Coordinates: 16°14′41″N 80°23′07″E / 16.244713°N 80.385332°E / 16.244713; 80.385332

కొర్నెపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొర్నెపాడు
—  రెవిన్యూ గ్రామం  —
కొర్నెపాడు is located in Andhra Pradesh
కొర్నెపాడు
కొర్నెపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°14′41″N 80°23′07″E / 16.244713°N 80.385332°E / 16.244713; 80.385332
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం వట్టిచెరుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి షేక్ బీబీ
జనాభా (2011)
 - మొత్తం 10,134
 - పురుషుల సంఖ్య 4,903
 - స్త్రీల సంఖ్య 5,231
 - గృహాల సంఖ్య 2,641
పిన్ కోడ్ 522017
ఎస్.టి.డి కోడ్ 0863

కొర్నెపాడు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రం వట్టిచెరుకూరు నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 8908,పురుషుల సంఖ్య 4492,మహిళలు 4416,నివాసగృహాలు 2159,విస్తీర్ణం 1751 హెక్టారులు,

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2641 ఇళ్లతో, 10134 జనాభాతో 1751 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4903, ఆడవారి సంఖ్య 5231. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2683 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 485. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590310[1].కొర్నెపాడు, గుంటూరు పట్టణం నుంచి 9 కిలోమీటర్లు దూరంలో ఉంది.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

సమీప గ్రామాలు[మార్చు]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.గ్రామంలోని ప్రాధమిక పాఠశాల 1996 లో ఉన్నత పాఠశాలగా అవిర్భవించింది. క్రేన్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి సుబ్బారావు ఈ పాఠశాలలో నూతన భవనాల నిర్మాణానికై 18 లక్షల రూపాయల విరాళం అందజేసారు. దీనికి ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేసింది. ఈ మొత్తంతో గ్రామంలో గ్రంధి సుబ్బారావు, లక్ష్మీనరసమ్మ పేరుమీద 5 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి అయింది.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కొర్నెపాడులో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార,[మార్చు]

కొర్నెపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

10 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేని ఈ గ్రామానికి, 2015,ఆగస్టు-25వ తేదీనుండి, గుంటూరు ఆర్.టి.సి. ఒకటో డిపో, గుంటూరు నుండి కొర్నెపాడుకు, ఒక సిటీ లైనర్ ఎక్స్ ప్రెస్, సిటీ సర్వీసును ప్రారంభించింది. ఈ బస్సు, గుంటూరు ఆర్.టి.సి.బస్సుస్టాండు నుండి నల్లచెరువు, ఏటుకూరు, మూడోమైలు, పుల్లడిగుంట గ్రామాలను కలుపుతూ కొర్నెపాడు గ్రామానికి చేరుకుంటుంది.13వనెంబర్ సిటీబస్ సర్వీస్ pvkనాయుడు కూరగాయల మార్కెట్ సెంటర్ నుండి కొర్నెపాడుకు కలదు. ప్రతి 30నిముషాలు కు ఒక సర్వీస్ ఉండును

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయ

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

  • గ్రంథి సుబ్బారావు: క్రేన్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి సుబ్బారావు ఈ ఊరిలోనే జన్మించాడు.1996 లో ఉన్నత పాఠశాలగా అవిర్భవించిన పాఠశాలకు నూతన భవనాల నిర్మాణానికి 18 లక్షల రూపాయల విరాళం అందజేసారు. దీనికి ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేసింది. ఈ మొత్తంతో గ్రామంలో గ్రంధి సుబ్బారావు, లక్ష్మీనరసమ్మ పేరుమీద నిర్మాణం పూర్తి అయింది.

రైతు నేస్తం ఫౌండర్[మార్చు]

యడ్లపల్లి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాస్త్రవేత్త. అతను రైతునేస్తం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు.

యడ్లపల్లి వెంకటేశ్వరరావు: వెంకటేశ్వరరావు కొర్నెపాడు 1968లో జన్మించాడు. కొర్నెపాడు గ్రామంలోని ఈ కేంద్రం నిర్వాహకులు, రైతు నేస్తం ఫౌండర్/ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావును, 2017, జూన్-20న హైదరాబాదులో నిర్వహించిన ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలలో, ఇందిరా మెమోరియల్ కృషిసేవా పురస్కారంతో సన్మానించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులకు తోడ్పాటు అందించుచున్న తన కృషికి ఈ పురస్కారం లభించిందని వెంకటేశ్వరరావు అన్నారు.

గ్రామ విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామాన్ని, గుంటూరు జిల్లా పరిషత్తు సి.ఇ.ఓ. బి.సుబ్బారావు, అకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడనికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న రాణి అను విద్యార్థిని, పరుగు పందెంలాలో పాల్గొంటుంది.గ్రామంలో తగిన సదుపాయాలు లేకున్నా, ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఈమె, పలు మండల, జోనల్, డివిజన్ స్థాయి పోటీలలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శిస్తుంది. ఈమె పెదనందిపాడు మండలంలోని వరగానిలో నిర్వహించిన క్రీడ పోటీలలో అండర్-14 విభాగంలో 400, 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సంపాదించింది. జిల్లా నుండి రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి ఈమె ఒక్కతే అర్హత సంపాదించడం విశేషం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో షేక్ బీబీ, సర్పంచిగా ఎన్నికైంది

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామస్వామి దేవాలయం[మార్చు]

ఆలయంలో వైకుంఠఏకాదశి సందర్భంగా, పెద్దఎత్తున ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించెదరు.ఇక్కడ శ్రీరామనవమి, దసరా పండగలు బాగా చేస్తారు.

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం[మార్చు]

శ్రీ సీత రామచంద్రుల స్వామి వారి దేవస్థానం

భూమి వినియోగం[మార్చు]

కొర్నెపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 140 హెక్టార్లు
  • బంజరు భూమి: 171 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1438 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1419 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 191 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కొర్నెపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 191 హెక్టార్లు

ప్రధాన వృత్తులు[మార్చు]

కొర్నెపాడు వ్యపసాయధారిత గ్రామం. ఈ ఊరిలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయం చేస్తారు. కొర్నెపాడు ఇప్పడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అన్ని కులాలు వారు ఉన్నారు. అక్షరాస్యత ఇప్పుడే అభివృద్ధి చెందుతుంది.

ఉత్పత్తి[మార్చు]

కొర్నెపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

ప్రత్తి, మిరప

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

నేత వస్త్రాలు, బియ్యం

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.