మహేంద్రలాల్ సర్కార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేంద్రలాల్ సర్కార్
జననంనవంబరు 2 1833
పాయక్పార గ్రామం, హౌరా జిల్లా
మరణంఫిబ్రవరి 23 1904
వృత్తివైద్యుడు,శాస్త్రవేత్త
జీవిత భాగస్వామిరాజకుమారి

మహేంద్రలాల్ సర్కార్ బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. భారతదేశంలో శాస్త్రీయ పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో సైన్సు గురించి విశేష ప్రచారం కల్పించాడు[1].[2]

బాల్యం[మార్చు]

మహేంద్రలాల్ సర్కార్ హౌరా పరిసర ప్రాంతమైన పాయక్పర అనే కుగ్రామంలో 1833 నవంబర 2వ తేదీన జన్మించాడు. ఇతని తల్లిదండ్రులను గూర్చి వివరాలు లేవుఆ ఆయన కుటుంబం వ్యవసాయ ప్రధానమైన కుటుంబం. తండ్రి ఐదేళ్ళకే మరణించగా తల్లి తొమ్మిదేళ్ళ వయసులో చనిపోయింది. తండ్రి చనిపోయిన తరువాత ఆమె కొడుకుతో సహా కలకత్తాలో గల సోదరుని ఇంటికి వచ్చి నివసించింది.[3]

విద్యాభ్యాసం[మార్చు]

మహేంద్రుడు ముందుగా వంగభాషలో చదువుటకు వీధి బడికి వెళ్ళాడు. అక్కడ పాఠాలు తొందరగా వంటపట్టించుకోవడంతో అతని సహచరులు అతనికి ఆంగ్ల విద్య నేర్పించడం అవసరమనిపించి అందుకు తగిన సహాయం చేశారు. బాబూ తారక నాధుడి దగ్గర ఆయన ఆంగ్లవిద్యనభ్యసించాడు. ఆయన సాహచర్యంలో ఒక సంవత్సరం పాటు మరెన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఆంగ్ల భాషనభ్యసించిన తదుపరి ఆయన "హార్ స్కూల్"లో 1840 లో ఉచిత విద్యకోసం అడ్మిషన్ పొందాడు. 1849 లో ఆయన జూనియర్ స్కాలర్‌షిప్ పరీక్షను పాసై కోల్‌కతా లోని హిందూ కళాశాలలో చేరి 1854 వరకు చదివాడు. ఆ కాలంలో హిందూ కళాశాలలో విజ్ఞానశాస్త్ర అభ్యసననానికి సరైన వసతులు లేవు. ఆయన వైద్యవిద్యనభ్యసించుటకు కలకత్తా మెడికల్ కళాశాలకు బదిలీ అయినాడు. కలకత్తా మెడికల్ కళాశాలలొ ఆయన ఆ కళాశాల ప్రొఫెసర్లచే కొనియాడబడ్డారు. రెండవసంవత్సరం చదువుతున్నప్పుదు "దృశాశాస్త్రం" పై ఫెలో విద్యార్థులకు ఉపన్యాసం యిచ్చుటకు ఆయనకు అవకాశం వచ్చింది. దీనిని ఆయన గౌరవప్రదంగా వినియోగించుకొన్నాడు. ఆ కళాశాలలో ప్రతిభావంతమైన విద్యార్థిగా కొనియాడబడి అనేక స్కాలర్‌షిప్ లు పొందాడు. 1860 లో ఆయన చివరి సంవత్సర పరీక్షలను ఉత్తీర్ణుడై వైద్యం, సర్జరీ అంరియు మిడ్‌వైఫరీ రంగాలలో అత్యంత గౌరవ స్థానాన్నిపొందాడు. 1863 లో ఆయన ఎం.డి డిగ్రీని పొందడం ప్రత్యేక విజయంగా చెప్పుకోవచ్చు.[4] 1962 లో ఆయన, జగబంధు బోస్ అనేవారు కలకత్తా విశ్వవిద్యాలయంలో "చంద్రకుమార్ డే" తర్వాత ఎం.డి చేసిన ద్వితీయ వ్యక్తులు. [1][5][6]

అప్పటికి అతని మేనమామ సంసారం అంత బాగా లేకపోవడం వల్లను, ఉద్యోగరీత్యా కలకత్తా వదిలి గ్రామాంతరము వెళ్ళవలసి వచ్చింది.[7]

కెరీర్[మార్చు]

యూరోపియన్ వైద్యవిధానంలో ఆయన విద్యాభ్యాసం చేసినప్పటికీ ఆయన్ "హోమియోథెరపీ" పై దృష్టి సారించారు. ఆయన "విలియం మోర్గాన్" వ్రాసిన "ది ఫిలాసఫీ ఆఫ్ హోమియోథెరపీ" అనే గ్రంథం పట్ల ప్రభావితుడై "రాజేంద్రలాల్ దత్" సహకారంతో ఆయన కలకత్తాలో హోమియోపతి వైద్యునిగా ప్రసిద్ధి చెందారు. "బ్రిటిష్ మెడికల్ అసోషియేషన్" యొక్క బెంగాల్ శాఖలో జరిగిన సమావేశంలో "పశ్చిమ వైద్యవిధానం" కన్నా హోమియో థెరపీ ఉన్నతమైనదని తెలిపారు. అదే విధంగా ఆయన బ్రిటిష్ వైద్యులచే బహిష్కరింపబడ్డాడు.ఈ కారణంగా ఆయన వైద్య ప్రాక్టీసులో నష్టం పొందవలసివచ్చింది.[8] కొంతకాలానికి ఆయన మెడికల్ ప్రాక్టీసు వృద్ధి చెందినది వెంటనే ఆయన కలకత్తా లోని హోమియో వైద్యునిగా ఉన్నత స్థానాన్ని పొందాడు. భారత దేశంలో మంచి వైద్యునిగా కొనియాడబడ్డాడు.[1]

ఆయన కెరీర్ లో ఆయన ప్రఖ్యాత వ్యక్తులైన "బంకించంద్ర ఛటోపాధ్యాయ" ,తపస్వి "రామకృష్ణ" , త్రిపుర మహరాజ వంటి వారికి వైద్యసహాయం అందించాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Palit, Chittabrata. "Sircir, Mahendralal". Banglapedia. Asiatic Society of Bangladesh. Retrieved 2008-04-21.
  2. మనశాస్త్రజ్ఞులు ఆదర్శ జీవితాలు - శ్రీ దివాకర్ల రామ్మూర్తి
  3. మనశాస్త్రజ్ఞులు ఆదర్శ జీవితాలు - శ్రీ దివాకర్ల రామ్మూర్తి
  4. http://www.vivekananda.net/PDFBooks/BengalCelebs/DrSircar.html
  5. Sastri, Sivanath, Ramtanu Lahiri O Tatkalin Banga Samaj, 1903/2001, మూస:Bn icon, pp. 170-176, New Age Publishers Pvt. Ltd.
  6. Sengupta, Subodh Chandra and Bose, Anjali (editors), 1998 edition, Sansad Bangali Charitabhidhan (Biographical dictionary) Vol I, మూస:Bn icon, p. 408, ISBN 81-85626-65-0
  7. మనశాస్త్రజ్ఞులు ఆదర్శ జీవితాలు - శ్రీ దివాకర్ల రామ్మూర్తి
  8. Das, Eswara (2005). "India". History & Status of Homoeopathy Around the World. B. Jain Publishers. pp. 103–107. ISBN 81-8056-573-4.

ఇతర లింకులు[మార్చు]