మజిలీ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మజిలీ
Majili poster.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంశివ నిర్వాణ
రచనశివ నిర్వాణ
నిర్మాతసాహు గారపాటి
హరీష్ పెద్ది
సుశీల్ చౌదరి
నటవర్గంఅక్కినేని నాగచైతన్య,సమంత
ఛాయాగ్రహణంవిష్ణు శర్మ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంగోపీ సుందర్
నేపథ్య సంగీతం:ఎస్.ఎస్. తమన్
విడుదల తేదీలు
నిడివి
154 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
వసూళ్ళు66 crore (US$8.3 million)

మజిలీ 2019లో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య , సమంత అక్కినేని ప్రధాన పాత్రలలో నటించారు. చైతన్య, సమంతా గతంలో ఏం మాయ చేసావె, మనం, ఆటోనగర్ సూర్యాలలో కలిసి పనిచేశారు. ఈ చిత్రం పెళ్లి చేసుకున్న తర్వాత వారి మొట్టమొదటి చిత్రం . ప్రేక్షకుల విమర్శకుల నుండి ఈ చిత్రం సానుకూల ప్రతిస్పందన పొందింది.

తారాగణం[మార్చు]

కథ[మార్చు]

పూర్ణ (నాగచైతన్య) ఐటీఐ చదువుతూ ఎలాగైన రైల్వేస్‌ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఓ గొడవ కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్‌)తో పూర్ణ ప్రేమలో పడతాడు. కానీ పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును తన పేరెంట్స్ పూర్ణకు దూరంగా తీసుకెళ్లిపోతారు. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి తాగుబోతులా తయారవుతాడు.ఆ సమయంలో కుటుంబ పరిస్థితుల కారణంగా పూర్ణ. శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తండ్రి కోసం పెళ్లి చేసుకున్నా. ఏ రోజూ శ్రావణిని భార్యగా దగ్గరికి తీసుకోడు. శ్రావణి మాత్రం తన భర్త ఏ రోజుకైనా మారతాడన్న నమ్మకంతో ఉంటుంది. చివరకు పూర్ణ, శ్రావణికి ఎలా దగ్గరయ్యారు పూర్ణలో మార్పుకు కారణం ఏంటి అన్నదే మిగతా కథ.[1][2]

మూలాలు[మార్చు]

  1. "'మజిలీ' మూవీ రివ్యూ". Sakshi. 2019-04-05. Retrieved 2020-02-15.
  2. A, Rajababu (2019-04-05). "మజిలీ సినిమా రివ్యూ అండ్ రేటింగ్". telugu.filmibeat.com. Archived from the original on 2020-02-15. Retrieved 2020-02-15.