Jump to content

వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2019

వికీపీడియా నుండి
2019 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు

01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26
27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

2019 సంవత్సరం లోని వాక్యాలు

01 వ వారం

02 వ వారం

03 వ వారం

04 వ వారం

  • ..."పరమాత్మ రమణ" గా సుపరిచితులైన మానవతావాది మలిశెట్టి వెంకటరమణ అనీ!
  • ... బ్రిటిష్ వారు రాయలసీమలో అడుగుపెట్టిన తొలి సంవత్సరంలోనే వారి నిరంకుశ పాలనను ఎదిరించినవాడు ముతుకూరి గౌడప్ప అనీ!
  • ... శ్రీ కంచి కామకోటి పీఠం ఆస్థాన విధ్వాంసుడు అయ్యగారి శ్యామసుందరం అనీ!
  • ... తెలంగాణ లో సామాజిక న్యాయం కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కాసాని నారాయణ అనీ!
  • ... నైపుణ్యాభివృద్ధి అంటే పెద్దగా తెలియని రోజుల్లో టెక్నికల్‌ కాలేజీల్లో కోర్సులు నిర్వహించిన విద్యావేత్త సి. సుబ్బారావు అనీ!

05 వ వారం

  • ... స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణుడు ఖాదర్‌వలి మిల్లెట్ మ్యాన్ గా సుప్రసిద్ధులనీ!
  • ... విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో అయ్యగారి సోమేశ్వరరావు టాప్ గ్రేడు వైణికునిగా ఉండేవారనీ!
  • ... నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన పోలీసు చర్యనూ విమర్శిస్తూ గళమెత్తిన దళిత కవి వయ్య రాజారాం అనీ!
  • ... కేరళలో లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరసన ఏర్పడిన మానవ గొలుసు వనితా మాథిల్ అనీ!
  • ... హితకారిణి కందుకూరి వీరేశలింగం స్థాపించిన సామాజిక సేవా సంస్థ అనీ!

06 వ వారం

07 వ వారం

08 వ వారం

  • ...భారతరత్న పురస్కార గ్రహీత భూపేన్ హజారికా ప్రముఖ సంగీతకారుడు, గాయకుడు అనీ!(చిత్రంలో)
  • ...పద్మశ్రీ పురస్కార గ్రహీత దేవరపల్లి ప్రకాశ్ రావు టీ అమ్ముకొని జీవనం సాగించే ఓ తెలుగు వ్యక్తి అనీ!
  • ... సచార్ కమిటీ 2005 లో భారతదేశంలో ముస్లింల స్థితిగతులపై విచారణకు వేసిన కమిటీ అనీ!
  • ... ఆఫ్రికా దేశంలోని మలావి దేశాన్ని ది వాం హార్ట్ ఆఫ్ ఆఫ్రికా అని వ్యవహరిస్తారనీ!
  • ... 1933 లో విడుదలైన కింగ్ కాంగ్ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలో మొదటిసారిగా రెండు థియేటర్లలో విడుదలైన చిత్రంగా రికార్డు సృష్టించిందనీ!

09 వ వారం

10 వ వారం

11 వ వారం

  • ...ఎందరో మహిళలకు ఉపాధి అవకాశాలను అందిస్తూ ఉన్న కొయ్యాన శ్రీవాణి మహిళా కమీషన్ సభ్యురాలు అనీ!(చిత్రంలో)
  • ...పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు "రైతునేస్తం ఫౌండేషన్‌" వ్యవస్థాపకుడు అనీ!
  • ... మణిప్రవాళము అనేది రెండు భాషలలో కవితా పంక్తులు సమాంతరంగా నడిచే సాహిత్య శైలి అనీ!
  • ... కాళ్ల సత్యనారాయణ ను స్పానిష్ చిత్రకారుడు ఫ్రాన్సిస్కో గోయా తో పోలుస్తారనీ!
  • ... తులిప్ పూల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వాడే విడిపూలు జర్బెరా అనీ!

