Jump to content

ఇంద్రప్రస్థం

వికీపీడియా నుండి
అర్జునుడు[permanent dead link], శ్రీ కృష్ణుడు ఇంద్రప్రస్థ నగరాన్ని ఎత్తైన ప్రదేశం నుండి చూస్తున్నారు

ఇంద్రప్రస్థం (" ఇంద్ర మైదానం" [1] లేదా "ఇంద్ర నగరం") పురాతన భారతీయ సాహిత్యంలో కురు రాజ్య నగరంగా పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో పాండవుల నేతృత్వంలోని రాజ్యానికి ఇది రాజధాని. పాలీ భాషలో ఇది ఇందపట్ట గా పిలువబడుతుంది. బౌద్ధ గ్రంథాలలో కురు మహాజనపద రాజధానిగా కూడా ఇది పేర్కొనబడింది. ఇది ప్రస్తుత న్యూఢిల్లీ ప్రాంతంలో, ముఖ్యంగా పాత కోట ( పురాణ ఖిలా ) లో ఉన్నట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇది కచ్చితంగా నిర్ధారించబడలేదు. ఈ నగరాన్ని కొన్నిసార్లు ఖాండవప్రస్థ అని కూడా పిలుస్తారు. ఖాండవప్రస్థ యమునా నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతం పేరు ( మహాభారతం ప్రకారం). ఇచట ఈ నగరాన్ని నిర్మించారని తెలుస్తుంది.

చరిత్ర

[మార్చు]

ఇంద్రప్రస్థం పేరు 400 BCE, 400 CE మధ్య కాలంలో రాసిన సంస్కృత భారతీయ గ్రంథం ఐన మహాభారతం లో ప్రస్తావించబడింది. మహాభారతం ప్రకారం ఇది పాండవుల నివాసంగా చెప్పబడింది. ఇంద్రప్రస్థ యొక్క స్థానం అనిశ్చితంగా ఉంది, కాని ప్రస్తుత న్యూఢిల్లీ లోని పురానా ఖిలా ప్రాంతం అప్పటి ఇంద్రప్రస్థంగా ఉదహరించబడింది. [a] 14 వ శతాబ్దం నాటి పురాతన గ్రంథాలలో ఈ విషయం గుర్తించబడింది.[3] 20 వ శతాబ్దం ప్రారంభంలో పురాణ ఖిలా ప్రాంతానికి ఆధునిక రూపం ఇందర్‌పాట్ గా చెప్పబడింది.[4] పురాతన భారతీయ స్థల-పేర్ల అధ్యయనంలో, మైఖేల్ విట్జెల్ సంస్కృత పురాణాల నుండి అనేక ప్రదేశాలైన కౌశంబి / కోసం వంటి ఆధునిక కాలంలో అలాగే ఉంచబడిన వాటిలో ఇది ఒకటిగా భావించాడు.[5]

పురాణ ఖిలా కచ్చితంగా ఒక పురాతన స్థావరం, కానీ 1950 ల నుండి అక్కడ జరిపిన పురావస్తు అధ్యయనాలు [b] [c] మహాభారతం వివరించిన కాలంలో నిర్మాణ వైభవాన్ని, గొప్ప జీవితాలను నిర్ధారించే నిర్మాణాలు, కళాఖండాలను వెల్లడించడంలో విఫలమయ్యాయి. . చరిత్రకారుడు ఉపీందర్ సింగ్, "అంతిమంగా, పాండవులు లేదా కౌరవులు ఎప్పుడైనా జీవించారా అని నిశ్చయంగా నిరూపించడానికి లేదా నిరూపించడానికి మార్గం లేదు...."  [3] అయితే, ఇది పురాతన నగరం యొక్క ప్రధాన భాగం ఇప్పటివరకు తవ్వకాల ద్వారా నిర్థారింపబడలేదు అని తెలిపాడు.

ఇంద్రప్రస్థ మహాభారతం నుండి మాత్రమే మనకు తెలియదు . పాలి- భాషా బౌద్ధ గ్రంథాలలో దీనిని "ఇందపట్ట" లేదా "ఇందపట్టణ" అని కూడా పిలుస్తారు. ఇక్కడ దీనిని కురు రాజ్యానికి రాజధానిగా వర్ణించారు.[7] ఇది యమునా నది ప్రక్కన ఉంది.[8] బౌద్ధ సాహిత్యం హత్తినిపుర ( హస్తినాపుర ), కురు రాజ్యంలోని అనేక చిన్న పట్టణాలు, గ్రామాలను కూడా ప్రస్తావించింది. ఇంద్రప్రస్థ అలాగే గ్రీకో-రోమన్ ప్రపంచానికి తెలిసి ఉండవచ్చు: 2వ శతాబ్దంలో టాలెమీ రాసిన భౌగోళిక డేటింగ్ లో ఈ నగరం "ఇందబర"గా చెప్పబడింది. ఈ పదం ప్రాకృతిక రూపం "ఇందబట్ట" నుండి బహుశా ఉత్పత్తి అయి ఉండవచ్చు. ఇది బహుశా న్యూఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఉండవచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం.[9] ఉపేందర్ సింగ్ (2004) ఇంద్రబరతో ఇంద్రప్రస్థ ఉత్పత్తిని "ఆమోదయోగ్యమైనది"గా వర్ణించాడు.[10] సా.శ. 1327 నాటి సంస్కృత శాసనంలో న్యూఢిల్లీ ప్రాంతంలోని ప్రతిగాణ (జిల్లా) కు ఇంద్రప్రస్థ పేరు పెట్టబడింది, దీనిని న్యూఢిల్లీ లోని రైసినా ప్రాంతంలో కనుగొన్నారు.[11]

