May 2016. Retrieved 5 March 2019.