12 వ వారం

  • ... ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులలో అంబటి చంటిబాబు ప్రముఖ కార్టూనిష్టు, రచయిత అనీ!(చిత్రంలో)
  • ... 1975 లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా విపక్షాలు కలిసి జనతా పార్టీ ఏర్పాటు చేశాయనీ!
  • ... చార్లీ చాప్లిన్ తీసిన మూకీ చిత్రం మోడరన్ టైమ్స్ ను సంభాషణలతోనే తీయాలని డైలాగులు రాసుకున్నా చివర్లో మనసు మార్చుకుని మూకీగా తీశాడనీ!
  • ... ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజు పట్నాయక్ మొదట్లో సైన్యంలో పనిచేశాడనీ, జమ్ము-కాశ్మీర్ మీద 1947లో దాడి జరిగినప్పుడు శ్రీనగర్లో అడుగుపెట్టిన తొలి సైనికుడు అతనేననీ!
  • ... భారత ఆహార సంస్థ మొట్ట మొదటి ప్రధాన కార్యాలయం చెన్నై అనీ!

13 వ వారం

  • ...గిరీశం పాత్ర కన్యాశుల్కం నాటకంలోనే కాక కొండుభొట్టీయం, గిరీశం లెక్చర్లు వంటి ఇతర సాహిత్య రచనల్లోనూ వస్తుందనీ!
  • ...ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ ముచ్చటపడి లండన్ బకింగ్ హాం పాలెస్ తరహాలో తన కోసం కట్టించుకున్న సైఫాబాద్ ప్యాలెస్ లో ఒక్కరోజూ గడపలేదనీ!
  • ...కరీంనగర్ పాతబజారులోని గౌరీశంకరాలయం సా.శ.1295-1323 మధ్యకాలంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు నిర్మించినట్టు భావిస్తారనీ!
  • ...ప్రపంచంలో అతి పెద్ద సినిమా సెట్ ను అమెరికాలోని శాన్ ఫెర్నాండో లోయలో 500 ఎకరాల విస్తీర్ణంలో ది గుడ్ ఎర్త్ సినిమా కోసం వేశారనీ!
  • ... రిమోట్ సెన్సింగ్ ద్వారా భూమిపై వాతావరణం, ఖనిజ సంపద లాంటి వాటి గురించి పరిశోధన చేస్తారనీ!

14 వ వారం

15 వ వారం

  • ... కైకలూరు మండలంలోని కొల్లేటికోట గ్రామం కొల్లేరు సరస్సు మధ్యలో ఒక ద్వీపంలో ఉందనీ, ఇక్కడి పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం దర్శించేందుకు భక్తులు పడవల్లోనూ, కర్రల వంతెనపైనా ప్రయాణించి చేరుకుంటారనీ!
  • ...శాన్ ఫ్రాన్సిస్కో సినిమా క్లైమాక్స్ ను ప్రపంచ సినిమా రంగంలో అతి గొప్ప క్లైమాక్స్ గా సినీ చరిత్రకారులు పరిగణిస్తారనీ!
  • ... రాజస్థాన్ లోని చాంద్ బవోరి మెట్ల బావి భారతదేశంలోకెల్లా లోతైన దిగుడు బావి అనీ!
  • ... రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధి కారక క్రిములను కనుగొన్న 100 ఏళ్ళ తర్వాత నుంచి మార్చి 24 న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారనీ!
  • ... హైదరాబాదులోని హోలీ ట్రినిటీ చర్చి 1847లో బ్రిటిష్ సైనికాధికారుల కోసం నిర్మించబడిన చర్చి అనీ!

16 వ వారం

మాలిక్ అంబర్
మాలిక్ అంబర్
  • ... మాలిక్ అంబర్ ఇథియోపియా నుంచి బానిసగా వచ్చి దక్కన్ సామ్రాజ్యంలో సైనిక నాయకుడిగా ఎదిగాడనీ!
  • ... సికింద్రాబాద్ క్లబ్ తెలంగాణా రాష్ట్రంలో ఉన్న పురాతనమైన క్లబ్ అనీ!
  • ... విలియం స్టాన్లీ మెర్విన్ సాహిత్యంలో అమెరికాలో ఉన్న అన్ని పురస్కారాలు గెలుచుకున్న రచయిత అనీ!
  • ... కేరళలోని మీన్ ముట్టి జలపాతాలు వయనాడ్ జిల్లాలో అతిపెద్ద జలపాతాలనీ!
  • ... హైదరాబాదులోని పాతబస్తీలో గల దార్-ఉల్-షిఫా యునానీ ఆసుపత్రి నాలుగు శతాబ్దాల క్రితమే ప్రపంచ ప్రసిద్ధి పొందిన ముడు ఆసుపత్రులలో ఒకటిగా పేరు గాంచిందనీ!

