ముట్లూరు
ముట్లూరు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°9′22″N 80°29′0″E / 16.15611°N 80.48333°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | వట్టిచెరుకూరు |
విస్తీర్ణం | 13.85 కి.మీ2 (5.35 చ. మై) |
జనాభా (2011) | 7,806 |
• జనసాంద్రత | 560/కి.మీ2 (1,500/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,918 |
• స్త్రీలు | 3,888 |
• లింగ నిష్పత్తి | 992 |
• నివాసాలు | 2,266 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 522212 |
2011 జనగణన కోడ్ | 590322 |
ముట్లూరు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన వట్టిచెరుకూరు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2266 ఇళ్లతో, 7806 జనాభాతో 1385 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3918, ఆడవారి సంఖ్య 3888. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1091 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 82. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590322.[1]
సమీప గ్రామాలు
[మార్చు]కారెంపూడిపాడు 2 కి.మీ, కోవెలమూడి 2 కి.మీ, జూపూడి 3 కి.మీ, గోళ్ళముడిపాడు 5 కి.మీ, మాంచాల 6 కి.మీ
గ్రామ చరిత్ర
[మార్చు]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
[మార్చు]తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]పూర్వం ఈ ప్రాంతాన్ని దండకారణ్యం అంటారు.త్రేతాయుగంలోలక్షణస్వామి వెంటరాగా శ్రీరామచంద్రుడు సీతాదేవితో దండకారణ్యంలో వనవాసం చేసినట్లు రామాయణం ద్వారా మనందరకు తెలుసు.ఈ ప్రదేశంనకు వారు వచ్చినప్పుడు సీతాదేవి రజస్వలరాలు కాగా ప్రత్యేకంగా కొలనునొకదానిని త్రవ్యించి స్నానం చేయించినందున ఆ ప్రాంతానికి మొదట రజస్వలాపురం అనే పేరు ఏర్పడినది.కాలక్రమేణా ఆ ప్రాంతాన్ని తరువాత ముట్నూరు అని పిలిచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ముట్లూరుగా పిలువబడుతుంది.గ్రామంలో ఇప్పటికి ఆ కొలనును సీతగుండం చెరువుగా పిలుస్తుంటారు.ఆ చెరువు కట్టపై సీతాదేవి పాదాలు ఆనవాలు ఇప్పటికి ఉన్నట్లుగా తెలుస్తుంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సెయింట్ క్జేవియర్ ఉన్నత పాఠశాలను 1965, జూన్-21వ తేదీనాడు, ఫాదర్ టి.పాపయ్యస్వామిలోని స్థాపించారు. భవనాల నిర్మాణానికి 1966, ఏప్రిల్-15వ తేదీనాడు, అప్పటి అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. ఆ రోజులలో పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు, కాకుమాను మండలం చినలింగాయపాలెం, వట్టిచెరుకూరు ప్రాంతాలలో ఉన్నత పాఠశాలలు లేకపోవడంతో, ఆయా ప్రాంతాలనుండి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకొనేవారు. ఈ పాఠశాలలో ఇప్పటి వరకు 5,000 మంది విద్యార్థులు ఎస్.ఎస్.ఎల్.సి., 10వ తరగతి చదువుకుని బయటకు వెళ్ళినారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు, దేశ, విదేశాలలో వివిధ రంగాలలో రాణించుచున్నారు. ఈ పాఠశాల ఇపుడు స్వర్ణోత్సవాలకు సిద్ధమగుచున్నది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గుంటూరులోను, జూనియర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు చేబ్రోలులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల చేబ్రోలులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]ముట్లూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]ముట్లూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వాణిజ్య బ్యాంకు (సిండికేట్ బ్యాంక్) ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]ముట్లూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 94 హెక్టార్లు
- బంజరు భూమి: 2 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 1287 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 271 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1019 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]ముట్లూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 1019 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]ముట్లూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]పారిశ్రామిక ఉత్పత్తులు
[మార్చు]బియ్యం
గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]వైద్యసదుపాయం
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
[మార్చు]దాసరి నారాయణరావు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు, ఈ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి, తన రాజ్యసభ నిధులనుండి ఐదు లక్షల రూపాయలను మంజూరుచేయడమేగాక, 2006లో ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు.
