యడ్లపల్లి వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యడ్లపల్లి వెంకటేశ్వరరావు
జననం
యడ్లపల్లి వెంకటేశ్వరరావు

1968
క్రియాశీల సంవత్సరాలు2005 నుండి ప్రస్తుతం
ఉద్యోగంరైతునేస్తం సంపాదకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రైతునేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు
వెబ్‌సైటుhttp://www.ritunestham.in/

యడ్లపల్లి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాస్త్రవేత్త. అతను రైతునేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు. అతను "రైతునేస్తం వెంకటేశ్వరరావు" గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతాంగానికి సుపరిచితుడు. అతను వ్యవసాయంపై గల అభిరుచితో ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను దిగుబడి చేయడం ఆయన లక్ష్యంగా ఎంచుకున్నాడు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడికి ఆయన చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా 2019 పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు[1].[2]

జీవిత విశేషాలు

[మార్చు]

వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా, వట్టి చెరుకూరు మండలం, కొర్నేపాడులో 1968లో జన్మించాడు. అతను రైతు కుటుంబంలో పుట్టి, వ్యవసాయం చేస్తూ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. రైతునేస్తం ఫౌండేషన్‌ స్థాపించి, 12 ఏళ్లుగా రైతునేస్తం అనే వ్యవసాయ మాసపత్రిక నడుపుతున్నాడు. ఈ క్రమంలో పశునేస్తం, ప్రకృతినేస్తం పత్రికలు ప్రారంభించి రైతులకు చేరువయ్యాడు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా.ఐ. వి. సుబ్బారావు పేరుతో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, వ్యవసాయ విలేకరులను ఏటా రైతునేస్తం పురస్కారాలతో గౌరవిస్తున్నాడు.[3] కొంతకాలంగా రైతునేస్తం ఫౌండేషన్‌ ద్వారా ప్రతి ఆదివారం కొర్నేపాడులో రసాయన రహిత సేద్యం, "మిద్దెతోట", "చిరుధాన్యాల సాగు ఆవశ్యకత", "సేంద్రియ ఉత్పత్తుల అవసరం" తదితర అనేక అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాడు. తెలంగాన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. వీటికి తోడు పలు గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.[4]

రైతునేస్తం

[మార్చు]

రైతులను ప్రోత్సహించేందుకు రైతునేస్తం మాసపత్రిక నిరంతరం కృషి చేస్తోంది. రైతునేస్తం, పశునేస్తం పేరుతో రెండు మాసపత్రికలను ఈ సంస్థ ప్రచురిస్తున్నది.సేంద్రీయ వ్యవసాయ దారులకోసం ప్రకృతినేస్తం పేరుతో మరో వినూత్నమైన మ్యాగజైన్‌ను వెంకటేశ్వరరావుగారు నడుపుతున్నారు.[5] అతను పత్రికలను ప్రచురించడమే కాకుండా డివిడిలు, పుస్తకాల ద్వారా వ్యవసాయ పద్ధతులను అందరికీ అందజేస్తున్నారు. అతను వ్యవసాయం, హార్టీకల్చర్ అంశాలతో కూడిన రైతునేస్తం పత్రికను 2005లో ప్రారంభించాడు. డైరీ. పౌల్ట్రీ, ఫిషరీస్ కు సంబంధించిన అంశాలను ప్రజలకు చేరవేయడానికి పశునేస్తం పత్రికను 2012లో ప్రారంభించాడు. సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతులను తెలియజేయడానికి ప్రకృతినేస్తం పత్రికను 2014లో ప్రారంభించాడు. ఇవి తెలుగు రాష్ట్రాల రైతులకు ఉపయోగపడటమే కాక దేశ విదేశాలలో తెలుగు మాట్లాడే ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. అతను వ్యవసాయ రంగంలోనూతన పద్ధతులు, అభివృద్ధిని అధ్యయనం చేయడానికి యు.ఎస్.ఎ, యు.కె, జర్మనీ, ఇటలీ, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల పర్యటనలు చేసాడు[6]. అతను 2016 ఫిబ్రవరి 28న రైతునేస్తం పౌండేషన్ ను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా రైతులకు నూతన పద్ధతులను తెలియజేయడానికి శిక్షణా తరగతులను నిర్వహిస్తారు. ఈ తరగతులలో రైతులకు "బీజామృతం", "జీవమృతం", "ఘనజీవామృతం", "నీమస్త్రం", "బ్రహ్మాస్త్రం", "అగ్ని అస్త్రం", "గోబనం", "సొంఠిపాల కషాయం" వంటి సేంద్రియ ఎరువులను తయరుచేసే విధానాలను తెలియజేస్తుంటారు.

రైతు నేస్తం చైర్మన్ గా అతను ప్రతీ రైతుల శిక్షణా కార్యక్రమాలలో రైతులకు ప్రేరణా ఉపన్యాసాలు, శిక్షణా సామాగ్రి, కోర్సు కరిక్యులం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. అతను హైదరాబాదు నగరంలో కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్, టెర్రాస్ గార్డెన్ లను తమ ఇండ్లలో ప్రజలు తయారుచేసుకోవడానికి అవగాహనా తరగతులను నిర్వహిస్తుంటాడు. మంచి పర్యావరణం, ఆరోగ్య కరమైన జీవితాన్ని సమాజానికి అందించడానికి హైదరాబాదు, గుంటూరు పట్టణాలలో "రైతునేస్తం-నేచురల్ ప్రొడక్ట్స్ స్టోర్" లను ప్రారంభించాడు. ఇక్కడ సేంద్రియ వ్యవసాయ విధానాలు, సహజ పద్ధతుల ద్వారా పండిస్తున్న కాయగూరలు, తృణధాన్యాలు, ఇతర ఉత్పత్తులను అందిస్తుంటారు.[6]

అతను వ్యవసాయానికి సంబంధించిన అనేక టెలివిజన్ కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. అతను వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ వంటి రంగాల ప్రదర్శనలకు నిరంతర ఆహ్వానితుడుగా ఉన్నాడు.

ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రం

[మార్చు]

ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రాన్ని తన స్వగ్రామం కొర్నెపాడులో స్థాపించాడు.

పురస్కారాలు

[మార్చు]
  • 2017,జూన్-20న హైదరాబాదులో నిర్వహించిన ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలలో, ఇందిరా మెమోరియల్ కృషిసేవా పురస్కారం తో సన్మానించారు.
  • 2019, పద్మశ్రీ పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. "2019 'పద్మ' కుసుమాలు వీరే.. నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మ భూషణ్".
  2. "Padma Awards" (PDF). Padma Awards ,Government of India. Archived from the original (PDF) on 26 జనవరి 2019. Retrieved 25 January 2019.
  3. "RYTHU NESTHAM AWARDS FUNCTION ON 03RD OCTOBER, 2017". Archived from the original on 2018-02-02. Retrieved 2019-01-26.
  4. "రైతునేస్తానికి పట్టం : యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ".[permanent dead link]
  5. ‘సాగు’బాటు లేదు.. ‘గిట్టు’బాటు రాదు[permanent dead link]
  6. 6.0 6.1 "Venkateswara Rao Yadlapalli - Special Guests".[permanent dead link]

బయటి లంకెలు

[మార్చు]