17 వ వారం

18 వ వారం

  • ... మలక్ పేటలో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ ప్రభుత్వానికి ప్రతియేటా సుమారు 200 కోట్లకు పైగా పన్నులు చెల్లిస్తుందనీ!
  • ... వైకుంఠపురం బ్యారేజ్ కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజికి ఎగువన నిర్మిస్తున్న మరో ఆనకట్ట అనీ!
  • ... డవ్ పట్టకం కాంతిని మనకిష్టమొచ్చిన మార్గంలో నియంత్రించడానికి ఉపయోగిస్తారనీ!

19 వ వారం

  • ... రాబర్ట్ బాయిల్ ఆధునిక రసాయన శాస్త్రానికి పునాది వేసిన వారిలో ఒకడనీ!
  • ... సత్తు పురాతన కాలం నుంచీ వాడుకలో ఉన్న లోహమనీ!
  • ... కేరళలో పెరియార్ నది తర్వాత రెండో పెద్ద నది పంపానది అనీ!
  • ... హైదరాబాదు లో బేగంపేటలో ఉన్న వికార్ మంజిల్ నిజాం ప్రధానమంత్రి వికారుల్ ఉమ్రా పేరుమీదుగా పిలవబడుతోందనీ!
  • ... బాతులాగా కనిపించే గ్రీబ్ పక్షి లో 22 జాతులు ఉన్నాయనీ!

20 వ వారం

  • ... అణు సిద్ధాంతం తత్వ శాస్త్ర భావనగా మొదలై తరువాత విజ్ఞాన శాస్త్ర పరిధిలోకి వచ్చిందనీ!
  • ... శబరిమల అయ్యప్ప ఆలయంలో కనిపించే పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అని వ్యవహరిస్తారనీ!
  • ... నిజాం కాలంలో పైగా ప్యాలెస్ అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంగా ఉపయోగించారనీ!
  • ... ప్రపంచంలో అతిచిన్న కోతి అయిన పిగ్మీ మార్మొసెట్ తన తలను 180 డిగ్రీల కోణంలో తిప్పగలదనీ!
  • ... 2019లో విడుదలైన మజిలీ సమంత, నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత కలిసి నటించిన మొదటి చిత్రమనీ!

21 వ వారం

  • ... డెకార్ట్ 1641లో రాసిన తత్వశాస్త్ర గ్రంథం నేటికీ విశ్వవిద్యాలయాల్లో ప్రామాణిక పాఠ్యపుస్తకంగా వాడుతున్నారనీ!
  • ... నల్గొండ పట్టణంలో ఉన్న లతీఫ్ సాహెబ్ దర్గా వెయ్యేళ్ళు చరిత్ర గలిగిదనీ!
  • ... తుమ్మల రమాదేవి భారతదేశంలో తొలిసారిగా మహిళల కోసం ప్రారంభించబడిన వనితా ఛానల్ నిర్వాహకురాలు అనీ!
  • ... 1872 లో స్థాపించబడిన అలియా బాలుర ఉన్నత పాఠశాల వారసత్వ భవనాల జాబితాలో చేర్చబడిందనీ!
  • ... ప్రపంచ జంతుజాలంలో 5% ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ దీవిలో ఉందనీ!

22 వ వారం

  • ... అరుణోదయ రామారావు తాను నెలకొల్పిన సంస్థనే ఇంటిపేరుగా చేసుకున్న విప్లవ కళాకారుడనీ!
  • ...సాగర సంగమం సినిమా పతాక సన్నివేశాల్లో వచ్చే "వేదం అణువణువున నాదం" పాటకు కాలికి తీవ్రగాయంతో అడుగుతీస్తే అడుగువేయలేని స్థితిలో కమల్ హాసన్ నాట్యంచేశాడనీ!
  • ... లోపలి మనిషి భారత మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు ఆత్మకథాత్మక నవల అనీ!
  • ... కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ముసలమ్మ మరణము 1900 లో ఆంధ్రభాషాభిరంజని పురస్కారం పొందిన పద్యకావ్యమనీ!

