మాఘ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Magha
Postal Stamp Issued for Poet Magha
Poet Magha
జననంc. 7th century
Shrimal (present-day Bhinmal)
వృత్తిPoet

మాఘ (కవి) (సు. సా. శ. 7 వ శతాబ్దం) (సంస్కృతం: माघ, Māgha) ఒక సంస్కృత కవి. ఆనాటి గుజరాత్ లోని శ్రీమల రాజధానిగా చేసుకుని పాలిస్తూన్న రాజా వర్మలత ఆస్థానంలో ఉండేవాడీయన. ఇతని తండ్రి దత్తక సర్వాచార్య, తాత సుప్రభదేవ [1] ఇతను వ్రాసిన ఒకే ఒక పద్య కావ్యం 20 సర్గలలో ఉన్న శిశుపాల వధ. ఈ కథా వస్తువు మహాభారతం లో యుధిష్టురుడు రాజసూయ యాగం చేసిన సందర్భంలో శ్రీకృష్ణుడు శిశుపాలుని శిరచ్ఛేదం చేసిన సన్నివేశం.[2] మాఘుడు భారవి చేత ప్రభావితుడయాడని చెబుతారు.

జీవిత సంగ్రహం[మార్చు]

మనకి తెలిసినంతవరకు మూఘుని యశస్సుకి ఏకైక కారణం శిశుపాల వధ. వల్లభదేవుడు, క్షేమేంద్రుడు మాఘుని రచనలు అంటూ కొన్ని శ్లోకాలని ఉదహరించేరు కాని అవి "శిశుపాల వధ"లో కానరావు. కాబట్టి మాఘుడి రచనలు ఇంకా ఉన్నాయని, అవి అలభ్యం అనీ కొందరి నమ్మకం.కొన్ని ఛెణుకులు[మార్చు]

  • "మాఘే మేఘే గతః వయః" - మాఘానికీ (అనగా, శిశుపాల వధకీ) మేఘసందేశానికీ వ్యాఖ్యానం చేసేసరికి బడలిపోయాను - మల్లినాథ సూరి
  • "భారవీ, మాఘమూ చదివే విద్యార్థికి గురువు చెప్పవలసినవి విశేషార్థాలూ, ధ్వనులూ, శాస్త్రమదర్యాదలూ - ఇత్యాదిగా సమగ్ర బోధ కానీ [...] తెనుగులో ప్రతిపదార్థం చెప్పడం కాదు." - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

మూలాలు[మార్చు]

  1. Keith, Arthur Berriedale (1993). A History of Sanskrit Literature, Delhi: Motilal Banarsidass, ISBN 81-208-1100-3, p.124
  2. Bhattacharji Sukumari, History of Classical Sanskrit Literature, Sangam Books, London, 1993, ISBN 0-86311-242-0, p.148.
"https://te.wikipedia.org/w/index.php?title=మాఘ&oldid=2683651" నుండి వెలికితీశారు