ఎపిగ్రాఫిస్టు అయిన డి.సి.సిర్కార్ ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో ముఖ్యమైన నగరంగా భావించాడు. ఆ కాలంలో ఢిల్లీ ప్రాంతంలో కనిపించే ఒక రాతి చెక్కడాలు విశ్లేషణ ఆధారంగా, మౌర్య చక్రవర్తి అశోకుని పాలనలోని శ్రీనివసపురి ఈ ఇంద్రప్రస్థ ప్రాంతమని చెప్పబడింది. ఈ వివరణపై సింగ్ సందేహం వ్యక్తం చేశాడు, ఎందుకంటే శాసనం వాస్తవానికి ఇంద్రప్రస్థను సూచించలేదు. అతని వాదన ప్రకారం ఇది  "ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం కచ్చితంగా రాతి శాసనం సమీపంలోనే ఉండి ఉండాలి. కానీ కచ్చితంగా ఈ ప్రాంతమని అనిశ్చితంగా ఉంది. "అదేవిధంగా ఇచట అశోకునితో సంబంధం ఉన్న ఇనుప స్తంభం వంటి అవశేషాలు ఉన్నాయి నిస్సందేహంగా ఇది ఇంద్రప్రస్థం కాదు: వాటి కూర్పు విలక్షణమైనది, శాసనాలు అస్పష్టంగా ఉన్నాయి.[3]

2014 నాటికి, పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా పురానా ఖిలాలో తవ్వకం కొనసాగిస్తోంది.[12]

ప్రస్తావనలు

[మార్చు]

గమనికలు

  1. For instance, Indologist J. A. B. van Buitenen, who translated the Mahabharata, wrote in 1973 that "there can be no reasonable doubt about the locations of Hastinapura, of Indraprastha (Delhi's Purana Qila [...]), and of Mathura.[2]
  2. Archaeological surveys were carried out in 1954-1955 and between 1969 and 1973.[6]
  3. The 1954-1955 sessions revealed pottery of the Painted Grey Ware (before c.600 BCE), Northern Black Polished Ware (c.600-200 BCE), Shunga, and Kushan Empire periods. The 1969-1973 sessions failed to reach the PGW levels, but found continuous occupation from the NBPW period to the 19th century: the Maurya-period settlement yielded mud-brick and wattle-and-daub houses, brick drains, wells, figurines of terracotta, a stone carving, a stamp seal impression, and a copper coin.[4]

ఉదాహరణలు

  1. Upinder Singh (25 September 2017). Political Violence in Ancient India. Harvard University Press. p. 401. ISBN 978-0-674-98128-7.
  2. J. A. B. van Buitenen; Johannes Adrianus Bernardus Buitenen; James L. Fitzgerald (1973). The Mahabharata, Volume 1: Book 1: The Book of the Beginning. University of Chicago Press. p. 12. ISBN 978-0-226-84663-7.
  3. 3.0 3.1 3.2 Singh, Upinder, ed. (2006). Delhi: Ancient History. Berghahn Books. pp. xvii–xxi, 53–56. ISBN 9788187358299.
  4. 4.0 4.1 Amalananda Ghosh (1990). An Encyclopaedia of Indian Archaeology, Volume 2. Munshiram Manoharlal Publishers. pp. 353–354. ISBN 978-81-215-0089-0.
  5. Witzel, Michael (1999). "Aryan and non-Aryan Names in Vedic India. Data for the linguistic situation, c. 1900-500 B.C.". In Bronhorst, Johannes; Deshpande, Madhav (eds.). Aryan and Non-Aryan in South Asia (PDF). Harvard University Press. pp. 337–404 (p.25 of PDF). ISBN 978-1-888789-04-1.
  6. Singh, Upinder, ed. (2006). Delhi: Ancient History. Berghahn Books. p. 187. ISBN 9788187358299.
  7. H.C. Raychaudhuri (1950). Political History of Ancient India: from the accession of Parikshit to the extinction of the Gupta dynasty. University of Calcutta. pp. 41, 133.
  8. Moti Chandra (1977). Trade and Trade Routes in Ancient India. Abhinav Publications. p. 77. ISBN 978-81-7017-055-6.
  9. J. W. McCrindle (1885). Ancient India as Described by Ptolemy. Thacker, Spink, & Company. p. 128.
  10. Upinder Singh (2004). The discovery of ancient India: early archaeologists and the beginnings of archaeology. Permanent Black. p. 67. ISBN 978-81-7824-088-6.
  11. Singh (ed., 2006), p.186
  12. Tankha, Madhur (11 March 2014). "The discovery of Indraprastha". The HIndu. Retrieved 14 March 2014.