మల్లేశ్వరీ అంగనవాడీ కేంద్రం
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో నేరెళ్ళ నాగరాజు, సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం.
- శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం:- సహజంగా ఆలయాలు తూర్పు, ఉత్తర ద్వారాలతో నిర్మితమవుతవి. ఈ ఆలయం మాత్రం, పడమర ముఖద్వారంతో ఉండటం విశేషం. స్వామివారు పడమరవైపు తిరిగి ఉంటారు. ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు నిర్మించినాడని చరిత్ర చెబుచున్నది. ఈ ఆలయానికి కార్తీకమాసంలో ఎక్కువమంది భక్తులు దర్శించుకుంటారు. [7]
- శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమి రోజున అమ్మవారి కళ్యాణం జరుపుతారు. [5]
- గ్రామదేవతలు శ్రీ అద్దంకమ్మ, శ్రీ తాళ్ళమ్మ అమ్మవార్ల ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూన్-2వతేదీ మంగళవారం నుండి 3 రోజులపాటు, వార్షిక ఉత్సవ వేడుకలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుఝామునుండి, వేదపండితులు ప్రత్యేక పూజలు చేసారు. ఈ ఆలయంలో అద్దంకమ్మ, తాళ్ళమ్మ అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. 4వ తేదీ గురువారం తెల్లవారుఝామున క్షీరాభిషేకం నిర్వహించారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసారు. మహిళలు ఆలయప్రాంగణంలో పొంగళ్ళువండి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామదేవతల కళ్యాణమండపం యాజమాన్యం సారథ్యంలో, ఈ మూడు రోజులూ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [8]
- ఆర్యసమాజ మందిరం:- ఇక్కడ 2016, మే-6వ తెదీ శుక్రవారంనాడు 23వ వార్షికోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిహోమం నిర్వహించారు. [12]
- శ్రీ బొట్టు పెరంటాళ్ళమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2016, మే-8వ తేదీ ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. [13]
- శ్రీ ఉయ్యూరువారి ఆలయం:- ఈ ఆలయంలో శ్రీ ప్రవలంబికా అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2017, ఫిబ్రవరి-19వతేదీ ఆదివారంనాడు కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. [14]
- శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ముట్లూరు గ్రామంలోని సీతగుండం చెరువుకట్టపై ఉన్న ఈ ఆలయంలో, శ్రీ అభయాంజనేయస్వమివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2017, ఆగస్టు-13వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ చెరువుకట్టపై సీతాదేవి పాదాలు చాలా సంవత్సరాల నుండి ఉంది. ఇక్కడే ఈ ఆలయ నిర్మాణం చేసారు. [16]
గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]ముట్లూరు వ్యవసాయాధారిత గ్రామం. ఇక్కడ మాగాణి సాగు 60%, మెట్ట సాగు 40% ఉంది.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- ముట్లూరి తిరుపతిస్వామి , ప్రఖ్యాత మృదంగ (డోలు) విద్వాంసులు.
- ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న సుప్రియ అను విద్యార్థిని జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైనది. ఈమె 2013 డిసెంబరులో మధ్యప్రదేశ్ లో జరుగు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనబోవుచున్నది. ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న మానస అను విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనది. వీరిద్దరూ అండర్-14 విభాగంలో ఆడి, తమ ప్రతిభను ప్రదర్శించారు.
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామములో ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 1907, మే నెల-28వ తేదీన జన్మించారు. ఈమె 2015, జూన్-6వ తేదీనాడు 108 సంవత్సరాల వయసులో, కాలంచేసారు. చివరి వరకు ఈమె తన పనులు తానే చేసుకునేవారు.
గణాంకాలు
[మార్చు]- 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 8206, పురుషుల సంఖ్య 4095, మహిళలు 4111, నివాస గృహాలు 2235, విస్తీర్ణం 1385 హెక్టారులు
మూలాలు
[మార్చు]- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.