Jump to content

లేమల్లెపాడు

Coordinates: 16°11′41.964″N 80°28′11.676″E / 16.19499000°N 80.46991000°E / 16.19499000; 80.46991000
వికీపీడియా నుండి
లేమల్లెపాడు
పటం
లేమల్లెపాడు is located in ఆంధ్రప్రదేశ్
లేమల్లెపాడు
లేమల్లెపాడు
అక్షాంశ రేఖాంశాలు: 16°11′41.964″N 80°28′11.676″E / 16.19499000°N 80.46991000°E / 16.19499000; 80.46991000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంవట్టిచెరుకూరు
విస్తీర్ణం
3.05 కి.మీ2 (1.18 చ. మై)
జనాభా
 (2011)
1,996
 • జనసాంద్రత650/కి.మీ2 (1,700/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు952
 • స్త్రీలు1,044
 • లింగ నిష్పత్తి1,097
 • నివాసాలు604
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522212
2011 జనగణన కోడ్590320

లేమల్లెపాడు, గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన వట్టిచెరుకూరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 604 ఇళ్లతో, 1996 జనాభాతో 305 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 952, ఆడవారి సంఖ్య 1044. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 330 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 20. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590320.[1] జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]లేత మల్లెల పాడు కాలక్రమంలో లేమల్లేపాడుగా మారిందని పూర్వీకులు చెబుతారు

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

సమీప గ్రామాలు

[మార్చు]

వట్టిచెరుకూరు 3 కి.మీ; చెమళ్లమూడి 4 కి.మీ; కారెంపూడిపాడు 5 కి.మీ; కోవెలమూడి 5 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు వట్టిచెరుకూరులో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గుంటూరులోను, ఇంజనీరింగ్ కళాశాల వింజనంపాడులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల వింజనంపాడులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

Health services

[మార్చు]

It has a sub centre (arogya mandir)run by govt ,provides primary health care .

Nearest phc present in Vatticherukuru(3km) and Chebrolu (5km)

nearest speciality services are present in Guntur(10km)

Water Availability

[మార్చు]

Krishna river water is stored in prakasam barrage, when required water is being released to Guntur region through Guntur channel . This village receives water from sub canal of Guntur channel . Water received is stored in ponds for drinking and utility purpose . Under gram panchayat ,Water from pond is filtered by sand beds and distributed to household through pipelines for utility purpose .Every house hold in this village have water tap and pipe connection by gram panchayat. Water from pond is also filtered by RO plant and sold to people of village at a cost of 5/- per 20lit by gram panchayat

water for agricultural purpose is drawn from sub canal of Guntur channel.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

లేమల్లెపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

లేమల్లెపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 43 హెక్టార్లు
  • బంజరు భూమి: 12 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 248 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 196 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 64 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

లేమల్లెపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 64 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

లేమల్లెపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, ప్రత్తి, మిరప

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బియ్యం

గ్రామ పంచాయతీ

[మార్చు]

Pathuri SivaParvathi is current sarpanch

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  1. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
  2. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్ల దశమి నాడు వైభవంగా నిర్వహించెదరు.
  3. శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూన్-15.16, తేదీలలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు నిర్వహించారు. 15 ఆదివారం నాడు, అన్న సంతర్పణ, వార్షికోత్సవ పూజలు, నిర్వహించారు. 16వ తేదీ సోమవారం నాడు, కుంకుమార్చన పూజలు, పొంగళ్ళు, నివేదన ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు.

ప్రధానవృత్తులు

[మార్చు]

ఈ గ్రామ ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. కృష్ణాకాలువ నుంచి వచ్చే నీరు మంచి నీటిపారుదల సౌకర్యంగా ఉంది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  1. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ వల్లాపురి బుచ్చయ్య, ఈ గ్రామస్థులే. వీరు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుచూ, తమ 90వ ఏట 2013, డిసెంబరు 14న దివంగతులైనారు.
  2. కార్యశీలి కావూరి :- పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన 9 ఎకరాల భూమిని గ్రామాభివృద్ధికోసం వినియోగించిన దానశీలి. మునసబుగా గ్రామప్రజలకు మెరుగైన సేవలు అందించి, వారి ఆదరణతో, 1955 ఏప్రిల్-1న ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికై, తర్వాత గూడా 3 సార్లు ఎకగ్రీవంగా ఎన్నికై గ్రామానికి సేవ చేశారు. తన స్వంత ధనం, గ్రామస్తుల విరాళం కలిపి, పాఠశాల భవనం నిర్మించారు. గ్రామంలో రు. 50 లక్షల విలువైన 16 సెంట్ల స్థలంలో విశాలమైన సహకార సంఘ భవనం నిర్మించారు. తొలిసారిగా వూరికి అంతర్గత రహదారుల సౌకర్యం కలిగించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. పేద యువతుల వివాహాలకు తాళిబొట్లు ఉచితంగా అందించారు. 1973 లో సింగిల్ విండో ఛైర్మనుగా ఎన్నికైనారు. 2 సార్లు సహకార సంఘ అధ్యక్షులిగా పనిచేశారు. సర్పంచి, సొసైటీ పదవీ కాలం ముగిసిన తరువాత కావూరికి ఒక సెంటు భూమి గూడా మిగలలేదు.

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. లేమల్లెపాడు గ్రామానికి చెందిన శ్రీ మాదల నాగేశ్వరరావు, లక్ష్మీసుజాతల తనయుడైన శ్రీ మాదల వెంకటదుర్గాప్రణీత్, బి.టెక్., (ఇ.సి.ఇ.) చదివి, 2014లో భారత ప్రభుత్వ "సివిల్స్" పరీక్షలు వ్రాసినారు. 2014, జూన్-12న విడుదల చేసిన ఈ ఫలితాలలో, ఈయన 476వ ర్యాంకు సాధించారు.
  2. లేమల్లెపాడు గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయుటకై, ప్రవసాంధ్రులు శ్రీ వెలగా జగదీష్, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 2217, పురుషుల సంఖ్య 1069, మహిళలు 1148, నివాస గృహాలు 640, విస్తీర్ణం 305 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.