23 వ వారం

హేవ్ లాక్ వంతెన
హేవ్ లాక్ వంతెన

24 వ వారం

25 వ వారం

26 వ వారం

  • ... కోయంబత్తూరులో "ఓజోన్ యోగా సంస్థను" స్థాపించిన యోగా గురువు వి.నానమ్మల్ అనీ!(చిత్రంలో)
  • ...ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి యేటా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహింపబడుతుందనీ!
  • ... స్త్రీ పాత్రల కంటే పురుష పాత్రలను అధికంగా ప్రదర్శిస్తున్న తెలంగాణ హరికథా కళాకారిణి పద్మాలయ ఆచార్య అనీ!

27 వ వారం

28 వ వారం

  • ...జాసింగ్ దేవాలయం మరియు జాసింగ్ మసీదులను ఒకే చోట నిర్మించి జాసింగ్ మతసామరస్యాన్ని చాటాడనీ!
  • ...118 సంవత్సరాల చరిత్ర కలిగిన హేవ్ లాక్ వంతెనను 1997 లో భారతీయ రైల్వే నిలిపివేసినదనీ!
  • * ...25 ఏళ్ల 3 నెలల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్‌సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన ప్రతినిధి గొడ్డేటి మాధవి అనీ!

29 వ వారం

  • ... బి.వి.పరమేశ్వరరావు మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కోరి మహిళా సంఘాలను ప్రారంభించిన వారిలో మొదటి వాడనీ!
  • ... మడోనా ను పాప్ సంగీతానికి రాణిగా వ్యవరిస్తారనీ!
  • ... దీపా మాలిక్ ప్రమాదవశాత్తూ చక్రాలకుర్చీకే పరిమితమైనా పారా ఒలంపిక్స్ లో పాల్గొని వెండి పతకం సాధించిందనీ!
  • ... జపనీస్ సినిమా సెవెన్ సమురాయ్ 1586 నాటి ఆ దేశ చరిత్ర ఆధారంగా రూపొందించబడినదనీ!
  • ... ఓం బిర్లా భారతదేశ 17వ లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికయ్యాడనీ!

30 వ వారం

31 వ వారం

32 వ వారం

33 వ వారం

34 వ వారం

  • ...వికీమీడియా ఫౌండేషన్ హోస్ట్ చేసిన సహకారంతో సవరించగల జ్ఞాన భాండారము వికీడేటా అనీ!
  • ...అతి పిన్న వయస్కుడైన భారత అమరవీరుడు బాజీ రౌట్ అనీ!
  • ...భూదాన్ ఉద్యమంలో తన 14 ఎకరాల స్థలాన్ని పంచిన స్వాతంత్ర్య సమరయోధుడు మహమ్మద్‌ బాజి అనీ!
  • ...ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగులను కాపాడి సంరక్షించాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటారనీ!

35 వ వారం

  • ...అనాథగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కలిఖో పుల్అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగారనీ!(చిత్రంలో)
  • ...మహిళలు, చిన్నారుల భద్రతకు సి.ఎస్.రంగరాజన్ స్థాపించినది జటాయు సేన అనీ!
  • ....పాంచాల పరాభవం నాటకంలో పంజాబ్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం ఇమడ్చబడినదనీ!
  • ...నీలగిరి తార్ అనే ఒక అంతరించి పోతున్న జంతువు సంరక్షణ కోసం ముకుర్తి జాతీయ ఉద్యానవనం నిర్మించబడినదనీ!

36 వ వారం

37 వ వారం

38 వ వారం

39 వ వారం

40 వ వారం

41 వ వారం

  • ... సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి ప్రాణకోటికి ఓజోన్ పొర రక్షిస్తున్నదనీ!
  • ...అంతరించి పోతున్న నీలగిరి తార్‌ అనే జంతువులకు పేరుగాచింది ఎరవికులం జాతీయ ఉద్యానవనం అనీ!
  • ...మగధను 138 సంవత్సరాలు పరిపాలించిన రాజవంశం ప్రద్యోత వంశం అనీ!
  • ... ఇండో-ఆర్య భాషలను మాట్లాడే ప్రజలు ఒక బిలియను మందికంటే అధికంగా ఉన్నారనీ!

