హైదరాబాద్ రేస్ క్లబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్ రేస్ క్లబ్
Grand Stand Malakpet 1880.jpg
హైదరాబాద్ రేస్ క్లబ్ (1880)
స్థానంమలక్‌పేట, హైదరాబాదు, తెలంగాణ
అక్షాంశ రేఖాంశాలు17°23′13″N 78°29′30″W / 17.38694°N 78.49167°W / 17.38694; -78.49167Coordinates: 17°23′13″N 78°29′30″W / 17.38694°N 78.49167°W / 17.38694; -78.49167
యజమానిహైదరాబాద్ రేస్ క్లబ్
ప్రారంభం1868
కోర్స్ రకంచదునైన
ప్రముఖ రేస్‌లుదక్కన్ డెర్బీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ కప్, నిజాం గోల్డ్ కప్
Official website
హైదరాబాద్ రేస్ క్లబ్ (1880)

హైదరాబాద్ రేస్ క్లబ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేటలో ఉన్న రేస్ క్లబ్.[1][2] 1868లో 135 ఏకరాల్లో ఈ రేస్ క్లబ్ ఏర్పాటుచేయబడింది.[3]

చరిత్ర[మార్చు]

1868లో హైదరాబాదులోని మౌలాలీ వద్ద గుర్రాల రేసింగ్ ను నిజాం ప్రభువు మహబూబ్ అలీ ఖాన్ ప్రారంభించాడు. కొంతకాలం డెక్కన్ రేసులుగా పిలువబడి ఆ తరువాత హైదరాబాద్ రేసులుగా పిలువబడ్డాయి. తన ప్యాలెస్ సమీపంలో ఉండాలన్న ఉద్దేశ్యంతో 1886 నుండి రేసులకు మలక్‌పేటలో నిర్వహించాడు. 1961లో సికింద్రాబాదు తన కార్యకలాపాలను ప్రారంభించింది.[4] హైదరాబాద్ రేస్ క్లబ్ పునరుద్ధరించిన తరువాత 1968లో మలక్‌పేటకు మారింది. 2,250 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు ఉంది.[5]

ఇతర రేసులు[మార్చు]

దక్కన్ డెర్బీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ కప్, నిజాం గోల్డ్ కప్, ఫిల్లీస్ చాంపియన్ షిప్, కోల్ట్స్ చాంపియన్ షిప్ వంటి ఇతర రేసులు కూడా ఇక్కడ నిర్వహించబడుతాయి. జూలై నుండి అక్టోబరు వరకు వర్షాకాల రేసులు మరియు నవంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాల రేసులు జరుగుతాయి.

ప్రత్యేకతలు[మార్చు]

 1. గుర్రాలు పరిగెత్తే ట్రాకులు వివిధ కాలాలకు అనుగుణంగా వేరువేరుగా ఉన్నాయి.
 2. ప్రస్తుతం ఈ క్లబులో 500మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. అనేకమంది వెయటింగ్ లిస్టులో ఉన్నారు.
 3. దీనికి ఎనమిది మంది డైరెక్టర్లు, నలుగురు ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఉన్నారు.
 4. ప్రతి సంవత్సరం దాదాపు 200కోట్లకు పైగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది.
 5. 25మంది లైసెన్స్ ఉన్న జాకీలు ఈ క్లబులో ఉన్నారు.[6]

మూలాలు[మార్చు]

 1. http://www.financialexpress.com/news/a-social-do/126061/0
 2. http://ibnlive.in.com/generalnewsfeed/news/hyderabad-gears-up-for-monsoon-derby-event/762829.html
 3. హైదరాబాద్ రేస్ క్లబ్,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 134
 4. The Hindu, Sport-Races (13 September 2011). "HRC to celebrate golden jubilee". Retrieved 17 April 2019. Cite news requires |newspaper= (help)
 5. హైదరాబాద్ రేస్ క్లబ్,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 136
 6. హైదరాబాద్ రేస్ క్లబ్,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 136

ఇతర లంకెలు[మార్చు]