42 వ వారం

  • ...పర్యావరణంపై "భవితకోసం శుక్రవారం" పేరుతో గ్రెటా థన్ బర్గ్ పోరాటం చేస్తున్నదనీ!
  • ... పాండవులను చంపడానికి లక్క గృహాన్ని నిర్మించినది పురోచనుడు అనీ!
  • ...9 వ శతాబ్దం ప్రారంభంలో పాలా సామ్రాజ్యం ఉత్తర భారత ఉపఖండంలో ఆధిపత్య శక్తిగా ఉందనీ!
  • ... ఒపెరా పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో ఒక ముఖ్య భాగమనీ!

43 వ వారం

  • ... 2000 సంవత్సరాల కిందట అగ్నిపర్వత విస్ఫోటనంలో నాశనమై పోయిన ఇటలీ నగరం, పాంపేలో భారతదేశంలో తయారైన యక్షి విగ్రహం దొరికిందని, దీన్ని పాంపే లక్ష్మి అంటారనీ! (చిత్రంలో)
  • ... క్షయ వ్యాధిని నిరోధించటానికి బి. సి. జి టీకా ను ఉపయోగిస్తారనీ!
  • ... బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గౌరవ గ్రాడ్యుయేట్ కామిని రాయ్ అనీ!
  • ... గుప్తరాజవంశానికి చెందిన మొదటి చక్రవర్తి మొదటి చంద్రగుప్తుడు అనీ!

44 వ వారం

  • ... జోసెఫ్ ప్లాటూ కనుగొన్న "ఫెనాకిస్టిస్కోప్" అనే పరికరం చలన భ్రమను సృష్టించి చివరికి "సినిమా" అభివృద్ధికి దారితీసింది.
  • ... సాధనద్వారా అష్టమాసిద్ధులను సాధించినవారు సిద్ధులు అనీ!
  • ...పూర్వం రాముడు లంకేయులపై నిఘా ఉంచడానికి బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనాన్ని లక్మణుడికి ఇచ్చినట్లు చరిత్ర చెబుతోందనీ!
  • ...అక్టోబరు 4 నుండి అక్టోబరు 10 వరకు వారంరోజులపాటు ప్రపంచ అంతరిక్ష వారం నిర్వహించబడుతుందనీ!

45 వ వారం

46 వ వారం

47 వ వారం

48 వ వారం

49 వ వారం

  • ...గాలి పీల్చుకునే జెట్ ఇంజిన్ యొక్క ఒక రూపం ర్యామ్‌జెట్ అనీ!
  • ...సింధు లోయ నాగరికత కాలానికి చెందిన పురావస్తు ప్రదేశం బనావలీ అనీ!
  • ... ప్రపంచంలోని అతి చిన్న, అత్యాధునిక కెమెరా ఓవీఎం 6948 కెమెరా అనీ!
  • ...మొఘలు చక్రవర్తి జహంగీరు పెద్ద కుమారుడు ఖుస్రౌ మిర్జా అనీ!
  • ...ప్రపంచంలొనే మొట్టమొదటి పాలిన్ డ్రోమ్ చిత్రం "అవర్ గ్లాస్" నిర్మాత శ్రీను పాండ్రంకి అనీ!

50 వ వారం

51 వ వారం

52 వ వారం

  • ...నేరం చేసిన తన కుమారుడుకి మరణశిక్ష విధించి అసమాన న్యాయనిర్ణేతగా ఎల్లాళను గుర్తింపబడినాడనీ!
  • ... విజయనగరానికి గొప్ప పాలకుడిగా పరిగణించబడే కృష్ణదేవరాయ చక్రవర్తి పెద్దభార్య తిరుమల దేవి అనీ!
  • ... నానేఘాటు శిలాశాసనం మొదటి శాతకర్ణి పాలనలో తయారు చేయబడిందని భావిస్తున్నారనీ!
  • ... హర్యాంక రాజవంశ స్థాపకుడు బింబిసారుడు అనీ!
  • ... సామ్రాజ్య శాసనాలు జారీ చేసిన మౌర్య రాజవంశం చివరి పాలకుడు దశరధమౌర్య అనీ!